Mohan Babu: హైదరాబాద్ లో సినీ నటుడు మోహన్ బాబుతో ఏపీ మంత్రి పేర్ని నాని నిన్న భేటీ అయ్యారు. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై వారి మధ్య చర్చ జరిగింది. ఇందులో విష్ణు కూడా పాల్గొన్నారు. నిన్న సీఎంతో పలువురు సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. టికెట్లు, ఇతర అంశాలపై చర్చించారు. సీఎంను కలిసిన బృందంలో మోహన్‌బాబు, మా అధ్యక్షుడు మంచు విష్ణు లేరు. మరుసటిరోజే మోహన్‌బాబుతో పేర్ని నాని భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఒకవిధంగా మోహన్ బాబుకి మొన్న జగన్ తో జరిగిన మీటింగ్ కి ఆహ్వానం అందలేదు అనేసరికి ఆయన పరువు పోయినట్టు అయ్యింది. ఈ అంశం పై చాలామంది ట్రోల్ కూడా చేశారు. ఇవ్వన్నీ మోహన్ బాబు దృష్టికి వెళ్లాయి. మోహన్ బాబు ఇగో హర్ట్ అయ్యింది. వెంటనే జగన్ కి ఫోన్ వెళ్ళింది. జగన్ ఆదేశాల మేరకు పేర్ని నానిని మోహన్ బాబు ఇంటికి పంపించారు. మొత్తానికి మోహన్ బాబు ఇగో ఇలా చల్లారింది.

Also Read: ఇది జగన్ టైం.. చంద్రబాబు ఓపిక పట్టాల్సిందేనా?
ఇక ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరల వ్యవహారంపై సీఎం జగన్‌తో సినీ ప్రముఖులు సమావేశమైన సంగతి తెలిసిందే. అగ్ర కథానాయకులు చిరంజీవి, నాగార్జున, మహేశ్‌బాబు, ప్రభాస్ ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ సమావేశంతో మోహన్ బాబు ఇగో బాగా చల్లారింది.

ఇంతకీ ఈ మీటింగ్ లో సినిమా టికెట్ల ధరలు, చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం సాయం, ఇతర అంశాలు మాట్లాడారు. సీఎం జగన్.. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని మోహన్ బాబుకు అభయం ఇచ్చాడట. మరి జగన్ మేలు చేస్తే.. ఆ క్రెడిట్ తనదే అంటున్నారు మోహన్ బాబు.
Also Read: పవన్ కళ్యాణ్, చిరంజీవి: కత్తి దూసేది ఒకరు… కాంప్రమైజ్ చేసేది మరొకరు
[…] […]
[…] […]