spot_img
Homeజాతీయ వార్తలుNarendra Modi : అభినందన్‌ను విడుదల చేయకుంటే.. ఆరోజు పాకిస్తాన్‌కు కాళరాత్రే అయ్యేది!

Narendra Modi : అభినందన్‌ను విడుదల చేయకుంటే.. ఆరోజు పాకిస్తాన్‌కు కాళరాత్రే అయ్యేది!

Narendra Modi :  2019లో పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్‌ మధ్య సంబంధాలపై భారత మాజీ హైకమిషనర్‌ అజయ్‌ బిసారియా తన పుస్తకంలో వెల్లడించారు. నాడు రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత, భారత దౌత్య నీతితో పాక్‌ భయపడిన తీరు, ఉగ్రవాదంపై పాకిస్తాన్‌ తన తీరును ఎలా మార్చుకుంది తదితర అంశాలను తన పుస్తకంలో వెల్లడించారు.

అభినందన్‌ను బంధించి..
2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో సైనిక కాన్వాయ్‌పై ఉగ్రవాదులు భీకర దాడి చేశారు. దీనికి ప్రతిగా బాలాకోట్‌లో ఉగ్ర శిబిరాలపై భారత్ వైమానిక దాడులు చేపట్టింది. బాలాకోట్ ఘటన జరిగిన తర్వాతి రోజే ఫిబ్రవరి 27న పాక్ వైమానికదళం ఎఫ్-16 విమానంతో భారత్‌పై దాడికి యత్నించింది. వింగ్ కమాండర్‌గా ఉన్న అభినందన్ మిగ్-21 విమానంతో పాక్‌ విమానాన్ని వెంటాడి నేలకూల్చారు. అదే సమయంలో ఆయన విమానం కూడా కూలిపోవడంతో పారాచూట్ సాయంతో కిందకు దూకారు. ఈ క్రమంలో పాక్ భూభాగంలో పడ్డారు. ఆయనను పాక్ జవాన్లు అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టారు. అభినందన్‌ను తిరిగి అప్పగించాలని భారత్ నుంచే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పాక్‌పై మోదీ తన దౌత్యంతో ఒత్తిడి తెచ్చారు. దిగివచ్చిన పాకిస్తాన్‌ సైన్యం అతడిని వాఘా సరిహద్దు వద్ద భారత సైన్యానికి అప్పగించింది.

మోదీతో మాట్లాడేందుకు..
ఈ పరిణామాలు మరింత ఉద్రిక్తతకు దారితీశాయి. ఈ క్రమంలోనే నాటి పాక్‌ ప్రధానిగా ఉన్న ఇమ్రాన్‌ఖాన్, భారత ప్రధాని మోదీతో మాట్లాడేందుకు యత్నించారు. కానీ, మోదీన పాక్‌ ప్రధానితో మాట్లాడేందుకు విముఖత చూపారని భారత మాజీ హైకమిషనర్‌ అజయ్‌ బిసారియా తన పుస్తకంలో వెల్లడించారు. ఈ మేరకు అనేక అంశాలతో కూడిన ఈ పుస్తకాన్ని త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ పుస్తకంలోని కొన్ని అంశాలు జాతీయ మీడియా వెల్లడించింది.

క్షిపణులు ఎక్కుపెట్టి..
2020, ఫిబ్రవరి 27న అభినందన్ వర్ధమాన్‌ను పాకిస్తాన్‌ బంధించింది. ఆ తర్వాత భారత్‌ తీవ్రంగా స్పందించింది. మన సైనికుడి కోసం దాయాదిపై క్షిపణి ప్రయోగానికి కూడా వెనుకాడలేదు. 9 క్షిపణులను పాకిస్తాన్‌పైకి ఎక్కుపెట్టారు మోదీ. ఈ విషయం తెలుసుకున్న పాకిస్తాన్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అప్పుడు పాక్‌ హైకమిషనర్‌గా ఉన్న సోహైల్‌ మహ్మద్‌ వెంటనే భారత హైకమిషనర్‌ అజయ్‌ బిసాయాను సంప్రదించాడు. ‘ఇమ్రాన్‌ఖాన్‌.. మోదీతో ఫోన్‌లో మాట్లాడాలనుకుంటున్నారు’ అని తెలిపారు. దీంతో విజయ్‌ వెంటనే ఢిల్లీలోని అధికారులకు సమాచారం ఇచ్చారు. కానీ మోదీ అప్పుడు ఖాన్‌తో మాట్లాడేందుకు ఆసక్తి చూపలేదు. మోదీ అందుబాటులో లేరని అధికారులు తెలిపారు. అత్యవసరమైతే విజయ్‌తోనే మాట్లాడాలని సూచించారు.

