తెలంగాణకు రూ.250 కోట్లు.. ఏపీకి నిల్‌..!: కేంద్రం వరద సాయం

గత కొన్ని నెలల క్రితం హైదరాబాద్‌ మహానగరాన్ని వరదలు చుట్టుముట్టాయి. దీంతో చాలా వరకు డివిజన్లలో భారీ నష్టమే వాటిల్లింది. ప్రజలంతా నిద్రలేని రాత్రులు గడిపారు. పది నుంచి పదిహేను రోజుల వరకు కూడా ఆయా కాలనీల ప్రజలు కోలుకోలేకపోయారు. వేసుకున్న బట్టలు మినహా ఇళ్లలోని సామగ్రి అంతా వరదలో కొట్టుకుపోయింది. కానీ.. ఆ సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోవడంపైనా విమర్శలు వచ్చాయి. అయితే.. అదే సమయంలో ఏపీలోనూ వరదలు ముంచెత్తాయి. వేల హెక్టార్లలో పంట నష్టం […]

Written By: Srinivas, Updated On : January 30, 2021 12:49 pm
Follow us on


గత కొన్ని నెలల క్రితం హైదరాబాద్‌ మహానగరాన్ని వరదలు చుట్టుముట్టాయి. దీంతో చాలా వరకు డివిజన్లలో భారీ నష్టమే వాటిల్లింది. ప్రజలంతా నిద్రలేని రాత్రులు గడిపారు. పది నుంచి పదిహేను రోజుల వరకు కూడా ఆయా కాలనీల ప్రజలు కోలుకోలేకపోయారు. వేసుకున్న బట్టలు మినహా ఇళ్లలోని సామగ్రి అంతా వరదలో కొట్టుకుపోయింది. కానీ.. ఆ సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోవడంపైనా విమర్శలు వచ్చాయి. అయితే.. అదే సమయంలో ఏపీలోనూ వరదలు ముంచెత్తాయి. వేల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది.

Also Read: అక్కడ వారు.. ఇక్కడ వీరు..: మొత్తంగా రైతులే టార్గెట్

గ్రేటర్‌‌లో వరదల ఎఫెక్ట్‌ హైదరాబాద్‌ను రాజకీయంగానూ మలుపుతిప్పాయి. స్పందించాల్సిన టైమ్‌లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. దీంతో వెంటనే బీజేపీ అలర్ట్‌ అయింది. వెంటనే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కేంద్ర బృందాన్ని హైదరాబాద్‌ రప్పించారు. వెంటనే నష్టం అంచనాలను వేయించారు. ఇప్పుడు దాని ఫలాలు అందాయి. వరద సాయం కింద తెలంగాణకు దాదాపుగా రూ.250 కోట్లు విడుదల చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మొత్తం ఐదు రాష్ట్రాలకు ఈ సాయం అందించింది. తెలంగాణతోపాటు ఉత్తరప్రదేశ్, అసోం, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్‌లకు ఈ వరదసాయం అందింది.

Also Read: రైతు చట్టాలు.. రాష్ట్రపతి నోట.. పార్లమెంట్ లోనూ మార్మోగింది

అయితే.. ఆంధ్రప్రదేశ్ పేరు మాత్రం ఈ జాబితాలో కనిపించలేదు. హైదరాబాద్‌కు కేంద్ర బృందం వచ్చి అంచనాలు వేసి వెళ్లిన తర్వాత ఏపీ బీజేపీ నేతలు కూడా ప్రత్యేకంగా కేంద్రమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టి విజ్ఞప్తి చేశారు. అక్కడికి కూడా కేంద్ర బృందాన్ని రప్పించారు. వారు వచ్చి నష్టం అంచనాలు వేసి వెళ్లారు. కానీ.. అదేంటో నష్టం లేదనుకున్నారో ఏమో ఒక్క రూపాయి కూడా రిలీజ్‌ చేయలేదు. కానీ.. ఏపీ సర్కార్ మాత్రం కేంద్రానికి చాలా లేఖలు రాసింది. నివర్ తుఫాను సాయం చేయాలని కోరింది. ఆర్థిక మంత్రి బుగ్గన నెలలో మూడు విడుతలుగా ఢిల్లీకి వెళ్లి ఆర్థిక శాఖ అధికారులకు విజ్ఞాపన పత్రాలు సైతం ఇచ్చారు. కానీ.. ఫలితం మాత్రం కనిపించలేదు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ పంట నష్టంపై నిజాయితీగా లెక్కలు ఇచ్చామని ప్రకటించారు. కానీ.. ఎలాంటి సాయం ప్రకటించారో చూశాం కదా. ఆ నిజాయితీ మదింపు ప్రకారం అసాధారణంగా ఏమీ నష్టం జరగలేదన్న అంచనాకు ప్రభుత్వం వచ్చిందని అప్పట్లో అనుకున్నారు. కేంద్రం కూడా అదే భావించి ఎలాంటి వరద సాయం చేయలేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఏపీ సర్కార్ కూడా రైతులకు ఎలాంటి వరద సాయం చేయలేదు. కేవలం ఇన్‌పుట్‌ సబ్సిడీ మాత్రమే కొంత మందికి ప్రకటించింది. మొత్తంగా ఈ వరదల ఎపిసోడ్‌లో ఫైనల్‌గా నష్టపోయింది మాత్రం ఏపీలోని రైతులే అని చెప్పాలి.