Undavalli Arun Kumar: చంద్రబాబు గెలిస్తే జగన్ గెలిచినట్టేనా? ఎలా సాధ్యం?

రాజమండ్రి సెంట్రల్ జైల్లో సౌకర్యాలపై సైతం ఉండవెల్లి మరోరకంగా విశ్లేషించారు. అక్కడ చాలా సౌకర్యవంతంగా ఉంటుందని.. ఈ విషయాన్ని టిడిపి నేతలే చెప్పారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఆరోగ్యం బాగా లేకపోతే ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించి మంచి వైద్యం ఇప్పించాలని కోరారు.

Written By: Dharma, Updated On : October 15, 2023 1:19 pm

Vundavalli Aruna Kumar

Follow us on

Undavalli Arun Kumar: చంద్రబాబు కేసుల విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇదో ప్రాధాన్యతాంశంగా మారిపోయింది. ఈ తరుణంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్కిల్ స్కాం కేసును సిబిఐ కి అప్పగించాలని కోరుతూ ఏకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తాజాగా విలేకర్ల సమావేశం నిర్వహించి కేసునకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.తాను ఎందుకు సిబిఐ దర్యాప్తును కోరింది. ఈ కేసు వెనుక అసలు ఉద్దేశం ఏమిటి అన్న విషయాలను వెల్లడించారు.

అయితే కర్ర విరగకూడదు.. పాము చావకూడదు అన్నట్టుఉండవెల్లి వ్యాఖ్యలు కొనసాగడం విశేషం.ఈ కేసులో సిబిఐ విచారణ జరిపిస్తేనే అన్ని విషయాలు బయటకు వస్తాయని.. చంద్రబాబుతో పాటు జగన్ కు ఇది మంచిదని చెప్పుకొచ్చారు. పైగా చంద్రబాబుకు నేరుగా ముడుపుల అందాయని ఆధారాలు లేవని.. కానీ ఆయన పీఏ ఖాతాలోకి డబ్బులు వెళ్లాయన్నది అంతే నిజం అన్నారు. స్కిల్ స్కాం కేసు అంతా సూట్ కేస్ కంపెనీల దేనిని తేల్చి చెప్పారు. అసలు వాస్తవాలు బయటకు రావాలనే తాను సిపిఐ విచారణ కోరుతున్నానని చెప్పుకొచ్చారు. ఇది ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపు చర్యగానే మరోవైపు అభిప్రాయపడ్డారు.

రాజమండ్రి సెంట్రల్ జైల్లో సౌకర్యాలపై సైతం ఉండవెల్లి మరోరకంగా విశ్లేషించారు. అక్కడ చాలా సౌకర్యవంతంగా ఉంటుందని.. ఈ విషయాన్ని టిడిపి నేతలే చెప్పారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఆరోగ్యం బాగా లేకపోతే ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించి మంచి వైద్యం ఇప్పించాలని కోరారు. అంతేకాదు చంద్రబాబు వయసు దృష్ట్యాఆయనకు హౌస్ అరెస్టు చేసి విచారణ జరపాలని కూడా సూచించారు.ఆయన ఈ రాష్ట్రానికి సుదీర్ఘకాలం పాలించిన సీఎం అని సైతం గుర్తు చేశారు.

ఉండవెల్లి ఇలా మాట్లాడుతున్న క్రమంలో సరికొత్త లాజిక్ పాయింట్ ను లేవనెత్తారు. ఈ కేసును కొట్టేయాలని చంద్రబాబు ఎలా కోరుతున్నారో తెలియడం లేదన్నారు. ఇది హై ప్రొఫైల్ కేసు అని.. దీనిని కొట్టేయడానికి వీలు లేదని ఉండవెల్లి తేల్చేశారు. పైగా 17 ఏ అన్నది చంద్రబాబుకు వర్తిస్తుంది అంటే.. జగన్ మీద కూడా కేసులే ఉండవని కొత్త పాయింట్ తీసుకొచ్చారు. క్యాబినెట్ నిర్ణయాలను ఎవరు ప్రశ్నించరాదని కొత్త విషయాలు చెబుతున్నారని.. అదే నిజం అనుకుంటే రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలకు జగన్ ఎలా బాధ్యులవుతారని ప్రశ్నించారు. అలా అయితే అసలు జగన్ మీద కేసులే పెట్టకూడదు అని తేల్చి చెప్పారు. మరోవైపు టిడిపి తో పొత్తు ప్రకటన విషయంలో పవన్ తొందర పడ్డారని.. తనను సంప్రదించి ఉంటే మరి కొద్ది రోజులపాటు ఆగాల్సి ఉండేదని సలహా ఇచ్చి ఉండేవాడినని ఉండవల్లి అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఉండవల్లి అరుణ్ కుమార్ ను టార్గెట్ చేసుకుంటున్నాయి.