ఇంకెన్నాళ్లు వ్యాక్సిన్ కొరత..?కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదా..?

కరోనా సెకండ్ వేవ్ తో లక్షల మంది ప్రాణాలు విడిచారు. కోట్ల మంది వైరస్ కోరల్లో చిక్కుకున్నారు. వీరిలో ఎంత మంది బతికి బట్టగడుతారో తెలియని పరిస్థితి. అయినా ప్రభుత్వం చూస్తూ ఉంటుందే తప్పా.. ఎలాంటి పటిష్ట చర్యలు తీసుకోవడం లేదన్నది రాజీకీయ విశ్లేషకుల వాదన. వ్యాక్సిన్ వేస్తే ప్రజలను కాపాడినట్లేనని ప్రభుత్వం గొప్పలు చెప్పినా.. ఆ వ్యాక్సిన్ త్వరగా ప్రజలందిరికీ అందించేలా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దేశ వ్యాప్తంగా కనీస మందికి కూడా సెకండ్ […]

Written By: NARESH, Updated On : May 14, 2021 8:57 am
Follow us on

కరోనా సెకండ్ వేవ్ తో లక్షల మంది ప్రాణాలు విడిచారు. కోట్ల మంది వైరస్ కోరల్లో చిక్కుకున్నారు. వీరిలో ఎంత మంది బతికి బట్టగడుతారో తెలియని పరిస్థితి. అయినా ప్రభుత్వం చూస్తూ ఉంటుందే తప్పా.. ఎలాంటి పటిష్ట చర్యలు తీసుకోవడం లేదన్నది రాజీకీయ విశ్లేషకుల వాదన. వ్యాక్సిన్ వేస్తే ప్రజలను కాపాడినట్లేనని ప్రభుత్వం గొప్పలు చెప్పినా.. ఆ వ్యాక్సిన్ త్వరగా ప్రజలందిరికీ అందించేలా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దేశ వ్యాప్తంగా కనీస మందికి కూడా సెకండ్ డోస్ పడకపోవడంతో ఈ ప్రక్రియ ఫెయిల్ అయిందనే అంటున్నారు. అయితే వ్యాక్సిన్ కొరత రావడానికి ఉత్పత్తి కంపెనీలు తమ ఫార్మూలాను బయటపెట్టకపోవడంతో ఉత్పత్తి ఆలస్యమవతుంది. దీంతో సరైన సమయంలో ప్రజలకు వ్యాక్సిన్ అందక ప్రజలప్రాణాలు పోతున్నాయి.

దేశంలో భారత్ బయోటెక్, సీరమ్ ఇనిస్టిట్యూట్ లు మాత్రమే ఇప్పటి వరకు వ్యాక్సిన్లు ప్రజలకు అందుబాటులోకి తెచ్చాయి. దీంతో కోవీషీల్డు, కోవాగ్జిన్ పేరుతో వచ్చిన వీటిని చాలా మంది మొదటి డోస్ తీసుకున్నారు. అయితే ఈ కంపెనీలను నమ్మిన కేంద్ర ప్రభుత్వం ఈ నెల 1 నుంచి ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేసే ప్రక్రియను స్టాట్ చేస్తామని అన్నారు. అయితే అనుకున్న సమయానికి కంపెనీలు వ్యాక్సిన్లు అందించలేకపోయాయి. దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆపేశారు. ఇప్పటి వరకు మొదటి డోస్ తీసుకున్న వారికే నిబంధనలతో రెండో డోస్ వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కరోనా వైరస్ విజృంభిస్తూ ప్రాణాలు పోతున్నాయి. కంపెనీలపై కంట్రోల్ లేని ప్రభుత్వాలు చేసేదేమీ లేక లాక్డౌన్ ప్రకటించేశాయి. అయితే లాక్డౌన్ తో వైరస్ వ్యాప్తి ఆగిపోయినా పేద ప్రజలు ఆర్థికంగా చితికి బలయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో లాక్డౌన్లు పెట్టుకుంటూ పోయే బదులు వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే కంపెనీలపై కొన్ని చట్టాలు తీసుకు రావాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఇప్పటి వరకు వ్యాక్సిన్లను అందుబాటులోకి తెచ్చిన కంపెనీలు తమ ఫార్మూలాను బయటకు పెట్టాలని కొందరు అంటున్నారు.

ఆ కంపెనీలు తమ ఫార్మూలాను బయటపెట్టకుండా.. అవసరానికి వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయకుండా ఉండడంతో అమాయకులు బలవుతున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వాలు సైతం విపత్కర సమయంలో కంపెనీలపై ఆధిపత్యం చెలాయించలేని పరిస్థితులో ఉందంటే కచ్చితంగా ప్రజలకు అన్యాయం చేసినట్లేనని అంటున్నారు. ఇప్పటికైనా కంపెనీలు తమ పెటెంట్ హక్కులను ఇతర కంపెనీలకు చెబితే వ్యాక్సిన్లు మరిన్ని ఉత్పత్తి అయి ప్రజలకు అందుబాటులోకి వ్యాక్సిన్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇందుకోసం ప్రభుత్వం కంపెనీల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అంటున్నారు.