https://oktelugu.com/

Hyderabad Minor Gang Rape Case: అఘాయిత్యం చేసింది అధికారిక వాహనంలోనే.. ఎమ్మెల్యే కొడుకు చుట్టూ భిగుస్తున్న ఉచ్చు!

Hyderabad Minor Gang Rape Case: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ ప్రాంతంలో మైనర్‌ బాలికపై గ్యాంగ్‌ రేప్‌ ఉదంతంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ అధికారికంగా వినియోగించే ఇన్నోవా కారులోనే బాలికపై అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది. కొడుకులను కాపాడుకునేందుకు యత్నం.. విశ్వనగరం హైదరాబాద్‌ ప్రతిష్టను దిగజార్చుతూ, నగరంలో ఆడపిల్లల భద్రతపై సవాళ్లను పెంచుతూ, రాజకీయంగానూ కలకలానికి దారితీసిన ‘మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం’ ఉదంతంలో షాకింగ్‌ విషయాలు బయటికొస్తున్నాయి. మే 28న దారుణం జరగ్గా, […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : June 5, 2022 / 10:59 AM IST
    Follow us on

    Hyderabad Minor Gang Rape Case: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ ప్రాంతంలో మైనర్‌ బాలికపై గ్యాంగ్‌ రేప్‌ ఉదంతంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ అధికారికంగా వినియోగించే ఇన్నోవా కారులోనే బాలికపై అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది.

    Hyderabad Minor Gang Rape Case

    కొడుకులను కాపాడుకునేందుకు యత్నం..
    విశ్వనగరం హైదరాబాద్‌ ప్రతిష్టను దిగజార్చుతూ, నగరంలో ఆడపిల్లల భద్రతపై సవాళ్లను పెంచుతూ, రాజకీయంగానూ కలకలానికి దారితీసిన ‘మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం’ ఉదంతంలో షాకింగ్‌ విషయాలు బయటికొస్తున్నాయి. మే 28న దారుణం జరగ్గా, మూడు రోజుల తర్వాత పోలీసులలు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. దీంతో బడాబాబుల కొడుకులను పోలీసులు కాపాడుతున్నారు. సిటీలో టాప్‌ మోస్ట్‌ ఇంటర్నేషనల్‌ స్కూలుకు చెందిన విద్యార్థులు జూబ్లీహిల్స్‌ లోని ఆమ్నీషియా పబ్బులో పార్టీ చేసుకున్న క్రమంలో రుమేనియాకు చెందిన మైనర్‌ బాలికను ఇంట్లో దిగబెడతామంటూ తీసుకెళ్లిన బడాబాబుల కొడుకులు.. రెండు సార్లు కార్లు మార్చి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇప్పటి దాకా మొత్తం ఆరుగురు నిందితులను గుర్తించిన పోలీసులు.. మరో నలుగురికి క్లీన్‌ చీట్‌ ఇచ్చారు. ఇప్పటికీ షాక్‌ లోనే ఉన్న బాలిక ప్రస్తుతం చికిత్స పొందుతోంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం గుర్తింపు పొందిన అధికార వాహనంలోనే అత్యాచారం జరిగినట్లు వెల్లడైంది.. సాక్షాధారాలలను మార్చి కొడుకులను కాపాడుకునేందుకు బడాబాబులు యత్నించిన విషయాలు వెలుగగు చూస్తున్నాయి.

    Also Read: JanaSena Party: జనసేన అధికారంలోకి రావడానికి ఉన్న మూడు ఆప్షన్లేంటి?

