Manchu Vishnu Tweet: హైదరాబాద్ లో సినీ నటుడు మోహన్ బాబుతో ఏపీ మంత్రి పేర్ని నాని భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే, సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై వారి మధ్య చర్చ జరిగిందని.. ఇందులో మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు కూడా పాల్గొన్నారని మంచు ఫ్యామిలీ బాగా డప్పు కొట్టుకుంది. మొన్న సీఎంతో పలువురు సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. టికెట్లు, ఇతర అంశాలపై చర్చించారు. అయితే, ఈ మీటింగ్ కి కొందరు మాత్రమే హాజరయ్యారు.

సీఎంను కలిసిన బృందంలో మోహన్‌బాబు, మా అధ్యక్షుడు మంచు విష్ణు లేరు. మరుసటిరోజే మోహన్‌బాబుతో పేర్ని నాని భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. దానికి తోడు మంచు విష్ణు కూడా ఈ భేటీని బాగా ప్రమోట్ చేశాడు. డబ్బులిచ్చి మారి మీడియాలో వార్తలు రాయించాడు.

Also Read: మరో క్రేజీ ఆఫర్ అందుకున్న క్రేజీ బ్యూటీ రష్మిక !
దాంతో మోహన్ బాబుతో మంత్రి పేర్ని భేటీ అంటూ మొత్తానికి ఈ వార్త బాగా వైరల్ అయ్యింది. వెంటనే విష్ణు ఈ వార్తను చూపించి.. ఇండస్ట్రీ సమస్యల పై అన్నీ రకాలుగా చర్చించాం అంటూ బాగానే తమ ఘనతను పెంచుకున్నాడు. ఇక్కడే ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు అడ్డంగా బుక్కయ్యాడు.

మంత్రి పేర్ని నాని తమ ఇంటికి వచ్చి సినిమా టికెట్ల ధరలు, ఇండస్ట్రీ మీద గవర్నమెంట్ ప్లాన్స్ గురించి చర్చించారంటూ.. నానితో కలిసి దిగిన ఫొటో ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన మంత్రి నాని ‘మర్యాదపూర్వకంగా వెళ్లాను. విష్ణు చెప్పినట్లు ఇండస్ట్రీ గురించి ఏం మాట్లాడలేదు’ అని చెప్పాడు. ఇంకేముంది సదరు ట్వీట్‌ను విష్ణు ఎడిట్ చేయాల్సి వచ్చింది. మొత్తానికి మంచు విష్ణు అడ్డంగా బుక్ అయ్యాడు.
Also Read: పవన్ కల్యాణ్ నట విశ్వరూపం చూస్తారట !

[…] Also Read: మళ్ళీ అడ్డంగా బుక్ అయిన మంచు విష్ణు ! […]