Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘భీమ్లా నాయక్’. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ను రివీల్ చేశారు నిర్మాత. భీమ్లానాయక్ సినిమాను తెలుగుతో పాటు హిందీలోనూ రిలీజ్ చేస్తామని ప్రొడ్యూసర్ నాగవంశీ తెలిపారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చెప్పారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ విశ్వరూపం చూస్తారని, ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా ఉంటుందని పేర్కొన్నారు.

ఇక ఈ మూవీ రిలీజ్ తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. కాగా రీసెంట్ గా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పవన్ ఫ్యాన్స్ కి వరుసగా అదిరిపోయే న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. భీమ్లా నాయక్ నుండి తదుపరి పాట గురించి ఆసక్తికరమైన అప్ డేట్ ఇచ్చాడు థమన్. ఈ సినిమాలో సాంగ్స్ అన్నీ అద్భుతంగా వచ్చాయని తెలుస్తోంది. ఇక థమన్ ఈ సినిమా అవుట్ ఫుట్ గురించి ఒక అప్ డేట్ ఇస్తూ.. డైరెక్టర్ త్రివిక్రమ్ తో కలిసి తాను ఇటీవల భీమ్లానాయక్ రఫ్ ఫుటేజీని చూశానని చెప్పాడు.
కాగా ఈ సినిమాలో పవన్ కల్యాణ్ యాక్షన్ తనకు ఎంతో నచ్చిందని, ఆయన కెరీర్ లోనే ఇది ఉత్తమ చిత్రం అవుతుందని థమన్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం బెస్ట్ మ్యూజిక్ అందించడానికి ప్రయత్నించానన్నాడు. అయ్యప్పన్ కోషియమ్ అనే మలయాళీ సినిమాకు రీమేక్ గా భీమ్లానాయక్ తెరకెక్కింది. రానా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.
Also Read: దివంగత పునీత్ రాజ్ కుమార్ పై ప్రశంసల వర్షం !

అయితే, పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ది బెస్ట్ మూవీ అంటూ థమన్ చెప్పడంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. భీమ్లా నాయక్ చిత్రం ఫిబ్రవరి 25, 2022 న విడుదల కానుందని తెలుస్తోంది. సినిమా ఇన్ సైడ్ వర్గాల్లో ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిబ్రవరి 25 అని.. ఈ డేట్ నే ఆల్ రెడీ ఫిక్స్ చేశారని కూడా తెలుస్తోంది. కాకపోతే ఈ సినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించనున్నారని టాక్ నడుస్తోంది. ఏది ఏమైనా పవన్ నుంచి వస్తున్న క్రేజీ మూవీస్ లో ఇది కూడా ఒకటి.
Also Read: మహేశ్ బాబు వద్దన్న 13 సినిమాలు ఇవే.. అన్నీ సూపర్ హిట్..!
[…] Also Read: పవన్ కల్యాణ్ నట విశ్వరూపం చూస్తారట ! […]