బీహార్ లో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. గతంలో బీజేపీ జేడీయూ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో బీహార్ లో అసలేం జరుగుతోందనే చర్చ సాగుతోంది. ఇటీవల జరిగిన బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ విజయం సాధించడంలో కూడా పీకే కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పీకే తదుపరి కార్యక్రమాలు ఏమిటనే దానిపై ఊహాగానాలు వస్తున్నాయి.
వ్యూహకర్తగా ఉండనని..
ఇక మీదట ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించనని పీకే చెప్పడంతో అందరి దృష్టి ఆయన ఏం చేస్తారనే దానిపైనే ఉంది. బీహార్ లో ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించినప్పుడు ఆయన తెచ్చిన మార్పులపై తానే విమర్శలు చేయడంతో పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో ఆయన వేరే ఆలోచనలు చేస్తున్నారనే దానిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఉద్యోగులకు ఉద్వాసన
ప్రశాంత్ కిషోర్ నియమించిన ఉద్యోగుల్లో చాలా మందిని తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోంది. ఉన్న పలంగా ఉద్యోగాలు తొలగిస్తే పరిస్థితి ఏమిటని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఎవరు బాధ్యులను ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా బీహార్ లో రోజురోజుకు విచిత్ర పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పీకే పై ఉన్న కోపంతో జేడీయూ ప్రత్యక్ష పీడిత పనులకు దిగడం ఆశ్చర్యకరం.
పీకే ఏం చేయనున్నారు?
ప్రశాంత్ కిశోర్ తన భవిష్యత్ కార్యాచరణ ఏమిటనే దానిపై స్పష్టత లేదు. ఆయన ఇప్పటికే యువతను కలిసి సమావేశాలు ఏర్పాటు చేసి వారిలో ఆత్మవిశ్వాసం నింపారని తెలుస్తోంది. దీంతో పీకే తన తదుపరి చర్యలపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బీహార్ లో మరో ప్రబల రాజకీయ పార్టీ రానుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.