AP Early Elections: ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికలు హోరాహోరీగా సాగనున్నాయని సంకేతాలు వెలువడుతున్నాయి. అటు అధికార పక్షం.. ఇటు విపక్షాలమధ్య పెద్ద యుద్ధమే నడవనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా 16 నెలల వ్యవధి ఉన్న నేపథ్యంలో ఎవరిది గెలుపు? అన్న చర్చ మాత్రం నడుస్తోంది. అయితే గతానికి భిన్నంగా సామాన్యులు సైతం రాజకీయాలను విశ్లేషిస్తున్నారు. సమకాలిన రాజకీయ అంశాలపై ప్రతిఒక్కరికీ అవగాహన పెరగడంతో తమకు తోచిన విధంగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పొత్తుల లెక్కలు కట్టి మరీ చెబుతున్నారు. అయితే ఎవరూ ఏ లెక్క చెబుతున్నా అందులో జనసేన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. అసలు పార్టీ పేరు లేకుండా విశ్లేషణ జరగడం లేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. గ్రామాల్లో రచ్చబండ నుంచి టీవీల్లో డిబేట్ల వరకూ పవన్, జనసేన ప్రస్తావన లేకుండా చర్చలు సాగడం లేదు. అంతగా పెరిగింది జనసేన గ్రాఫ్, వాయిస్. అందుకే కాబోలు జనసేన లేని ప్రభుత్వాన్ని ఊహించుకోలేమని కూడా పవన్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు.

అయితే ఇప్పుడు ఏపీలో గెలుపెవరిది? అన్న చర్చ ఏ ఇద్దరు కలిసినా నడుస్తోంది. వైసీపీ నిలబెట్టుకుంటుందా? ప్రధాన ప్రతిపక్షం టీడీపీనా? లేకుంటే పవన్ జనసేనా? అని చర్చించుకుంటున్నారు. మూడు పార్టీలు వేర్వేరుగా పోటీచేస్తే వైసీపీకి అడ్వాంటేజ్… అదే టీడీపీ, జనసేన కలిస్తే కూటమికి ఫెచ్చింగ్ అంటూ లెక్కలు కడుతున్నారు. అయితే ఇందులో జనసేన ప్రస్తావనే ఎక్కువగా తెస్తున్నారు. వాస్తవ పరిస్థితి కూడా జనసేన వైపే మొగ్గుచూపుతోంది. టీడీపీ బలం పుంజుకున్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నా అది విజయానికి ఆమడ దూరమేనని కామెంట్స్ వినిపిస్తున్నాయి, ఆ దూరం భర్తీ కావాలంటే మాత్రం జనసేన సపోర్టు టీడీపీకి కచ్చితంగా అవసరం. అటు జనసేన గతం కంటే భిన్నంగా ఏపీ పాలిటిక్స్ లో పవన్ కింగ్ మేకరయ్యే మేజిక్ ఫిగర్ దాటేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 175 స్థానాలున్న ఏపీలో వచ్చే ఎన్నికల తరువాత నిర్ణయాత్మక శక్తిగా మారే చాన్స్ ఉందని చెబుతున్నారు.
ఇటీవల వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. అక్కడ అధికార పార్టీ అభ్యర్థులే గెలుపొందారు. అధికారంలో ఉన్న పార్టీకే జనాలు మొగ్గుచూపుతారని ఏపీలో అధికార పార్టీ విశ్వసిస్తోంది. పైగా దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నందున ప్రజలు తమకే పట్టం కడతారని భావిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉంది. సీనియర్ మంత్రి ధర్మాన సైతం ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ప్రజలు ప్రభుత్వాన్ని అర్ధం చేసుకోకపోవడం వల్లే ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని ధర్మాన తాజాగా కామెంట్స్ చేశారు. అటు వైసీపీ సర్కారు వరుసగా వచ్చిన ఏ ఎన్నికలను అయినా ఏకపక్షంగా సొంతం చేసుకుంటూ వచ్చింది. అందుకే 175 నియోజకవర్గాలను గెలుస్తామంటూ జగన్ గంటాపధంగా చెబుతూ వచ్చారు. కానీ సీన్ రివర్ష్ లో ఉందని ఆయనకు తెలియంది కాదు. కానీ బాధ్యతాయుతమైన పార్టీ అధినేతగా శ్రేణులో ధైర్యం నూరిపోయడానికి అమాత్రం ఎక్స్ పోజ్ కావాల్సిందే.

అయితే ఏపీలో అధికార వైసీపీ భావించినట్టు రెండోసారి విజయం సునాయాసం అయ్యేది. గత ఎన్నికల్లో ఓటమి తరువాత పవన్ నైరాశ్యంలోకి వెళ్లిపోతారు. పార్టీని ఏదో జాతీయ పార్టీలో విలీనం చేస్తారు అని భావించారు. కానీ పవన్ నిలబడ్డాడు, కలబడుతున్నాడు. వైసీపీ విముక్త ఏపీ కోసం పెద్ద యుద్దమే చేస్తున్నారు. జగన్ ఓటమికి, జనసేన విజయానికి మధ్య పవన్ నిల్చున్నాడు. వైసీపీకి ఓటమా, భారీ ఓటమా?అన్నది పవన్ పోషించే కీ రోల్ పై ఆధారపడి ఉంది. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వనని పదేపదే చెప్పడం ద్వారా పొత్తు సంకేతాలిచ్చారు. ఒక వేళ పొత్తు కుదిరినా.. ఇచ్చిపుచ్చుకునేటప్పుడు,, ఓట్ల బదలాయింపు వద్ద పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే తాను భావిస్తున్న వైసీపీ విముక్త ఏపీ సాధ్యమయ్యే అవకాశముంది. ఏపీ రాజకీయ యవనికపై కింగ్ మేకర్ పాత్ర పోషించే వీలుంది.