Hyderabad vs Bangalore: ప్రపంచం మొత్తాన్ని ఇప్పుడు ఐటీరంగం శాసిస్తోంది.. ఉదయం లేచిన దగ్గర్నుంచి మొదలు పెడితే రాత్రి పడుకునే వరకు మనిషి జీవితంలో ప్రతి దశను ఐటి నిర్దేశిస్తుంది.. తినే తిండి నుంచి తాగే నీటి వరకు.. వేసుకునే బట్టల నుంచి చదువుకునే చదువు వరకు.. చేసే ఉద్యోగం నుంచి ఉండే నివాసం వరకు.. ఇలా ప్రతి అంశాన్ని ఐటి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితం చేస్తోంది. అందువల్లే ఐటీ రంగంలో విరివిగా ఉద్యోగాలు లభిస్తున్నాయి. అనేక కంపెనీలు ఐటీ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి.
ప్రపంచ ఐటీ రంగాన్ని అమెరికాలోని సిలికాన్ వ్యాలీ నిర్దేశించేది. కాలానుగుణంగా ప్రపంచంలోని అనేక ప్రాంతాలు ఐటి కేంద్రాలుగా ఏర్పడ్డాయి. మనదేశంలో బెంగళూరు, హైదరాబాద్, పూణే, నోయిడా వంటి ప్రాంతాలలో ఐటీ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇందులో బెంగళూరు, హైదరాబాద్ ఊహించని విధంగా అభివృద్ధి చెందుతున్నాయి. బెంగళూరు అయితే ఏకంగా భారతదేశ ఐటీ రాజధానిగా మారిపోయింది. హైదరాబాద్ కూడా అదే స్థాయిలో అభివృద్ధి చెందుతోంది. ఇప్పటివరకు బాగానే ఉన్నప్పటికీ.. ఇప్పుడు హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది.. దీనికి సంబంధించి చర్చ కూడా మొదలైంది.
బెంగళూరు నగరం ఐటి ఎగుమతులు, స్టార్టప్ రంగాలలో దూసుకుపోతోంది. ఇక్కడ అమెజాన్ నుంచి మొదలు పెడితే టిసిఎస్ వరకు కార్యాలయాలు ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఐటీ పరిశ్రమ అభివృద్ధికి విపరీతంగా సహకారం అందిస్తోంది.. బెంగళూరు నగరంలో భారీగా ఐటీ కంపెనీలు ఉన్నప్పటికీ.. జీతాలు కూడా అదే స్థాయిలో లభిస్తున్నప్పటికీ.. ఖర్చు కూడా అదేవిధంగా ఉంటున్నది. భారతదేశపు సిలికాన్ వ్యాలీగా బెంగళూరు నగరం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పెద్ద సంఖ్యలో ఐటీ కంపెనీలు ఉన్నాయి. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు కూడా ఉన్నాయి. ఇక స్టార్టప్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐటీ పరిశ్రమ ఏ స్థాయిలో అయితే అభివృద్ధి చెందిందో.. మిగతా రంగాలు కూడా అదే స్థాయిలో ఇక్కడ ఉన్నాయి. దీంతో జీవన వ్యయం పెరిగిపోయింది. ఐటీ పరిశ్రమలు ఉన్న ప్రాంతాలలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రెంట్ దాదాపు 50 నుంచి 70 వేల వరకు ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు ఇక్కడ ట్రాఫిక్ అత్యంత దారుణంగా ఉంటుంది.. సాయంత్రం, ఉదయం పూట ప్రయాణాలు సాగించాలంటే నరకం చూడాల్సి ఉంటుంది. ఇక్కడ రెంటు మాత్రమే కాదు, ఇళ్ళు కొనుగోలు చేయాలంటే కూడా భారీగా ఖర్చుపెట్టాలి.
బెంగళూరు నగరంలో వైట్ ఫీల్డ్, ఎలక్ట్రానిక్ సిటీ, ఓ ఆర్ ఆర్ దూర ప్రాంతాలుగా ఉన్నాయి. ఇక్కడికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా సరిగా ఉండదు. దీనికి తోడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ మెరుగుపడేందుకు చాలా సమయం పడుతుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. బెంగళూరు నగరంలో ట్రాఫిక్ జామ్ సామాన్యులకే కాదు, సెలబ్రిటీలకు కూడా చుక్కలు చూపిస్తోంది.
హైదరాబాద్ నగరంలో ఐటీ మాత్రమే కాకుండా ఫార్మా రంగాలు కూడా విపరీతంగా అభివృద్ధి చెందుతున్నాయి. బెంగళూరు నగరంతో పోల్చి చూస్తే ఇక్కడ జీవన వ్యయం చాలా తక్కువ. జీతభత్యాలు కూడా చాలా ఎక్కువ. పైగా ఇక్కడ జిసిసిలకు హైదరాబాద్ బలమైన కేంద్రంగా మారుతోంది. స్టార్టప్ లకు కూడా గమ్యస్థానంగా రూపాంతరం చెందుతోంది. మౌలిక సదుపాయాలు కూడా బెంగళూరు నగరంతో పోల్చి చూస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి.
హైదరాబాద్ నగరంలో రోడ్లు విస్తారంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ కూడా తక్కువ స్థాయిలోనే ఉంటాయి. గచ్చిబౌలి, హెచ్ఐటిఈసి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటివి కేంద్రీకృత జోన్ ల పరిధిలో ఉన్నాయి. పైగా బెంగళూరు నగరంతో పోసి చూస్తే 20 నుంచి 30% వరకు తక్కువ ధరలోనే నివాస గృహాలను సొంతం చేసుకోవడానికి సాధ్యమవుతుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. కెరియర్ పరంగా చూసుకుంటే ఐటి ఉద్యోగులకు బెంగళూరు ఫస్ట్ ఛాయిస్. స్టార్ట్ అప్, నిచ్ డొమైన్ లు ఉన్న ఐటీ ఉద్యోగులకు మాత్రం హైదరాబాద్ నగరం ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు.
ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మధ్యలో హైదరాబాదులో బంజరా హిల్స్ నుంచి మొదలు పెడితే గచ్చిబౌలి వరకు భూముల ధరలలో 8 శాతం వరకు పెరుగుదల నమోదు చేశాయి. ఇక బెంగళూరు ప్రాంతాలలో భూముల ధరలు సగటున 13వేల నుంచి 15 వేల వరకు పెరిగాయి. బయటి ప్రాంతాలలో 9000 నుంచి పదివేల పరిధిలో ఉన్నాయి. అద్దెల ప్రకారం చూసుకుంటే బెంగళూరులో రెంటల్ రిటర్న్స్ మూడు నుంచి నాలుగు శాతం వరకు పెరిగితే.. హైదరాబాద్ నగరంలో అది మూడు నుంచి 3.5 శాతం వరకు ఉంది.