pawan kalyan speech yuva shakti sabha : ఈ రాష్ట్రంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు మారి ఉండొచ్చు.. రాజకీయాన్ని రాజకీయంగా మాత్రమే చూసే వాళ్ళని మనం ఇదివరకు చూసాము.. కానీ వందల కుటుంబాలు బతికే పరిశ్రమలపై కూడా కక్ష సాధించడం వంటివి వైసీపీ పార్టీ పాలనలోనే మనం చూస్తున్నాం.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడని సినీ పరిశ్రమని మొత్తం ఇబ్బందిపెట్టడం ఈ వైసీపీ పాలనలోనూ జరుగుతోంది.

పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘వకీల్ సాబ్’ మరియు ‘భీమ్లా నాయక్’ వంటి సినిమాలు విడుదలైనప్పుడు అర్థరాత్రి జీవోలను తెచ్చి , టికెట్ రేట్స్ తగ్గించాలంటూ జగన్ ప్రవేశ పెట్టిన జీవో వల్ల పవన్ కళ్యాణ్ సినిమాలు కొన్ని కోట్లు నష్టపోయాయి.. ఆ జీవో వల్ల పుష్ప, అఖండ వంటి సినిమాలు కూడా భారీగా నష్టపోవాల్సి వచ్చింది..ఇక ఆ తర్వాత చిరంజీవి , మహేష్ బాబు , ప్రభాస్ మరియు రాజమౌళి వంటివారు ముఖ్యమంత్రి తో భేటీ అయ్యి సమస్యకి పరిష్కారం తీసుకొచ్చారు.
తన సినిమాలను ఆ విధంగా తొక్కడంపై పవన్ కళ్యాణ్ నేడు రణస్థలం లో జరిగిన ‘యువశక్తి’ మహాసభలో మాట్లాడాడు.. ఆయన మాట్లాడుతూ ‘మీరు నన్ను ఎన్ని విధాలుగా భయపెట్టాలని చూసిన నన్ను ఆపలేరు.. నా ఆర్థిక మూలలను కూడా బద్దలుకొట్టాలని చూసారు..భీమ్లా నాయక్ సినిమాని ఆపేసారు.. నిర్మాతలకు 30 కోట్ల రూపాయిల నష్టం వచ్చింది.. ఆ నష్టాన్ని నేను భరించాను.. ఇవన్నీ నాకు ఒక లెక్కకాదు.. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసి నా చేత వెనుకడుగు వేయించాలని చూసిన మీ వల్ల కాదు’ అంటూ పవన్ కళ్యాణ్ వైసీపీ పార్టీ పై విరుచుకుపడ్డాడు..
అంతే కాకుండా ముఖ్యమంత్రి జగన్ పై కూడా చాలా ఘాటు వ్యాఖ్యలు చేసాడు పవన్ కళ్యాణ్..ఇక లేటెస్ట్ గా రోజా మెగా ఫ్యామిలీ కుటుంబం పై చేసిన వ్యాఖ్యలకు కూడా చాలా తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యాడు..మరి ఈ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.