దెబ్బకు ఈసీకి ఇప్పుడు బుద్ది వచ్చిందా?

కరోనా మొదటి వేవ్ ను లైట్ తీసుకున్న కేంద్రంలోని బీజేపీ, ఎన్నికల సంఘం చేసిన పొరపాట్లు, నిర్లక్ష్యం కారణంగానే దేశంలో సెకండ్ వేవ్ వచ్చినట్టు ఆరోపణలున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు సహా దేశవ్యాప్తంగా వివిధ ఎన్నికలు పెట్టడంతో సెకండ్ వేవ్ వచ్చి ఇప్పుడు పరిస్థితి అల్లకల్లోలంగా మారిందని విమర్శలు వచ్చాయి. ఢిల్లీ, మద్రాస్ హైకోర్టులు సైతం కేంద్ర ఎన్నికల సంఘం తీరును కడిగిపారేశాయి. మద్రాస్ హైకోర్టు అయితే కేంద్ర ఎన్నికల అధికారులపై హత్య కేసు పెట్టాలని తీవ్ర […]

Written By: NARESH, Updated On : May 13, 2021 9:34 pm
Follow us on

కరోనా మొదటి వేవ్ ను లైట్ తీసుకున్న కేంద్రంలోని బీజేపీ, ఎన్నికల సంఘం చేసిన పొరపాట్లు, నిర్లక్ష్యం కారణంగానే దేశంలో సెకండ్ వేవ్ వచ్చినట్టు ఆరోపణలున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు సహా దేశవ్యాప్తంగా వివిధ ఎన్నికలు పెట్టడంతో సెకండ్ వేవ్ వచ్చి ఇప్పుడు పరిస్థితి అల్లకల్లోలంగా మారిందని విమర్శలు వచ్చాయి. ఢిల్లీ, మద్రాస్ హైకోర్టులు సైతం కేంద్ర ఎన్నికల సంఘం తీరును కడిగిపారేశాయి. మద్రాస్ హైకోర్టు అయితే కేంద్ర ఎన్నికల అధికారులపై హత్య కేసు పెట్టాలని తీవ్ర వ్యాఖ్యలు చేశాయి.

అన్ని చేతులు ఇప్పుడు ఈసీ, కేంద్రప్రభుత్వం వైపే చూపించాయి. ఈ క్రమంలోనే మరోసారి ఇంతటి కల్లోలంలో ఏలాంటి నిర్ణయం తీసుకోవడానికి సాహసించడం లేదు ఎన్నికల సంఘం. తాజాగా తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పట్లో ఉండవు అని.. కరోనా ఉధృతి తగ్గిన తర్వాతే ఉంటాయని సీఈసీ తేల్చిచెప్పింది. పరిస్థితులు మెరుగుపడిన తర్వాతే ఎన్నికల నిర్వహణకు ఆలోచిస్తామని పేర్కొంది.

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఖాళీలపై ఇటీవలే ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఆ లేఖపై స్పందించిన సీఈసీ ఇప్పట్లో ఎన్నికలు ఉండవు అని తమ నిర్ణయాన్ని తెలిపింది. ఇప్పటికే ఎన్నికలతో దేశంలో సెకండ్ వేవ్ కు కారణమైందన్న ఆరోపణలు ఈసీ మూటగట్టుకుంది. అందుకే ఇక మరోసారి ఏ ఎన్నికల జోలికి వెళ్లకూడదని కేంద్ర ఎన్నికల సంఘం డిసైడ్ అయ్యింది.