మోసపోవాలే కానీ.. చేసేందుకు కి‘లేడీ’లు రెడీగా ఉంటారు. సొల్లు కార్చే మొగాళ్లు ఉండాలే కానీ స్వరం అర్పిస్తామని.. వారి సర్వస్వం దోచేసే మాయ లేడీలకు కొదవ లేదు. ఏకంగా తన ప్రియుడు, బావతో కలిసి ఓ గుంటూరు వాసికి కుచ్చు టోపీ పెట్టింది ఓ హైదరాబాదీ లేడి. ఓ బావ మరదళ్లు.. ఓ ప్రియుడు కలిసి ఓ వ్యక్తిని నిండా ముంచారు. ఆ అమ్మాయి వలపు వలకి చిక్కి కోటి 20 లక్షలు మోసపోయాడు బాధితుడు.

హైదరాబాద్ నుంచి గుంటూరుకు చెందిన ఓ వ్యక్తికి ‘ఆర్చన’ పేరుతో ఒక ఫోన్ వచ్చింది. మంచిగా మాట్లాడింది. స్నేహం పెంచుకుంది. ప్రేమ వలలోకి దించింది. శృంగార వల వేసింది. దానికి సొల్లు కార్చుకున్న గుంటూరు బాధితుడు ఆమె మాయలో పడిపోయాడు.
రూ.1000 రూపాయలతో మొదలైన కిలేడీ వసూళ్లు ఏకంగా రూ.కోటి 20 లక్షలకు చేరింది. గత డిసెంబర్ నుంచి మొదలైన ఈ వసూళ్ల దందా ఇప్పటిదాకా సాగింది.కోటి 20లక్షల దాకా వసూలు చేశారు. చివరకు ఆ లేడి ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడంతో తాను మోసపోయానని బాధితుడు గగ్గోలు పెట్టాడు. ఆ గుంటూరు బాధితుడు హైదరాబాద్ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆ యువతిని, ఆమె ప్రియుడు, బావను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
హానీట్రాప్ చేసిన ఆ లేడి ఆ గుంటూరు బాధితుడిని నిండా ముంచేసింది. ఫోన్లో సరదాగా మాట్లాడి కోటి 20 లక్షలు లాగేసి మోసానికి పాల్పడింది. ఆమె పక్కనే ఉండి ఆ యువతి ప్రియుడు, బావ కలిసి ఆడిన ఈ ఆటలో పాపం బాధితుడు నిండా మునిగాడు. ఇటీవల కాలంలో ఈ హానీట్రాప్ లు భారీగా పెరిగిపోతున్నాయి.