https://oktelugu.com/

నాతో శృంగారం చేస్తే మీతండ్రికి ఆక్సిజన్ ఇస్తా

సభ్య సమాజం తలదించుకునేలా పరిస్థితులు దిగజారుతున్నాయి. కరోనా కల్లోలంలో ఆస్పత్రుల్లో దారుణాది దారుణాలు జరుగుతున్నాయి. కరోనా పేరిట ఎన్నో అమానుషాలు సాగుతున్నాయి. కరోనా కాటుతో ఏం చేయలా పాలుపోక బాధితులు, కుటుంబ సభ్యులు అల్లాడిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ఢిల్లీలో దారుణం వెలుగుచూసింది. ఒక అమ్మాయి తన తండ్రికి ఆక్సిజన్ అవసరం అయ్యి ఊరు వాడా అంతా తిరిగింది. ఎక్కడ దొరుకుతుందా? అని తెలిసివారందరినీ అడిగింది. అయితే ఆమె ఇంటిపక్కనే ఉండే సోదరుడు వరుసయ్యే యువకుడిని అడిగింది. […]

Written By:
  • NARESH
  • , Updated On : May 13, 2021 / 10:03 PM IST
    Follow us on

    సభ్య సమాజం తలదించుకునేలా పరిస్థితులు దిగజారుతున్నాయి. కరోనా కల్లోలంలో ఆస్పత్రుల్లో దారుణాది దారుణాలు జరుగుతున్నాయి. కరోనా పేరిట ఎన్నో అమానుషాలు సాగుతున్నాయి. కరోనా కాటుతో ఏం చేయలా పాలుపోక బాధితులు, కుటుంబ సభ్యులు అల్లాడిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.

    తాజాగా ఢిల్లీలో దారుణం వెలుగుచూసింది. ఒక అమ్మాయి తన తండ్రికి ఆక్సిజన్ అవసరం అయ్యి ఊరు వాడా అంతా తిరిగింది. ఎక్కడ దొరుకుతుందా? అని తెలిసివారందరినీ అడిగింది. అయితే ఆమె ఇంటిపక్కనే ఉండే సోదరుడు వరుసయ్యే యువకుడిని అడిగింది. అయితే ఆమెకు చేదు అనుభవం ఎదురైంది.

    ఆక్సిజన్ సిలిండర్ కావాలంటే తనతో శృంగారం చేయాలని ఆ యువకుడు డిమాండ్ చేశాడు. తన ఇంటిపక్కనే ఉండే ఆ యువకుడు తన నిస్సహాయతను క్యాష్ చేసుకోవడం చూసి తట్టుకోలేని ఆ యువతి ట్విట్టర్ లో ఈ విషయాన్ని షేర్ చేసింది. అదిప్పుడు వైరల్ గా మారింది.

    ‘తన స్నేహితుడి చెల్లి తండ్రికి కరోనా పాజిటివ్ వచ్చిందని.. ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆక్సిజన్ అవసరం ఏర్పడిందని.. ఆక్సిజన్ కావాలంటే పొరుగింటి వ్యక్తి శృంగారం చేస్తేనే ఆక్సిజన్ సమకూర్చుతానని’ అన్నాడని ఓ యువతి ఈ విషయాన్ని ఎలుగెత్తి చాటింది. ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని.. వాడికి బుద్ది చెప్పాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది.