Musi River: మనిషి మనుగడకు నదులు ఎంతో ఉపకరిస్తాయి. నదుల పరివాహక ప్రాంతాల్లోనే జనాభా ఎక్కువగా నివసించడం ఎప్పటి నుంచో ఉంది. మనకు సింధులోయ నాగరికత కూడా ఇదే విషయాన్ని చెప్పింది. మనిషి నీరు దొరికే ప్రాంతాలను తమకు సురక్షిత ప్రాంతాలుగా గుర్తించి అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకోవడం మామూలే. నదుల పరివాహక ప్రాంతాలు కలుషితమైపోతున్నాయి. ఇటీవల జరిపిన సర్వేలో మనదేశంలోని నదులన్ని జీవకళను కోల్పోతున్నాయి. వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. వ్యర్థాలు అందులో చేరి నీటిని కలుషితం చేస్తున్నాయి. మన ఇంటినైతే శుభ్రంగా ఉంచుకుంటాం కానీ బయట ప్రాంతాలను పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఫలితంగా నదులన్ని కాలుష్య కారకాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో నదుల క్రమబద్ధీకరణకు నడుం కట్టిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టినా ఫలితాలు మాత్రం కనిపించడం లేదు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గంగానది ప్రక్షాళనకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నా ఫలితం ఇవ్వడం లేదు. దీంతో నది రోజురోజుకు ఇంకా ఎక్కువ కాలుష్య కారకంగా మారుతోంది. అదొక్కడే కాదు దేశంలోని పలు నదుల కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాయనడంలో అతిశయోక్తి లేదు. మనది నదులున్న దేశం. గంగా, గోదావరి, కావేరి, కృష్ణ, పెన్నా, తుంగభద్ర, సరస్వతి, తపతి వంటి నదులు మనదేశంలో ప్రవహిస్తూ ప్రజా జీవనంతో ముడిపడి ఉన్నాయి. కానీ వాటి పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారుతోంది. కాలుష్య కారకాలుగా విషం కలిగించే విధంగా మారుతున్నాయి. మూసీ నది ఒడ్డునే రైతులు కూరగాయలు కూడా పండిస్తున్నారు. దీంతో విషపదార్థాలు మనుషులకు సోకి వ్యాధుల బారిన పడే అవకావాలున్నాయి. దీంతో ఎలా తినేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.
Also Read: Maa Bhoomi: చరిత్రతో వచ్చి చరిత్ర సృష్టించింది.. నిజాం నిరంకుశత్వంపై నినదించిన సినిమా ‘మా భూమి’
ఇక మన హైదరాబాద్ నగరంలో ప్రవహిస్తున్న మూసీ నది కూడా అత్యంత విషపూరితంగా మారుతోంది. దాని పరసర ప్రాంతాల్లో పెరిగే గడ్డి వల్ల ఎన్నో అనర్థాలు కలుగుతున్నాయని ఎన్ఆర్ఎస్ఎఫ్ పరిశోధనలో తేలడం గమనార్హం. దీంతో ఈ గడ్డి తినడం వల్ల పశువుల్లో విష పదార్థాలు ఉత్పన్నం అవుతున్నాయి. వాటి ద్వారా వచ్చే పాలను తాగుతున్న ప్రజలకు కూడా దీంతో ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని సూచిస్తోంది. ఈ నేపథ్యంలో మూసీ నది పరివాహక ప్రాంతం కలుషితంగా మారడంతో ఇక ప్రజల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి.
ఇంతటి మానవులకు హానికర పదార్థాలు వ్యాపిస్తున్నందున మూసీ ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వాలు పాటు పడాల్సిన అవసరం ఏర్పడింది. రోజురోజుకు ఈ సమస్య పెరిగితే మానవ మనుగడకే ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో దిద్దుబాటు చర్యలకు ప్రభుత్వం నడుం కట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజా జీవితానికి భంగం కలిగించే హానికర క్రిములు ఉన్నందున వాటిని నిర్మూలించే విధంగా ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం వస్తోంది. దీనిపై ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నష్ట నివారణకు తమ వంతు పాత్ర తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మూసీ నది పరివాహక ప్రాంతంలో మానవులకు హానికలిగించే లెడ్ ఆనవాళ్లు అధికంగా ఉన్నట్లు చెబుతున్నారు. పీసీబీ నిబంధనల ప్రకారం లెడ్ మోతాదు 20పీపీఎం (పార్ట్స్ ఫర్ మిలియన్) మించకూడదు. కానీ ఈ నీటిలో 61 పీపీఎం నమోదవుతోంది. దీంతో ఇందులో కాలుష్య కారకాలు చేరి మనుషుల దేహాల్లోకి ప్రవేశిస్తాయి. దీంతో న్యూమోనియా, టైఫాయిడ్, కామెర్లు, పోలియో వంటి వ్యాధులు సోకుతాయి. ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం రానుంది. దీనిపై ప్రభుత్వం మేల్కోవాల్సిన బాధ్యత ఏర్పడింది. ఇంతటి మహత్తర వ్యాధులకు ఆలవాలమైన మూసీ నది పరివాహక ప్రాంతంలో నెలకొన్న కాలుష్య కారకాల నివారణకు నడుం కట్టాల్సిన పరిస్థితి దాపురించింది.
Also read: Samantha: హిందీలో సమంత క్రేజీ సినిమా.. వైరల్ అవుతున్న షేకింగ్ న్యూస్
మూసీ పరివాహక ప్రాంతం నగరం మొత్తం విస్తరించి ఉంది. భాగ్యనగర ప్రజల జీవితాలు డోలాయమానంలో ఉన్నట్లే. కాలుష్య కారకాల తొలగింపునకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిన అవసరం వచ్చిందని పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు. ఇప్పటికే పలు సర్వేలు మూసీ నది దుస్థితిపై నివేదికలు ఇచ్చినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రజాజీవనం అతలాకుతలం అయ్యేలా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే కాలుష్య కారకాల తొలగింపునకు మార్గదర్శకాలు విడుదల చేయాల్సి ఉంది.
[…] Read: Musi River: మూసి నదిలో ప్రమాదకర లెడ్.. ఆ ఒడ్డు… ప్రకాశం జిల్లా కొండెపి మండలం […]