MLA Roja: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజాకు ఉన్న ప్రాముఖ్యత అందరికి తెలిసిందే. వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన ఆమెకు మంత్రి పదవి మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. సామాజిక సమీకరణల నేపథ్యంలో ఆమెను మంత్రి పదవి దూరం చేస్తున్నా ఆమెలో మాత్రం ఆగ్రహం పెరుగుతోందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ సారి మంత్రి వర్గ విస్తరణలో ఆమెకు స్థానం తప్పనిసరి అనే అంచనాలు వినిపిస్తున్నాయి. కానీ కుల సామాజిక వర్గాల ప్రభావంతోనే ఆమెకు పదవి దక్కకుండా పోతోందని తెలిసినా ఆమె ఈసారి మాత్రం ఊరుకోదనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం మీద తన అక్కసు వెళ్లగక్కుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఉన్నది ఉన్నట్లు మాట్లాడటంలో రోజా ముందుంటారు. మనసులో ఏది దాచుకోకుండా కుండ బద్దలు కొట్టినట్లు వెల్లడించడం ఆమెకు అలవాటు. దీంతో మంత్రి పదవి దక్కకపోతే తన కోపం తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు. దీంతో ఈసారి రోజాకు మంత్రి పదవి దక్కడం ఖాయమే అనే వార్తలు వస్తున్నా జగన్ మదిలో ఏముందో ఎవరికి తెలుసు. ఏపీలో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఊహాగానాలు వెలువడుతున్న క్రమంలో రోజాకు పదవి దక్కుతుందో లేదో వేచి చూడాల్సిందే.
చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇచ్చే విలువ ఎంతో మనకు తెలుసు. ఆయన కూడా జగన్ చెప్పిన పనులు చక్కబెట్టడంలో ముందుంటారు. దీంతో ఆయనను కాదని మరొకరికి మంత్రి పదవి ఇవ్వరని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రోజా కోరిక నెరవేరుతుందా? లేదో అనే అనుమానాలు వస్తున్నాయి. రోజా కూడా అంకితభావంతోనే పనిచేస్తారని అందరికి తెలిసినా అధినేత మనసులో ఏముందో? అనే సంశయాలు వస్తున్నాయి.
మంత్రివర్గ విస్తరణలో రోజాకు స్థానం దక్కకకపోతే ఆమె స్పందన తీవ్ర స్థాయిలో ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలోనే మంత్రి పదవి దక్కకపోవడంతో ఆమె ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గైర్హాజరై తన అక్కసు వెళ్లగక్కారు. ఈసారి మాత్రం ఆమె రియాక్షన్ మామూలుగా ఉండదనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో జగన్ రోజాకు మంత్రి పదవి ఇస్తారనే ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి.