Rajasekhar: తెలుగు, తమిళ భాషల్లో హీరోగా పదుల సంఖ్యలో సినిమాల్లో నటించి రాజశేఖర్ పాపులారిటీని సొంతం చేసుకున్నారు. అయితే ఈ మధ్య కాలంలో రాజశేఖర్ నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే. అవకాశాలు తగ్గడంతో రాజశేఖర్ మల్టీస్టారర్ సినిమాలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం గమనార్హం. అయితే రాజశేఖర్ కు సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

యాంగ్రీ యంగ్ మేన్ గా పాపులారిటీని సొంతం చేసుకున్న రాజశేఖర్ మద్రాస్ లో అల్లరి ప్రియుడు శతదినోత్సవంలో పాల్గొన్న సమయంలో పదుల సంఖ్యలో ఫ్యాన్స్ ఆటోగ్రాఫ్ కొరకు రాజశేఖర్ ను చుట్టుముట్టారు. అయితే ఆ తర్వాత ఒక వ్యక్తి రాజశేఖర్ కు ఒక చీటీ అందజేశారు. ఆ చీటీలో నా కొడుకుకు సర్జరీకి ఆర్థిక సాయం అందించాలని ఒక మిడిల్ ఏజ్ వ్యక్తి అడగగా ఆ పేపర్ లో రాజశేఖర్ తన అడ్రస్ రాసి తన తమ్ముడిని కలవాలని పేర్కొన్నారు.
అయితే అడ్రస్ తీసుకున్న వ్యక్తికి తరువాత రోజు రాజశేఖర్ హైదరాబాద్ లో ఉంటారా? అనే సందేహం వచ్చింది. ఆ సందేహాన్ని వ్యక్తపరచగా రాజశేఖర్ అతని ప్రశ్నకు మా తమ్ముడు అన్నీ చూసుకుంటాడని సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత ఆ వ్యక్తికి రాజశేఖర్ తన తమ్ముడు గుణశేఖర్ ను పరిచయం చేశారు. ఆ తర్వాత ఆ వ్యక్తి గుణశేఖర్ సహాయంతో తన కొడుకుకు శస్త్ర చికిత్స చేయించారు. రాజశేఖర్ పైకి కొన్ని సందర్భాల్లో కోపంగా కనిపించినా అతని మనస్సు మాత్రం వెన్న అని అభిమానులు చెబుతున్నారు.