    అది వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ అధికారిక వాహనం..
    తెలంగాణ వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ అధికారికంగా వినియోగించే (ప్రభుత్వంచే గుర్తించిన) ఇన్నోవా కారులోనే బాలికపై అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది. తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ నంబరుతో ఉన్న వాహనానికి ‘ప్రభుత్వ వాహనం’ అనే స్టిక్కర్‌ కూడా ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజీల ద్వారా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఈ కారు ఓ ప్రజాప్రతినిధి భార్య పేరిట ఉందనే వాదన వినిపిస్తోంది. పోలీసులు ఇన్నోవాను స్వాధీనం చేసుకున్నప్పుడు మాత్రం ప్రభుత్వ వాహనం అనే స్టిక్కర్‌ మాయమైనట్లు సమాచారం. దీనిపై పోలీసులు వివరణ ఇవ్వాల్సి ఉంది. కాగా పోలీసులు తీసుకొచ్చిన ఇన్నోవా వాహనానికి ఉన్న స్టిక్కర్లను చెరిపేయడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. అత్యాచారం తర్వాత నిందితులు వాహనాన్ని నగరం శివారులోని అధికార పార్టీ నేతల ఫాంహౌస్‌కు తీసుకెళ్లి న ంబర్‌ చెరిపేయడం, స్టిక్కర్లు గీకేయడం వంటి ఆనవాళ్లు స్పష్టంగా వామనంపై కనిపిస్తున్నాయి. అధికారిక వాహనం అయినందునే వక్ఫ్‌బోర్డు చైర్మన ఈ చర్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.

    Hyderabad Minor Gang Rape Case

    క్లీన్‌చిట్‌ ఇవ్వడంపై విమర్శలు..
    మైనర్‌ బాలికపై లైంగిక దాడి కేసులలో శుక్రవారం రాత్రి ప్రెస్‌మీట్‌ పెట్టిన వెస్ట్‌ జోన్‌ డీసీపీ జోయల్‌ డెవిస్‌ ఎమ్మెల్యే, వక్ఫ్‌బోర్డ్‌ చైర్మన్‌ కొడుకులకు క్లీన్‌చిట్‌ ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేటీఆర్‌ ట్వీట్‌ తర్వాత హడావుడి చేసిన పోలీసులు విచారణ వివరాలను మీడియాకు వెల్లడించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలలోనూ విలేకరులు అడిగిన ప్రశ్నలకు తడబడ్డారు. ఎమ్మెల్యే తనయుడి ప్రమేయం లేదని తేచ్చారు. శనివారం ఎమ్మెల్యే రఘునందన్‌రావు బయటపెట్టిన ఆధారాలతో ఇప్పుడు పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.. అధికార పార్టీ నేతలకు తలొగ్గి చేసే విచారణలో నిజం దాచే ప్రయత్నం చేసినా వాస్తవాలు నిప్పులా బయటకు వస్తున్నాయి. దీంతో వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ కొడుకు నెల్లూరు పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. ఎమ్మెల్యే సోదరుడి కొడుకును ఇప్పటికే రహస్యంగా దుబాయ్‌ తరలించారని తెలుస్తోంది. ఎమ్మెల్యే కొడుకు విషయంలోనూ సందిగ్ధత కొనసాగుతోంది. అయితే వాడికి తొలుత క్లీన్‌ చీట్‌ ఇచ్చిన పోలీసులు.. తర్వాత ఏ6గా చేర్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కొడుకు ప్రమేయానికి సంబంధించి.. తొలుత.. సీసీ ఫుటేజీ పరిశీలన ద్వారా అతడికి సంబంధం లేదని పోలీసులు తెలిపారు. బాలికతో అతడు కూడా పబ్‌ నుంచి బేకరీకి వెళ్లాడు. తిరిగివచ్చేటప్పుడు మాత్రం ఇన్నోవా వాహనం ఎక్కలేదు. దీంతో అతడి పాత్ర నిర్ధారణ కాలేదని పశ్చిమ మండలం డీసీపీ జోయల్‌ డేవిస్‌ ప్రకటించారు. ఇదిలా ఉండగా బాలికతో కలిసి ఎమ్మెల్యే కుమారుడు బెంజ్‌ కారులో ప్రయాణిస్తున్న చిత్రాలు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఈ నేపథ్యంలో బాధితురాలి వద్ద పోలీసులు మరోసారి వాగ్మూలం తీసుకోనున్నారు. ఈ ప్రక్రియ అనంతరం ఎమ్మెల్యే కుమారుడి పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చుతారు. బాధితురాలి వాగ్మూలాన్ని సెక్షన్‌ 164 కింద జడ్జి ఎదుట రికార్డు చేయడానికి పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.

    Also Read:Minister Viswarup and MLA Satish: ఆ మంత్రి, ఎమ్మెల్యేకు పలకరించే తీరిక లేదా? జగన్ తీరుపై వైసీపీ శ్రేణుల్లో విస్మయం

    Tags