Homeఆంధ్రప్రదేశ్‌అంతా మీరే చేశారు... సీఎస్ విషయంలో.. ప్రవీణ్ ప్రకాశ్

అంతా మీరే చేశారు… సీఎస్ విషయంలో.. ప్రవీణ్ ప్రకాశ్

Praveen Prakash
ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ అత్యంత కీలకం. భారత రాజ్యాంగంలో ఎన్నికల నిర్వహణకు చాలా ప్రాధాన్యం ఉంది. అలాంటి ఎన్నికల నిర్వహణకు ఉద్దేశపూర్వకంగా ఆటంకం కలిగించడం తీవ్రమైన నేరం. పంచాయతీ మొదటి విడత ఎన్నికల వాయిదాకు కారణం అలాంటిదే అయ్యింది. జిల్లాల్లో అధికారులు ఎవరూ పట్టించుకోలేదు. దానికి కారణం.. పైనుంచి ఆదేశాలు అందడమే.. ఆ ఆదేశాలు ఇచ్చింది ఎవరనేదిపై దృష్టి పెట్టని నిమ్మగడ్డ రమేశ్ కుమార్…చివరికి ప్రవీణ్ ప్రకాశ్ గా తేల్చారు.. ఆయన్ను అత్యవసరంగా బదిలీ చేయాలని ఆదేశించారు.

Also Read: చిరు సలహా వెనక అంతపెద్ద కుట్రనా..?

అయితే ప్రవీణ్ ప్రకాశ్ అనూహ్యంగా తనకేమీ తెలియని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కే వివరణ ఇచ్చారు. ఇక్కడ అసలు విషయం జరిగింది ఏమిటంటే.. తాను సీఎస్ కు సహాయకారినే కానీ నిర్ణయాలు తీసుకునే వ్యక్తిని కాదంటున్నాడు. ప్రవీణ్ ప్రకాశ్ సీఎంవో సెక్రటరీ.. ఆయన పవర్ గురించి పొలిటికల్.. బ్యూరో క్రాట్ సరిళ్లలో అందరికీ తెలుసు. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను బదిలీ చేయగలిగినంత రేంజ్ అతడిది.

Also Read: ప్రభుత్వాన్ని వదలని నిమ్మగడ్డ

ఆయన ఇప్పడు ఎన్నికల కమిషన్ తో వివాదం వచ్చేసరికి మాట మార్చేశాడు. తాను సీఎంవోలోని ఐదుగురు సెక్రటరీలలో ఒకడినని.. సీఎస్ కు సహాయకారిగా మాత్రమే ఉంటానని అంటున్నారు. మొదటిదశ ఎన్నికలకు సహకరించొద్దని తాను అధికారులకు చెప్పలేదంటున్నారు. ప్రభుత్వ ఆదేశాలు మాత్రమే పాటిస్తున్నానని చెబుతున్నారు. అంటే సీఎస్ ఆదేశాలు మాత్రమే పాటించారని ఈ లెక్కన.. అధికారులు ఎవరూ నిమ్మగడ్డ సమీక్షకు హాజరు కాకూడదని ఆయన చెప్పారట.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

నిజానికి ప్రవీణ్ ప్రకాశ్ ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కల్పించే నాటికే హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఎన్నికల కోడు అమలులోకి వచిచంది. అంటే ప్రభుత్వ అధికారులు మొత్ ఎస్ఈసీ చెప్పినట్లు.. చేయాల్సి ఉంటుంది.. కానీ ప్రవీణ్ ప్రకాశ్ చేయలేదు. పైగా. వ్యతిరేకంగా చేయించారు. ఎన్నికల ప్రక్రియను బలహీనం చేసే ప్రయత్నం చేశారు. అయితే నిజంగా ఆయనకు ఉన్న పదవికి… ఆయన చేసే పనులకు సబంధం ఉండదు. అందుకే ఇప్పడు ఆయన తెలివిగా.. మొత్తం సీఎస్ మీదకు తోసేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే కోర్టు ధిక్కరణ కేసులో సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ పేరు కూడా హై కోర్టు కలిపింది. ఇప్పుడు ఎన్నికల వాయిదాకు సీఎస్ నే కారణమని.. చెప్పి.. ప్రవీణ్ ప్రకాశ్ వైదొలిగితే.. మొత్తం అధికార యంత్రాంగం.. ఓ కుదుపునకు వస్తుంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version