Narendra Modi : 2019లో పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలపై భారత మాజీ హైకమిషనర్ అజయ్ బిసారియా తన పుస్తకంలో వెల్లడించారు. నాడు రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత, భారత దౌత్య నీతితో పాక్ భయపడిన తీరు, ఉగ్రవాదంపై పాకిస్తాన్ తన తీరును ఎలా మార్చుకుంది తదితర అంశాలను తన పుస్తకంలో వెల్లడించారు.
అభినందన్‌ను బంధించి..
2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో సైనిక కాన్వాయ్‌పై ఉగ్రవాదులు భీకర దాడి చేశారు. దీనికి ప్రతిగా బాలాకోట్‌లో ఉగ్ర శిబిరాలపై భారత్ వైమానిక దాడులు చేపట్టింది. బాలాకోట్ ఘటన జరిగిన తర్వాతి రోజే ఫిబ్రవరి 27న పాక్ వైమానికదళం ఎఫ్-16 విమానంతో భారత్‌పై దాడికి యత్నించింది. వింగ్ కమాండర్‌గా ఉన్న అభినందన్ మిగ్-21 విమానంతో పాక్ విమానాన్ని వెంటాడి నేలకూల్చారు. అదే సమయంలో ఆయన విమానం కూడా కూలిపోవడంతో పారాచూట్ సాయంతో కిందకు దూకారు. ఈ క్రమంలో పాక్ భూభాగంలో పడ్డారు. ఆయనను పాక్ జవాన్లు అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టారు. అభినందన్‌ను తిరిగి అప్పగించాలని భారత్ నుంచే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పాక్‌పై మోదీ తన దౌత్యంతో ఒత్తిడి తెచ్చారు. దిగివచ్చిన పాకిస్తాన్ సైన్యం అతడిని వాఘా సరిహద్దు వద్ద భారత సైన్యానికి అప్పగించింది.
మోదీతో మాట్లాడేందుకు..
ఈ పరిణామాలు మరింత ఉద్రిక్తతకు దారితీశాయి. ఈ క్రమంలోనే నాటి పాక్ ప్రధానిగా ఉన్న ఇమ్రాన్‌ఖాన్, భారత ప్రధాని మోదీతో మాట్లాడేందుకు యత్నించారు. కానీ, మోదీన పాక్ ప్రధానితో మాట్లాడేందుకు విముఖత చూపారని భారత మాజీ హైకమిషనర్ అజయ్ బిసారియా తన పుస్తకంలో వెల్లడించారు. ఈ మేరకు అనేక అంశాలతో కూడిన ఈ పుస్తకాన్ని త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ పుస్తకంలోని కొన్ని అంశాలు జాతీయ మీడియా వెల్లడించింది.
క్షిపణులు ఎక్కుపెట్టి..
2020, ఫిబ్రవరి 27న అభినందన్ వర్ధమాన్‌ను పాకిస్తాన్ బంధించింది. ఆ తర్వాత భారత్ తీవ్రంగా స్పందించింది. మన సైనికుడి కోసం దాయాదిపై క్షిపణి ప్రయోగానికి కూడా వెనుకాడలేదు. 9 క్షిపణులను పాకిస్తాన్‌పైకి ఎక్కుపెట్టారు మోదీ. ఈ విషయం తెలుసుకున్న పాకిస్తాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అప్పుడు పాక్ హైకమిషనర్‌గా ఉన్న సోహైల్ మహ్మద్ వెంటనే భారత హైకమిషనర్ అజయ్ బిసాయాను సంప్రదించాడు. ‘ఇమ్రాన్‌ఖాన్.. మోదీతో ఫోన్‌లో మాట్లాడాలనుకుంటున్నారు’ అని తెలిపారు. దీంతో విజయ్ వెంటనే ఢిల్లీలోని అధికారులకు సమాచారం ఇచ్చారు. కానీ మోదీ అప్పుడు ఖాన్‌తో మాట్లాడేందుకు ఆసక్తి చూపలేదు. మోదీ అందుబాటులో లేరని అధికారులు తెలిపారు. అత్యవసరమైతే విజయ్‌తోనే మాట్లాడాలని సూచించారు.
మోదీతో సమావేశానికి..
ఈ పరిణామాల తర్వాత కొన్ని రోజులకు ఇమ్రాన్‌ఖాన్‌కు అత్యంత సన్నిహితుడైన ఓ వ్యక్తి విజయ్‌ను సంప్రదించారు. ఆ ఏడాది కిర్గిస్థాన్‌లో జరిగిన ఎస్‌సీవో సదస్సులో మోదీతో ఇమ్రాన్ సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఉగ్రవాద కట్టడిపై వారి విధానాలను ఖాన్ మోదీకి వివరిస్తారని తెలిపారు. కానీ, ఆ భేటీకి కూడా మోదీ అంగీకరించలేదు.
అభినందన్‌ను విడిచిపెట్టకుంటే…
పాకిస్తాన్ పట్టుకున్న మన జెట్ ఫైటర్ అభినందన్‌ను విడిపించేందుకు భారత్ దౌత్య పద్ధతిని అవలంబించింది. అదే సమయంలో పాకిస్తాన్‌పై 9 క్షిపుణులను కూడా మోహరించింది. పాకిస్తాన్ దౌత్యానికి దిగివచ్చి అభినందన్‌ను విడుదల చేయడం మంచిపనైంది. లేదంటే.. ఆరోజు రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి అయ్యేదని విజయ్ తన పుస్తకంలో రాసుకొచ్చారు.