మోదీతో సమావేశానికి..
ఈ పరిణామాల తర్వాత కొన్ని రోజులకు ఇమ్రాన్‌ఖాన్‌కు అత్యంత సన్నిహితుడైన ఓ వ్యక్తి విజయ్‌ను సంప్రదించారు. ఆ ఏడాది కిర్గిస్థాన్‌లో జరిగిన ఎస్‌సీవో సదస్సులో మోదీతో ఇమ్రాన్‌ సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఉగ్రవాద కట్టడిపై వారి విధానాలను ఖాన్‌ మోదీకి వివరిస్తారని తెలిపారు. కానీ, ఆ భేటీకి కూడా మోదీ అంగీకరించలేదు.

అభినందన్‌ను విడిచిపెట్టకుంటే…
పాకిస్తాన్‌ పట్టుకున్న మన జెట్‌ ఫైటర్‌ అభినందన్‌ను విడిపించేందుకు భారత్‌ దౌత్య పద్ధతిని అవలంబించింది. అదే సమయంలో పాకిస్తాన్‌పై 9 క్షిపుణులను కూడా మోహరించింది. పాకిస్తాన్‌ దౌత్యానికి దిగివచ్చి అభినందన్‌ను విడుదల చేయడం మంచిపనైంది. లేదంటే.. ఆరోజు రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి అయ్యేదని విజయ్‌ తన పుస్తకంలో రాసుకొచ్చారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

CBI Probe into Kaleshwaram Project

Revanth Reddy : మేడిగడ్డలో కాలేసిన రేవంత్‌రెడ్డి.. మొన్న లిఫ్టింగ్‌ కుదరదని.. నేడు కేంద్రానికి లేఖ!

Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై ఎప్పుడు తనదే పైచేయి అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షం రేవంత్‌ ఏ మిషయంలోనూ తమకు పోటీ కాదని విమర్శలు...
R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Jaya Krishna Ghattamaneni

Jaya Krishna Ghattamaneni: బయట హీరోల్లో ఆ స్టార్ హీరో కి వీరాభిమాని అంటూ ఘట్టమనేని జయకృష్ణ హాట్...

Jaya Krishna Ghattamaneni: సూపర్ స్టార్ కృష్ణ రెండవ తనయుడు , మహేష్ బాబు సోదరుడు , రమేష్ బాబు కుమారుడిగా జయ కృష్ణ ఘట్టమనేని ఇండస్ట్రీ లోకి హీరో గా...

NEET Controversy : విద్యార్థుల ఆవేదనలో అర్ధముంది మరి రాజకీయ నాయకుల ఆందోళనలో?

NEET Controversy : దేవాలయాల లాంటి విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం, తమ భవిష్యత్తును దిద్దుకోవడం కోసం రాత్రింబవళ్లు కష్టపడే కోట్లాది మంది విద్యార్థుల నిరీక్షణను నీరుగార్చేలా ఇటీవల విద్యావ్యవస్థలో వరుసగా జరుగుతున్న పరిణామాలు...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్ల గ్రాస్ రాబట్టాలో తెలుసా..?...

Chennai Love Story: సినిమా సినిమాకు తన పరిధి ని పెంచుకుంటూ , యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం. ఈయన కెరీర్...
Oktelugu Epaper