
బీజేపీ ఇప్పటికే హుజూరాబాద్ లో బరిలోకి దిగి తొడగొట్టింది. ఇక ఆ వెంటనే టీఆర్ఎస్ కూడా తన మంత్రులను రంగంలోకి దించింది. ఇప్పుడు వీరందరికీ ధీటుగా లేట్ గా నైనా లేటెస్టుగా రంగంలోకి దిగింది కాంగ్రెస్ టీం.
ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరుగనుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ, మండల బాధ్యులను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నియమించారు.
నియోజకవర్గ ఎన్నికల బాధ్యుడిగా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఎన్నికల సమన్వయ కర్తలుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ లను ప్రకటించారు. ఇక కంట్రోల్ రూం సమన్వయ కర్తగా కవ్వంపల్లి సత్యనారాయణ ను పెట్టారు.
మండలాల వారీగా బాధ్యులు
- -హుజూరాబాద్: టి. నర్సారెడ్డి, లక్ష్మణ్ కుమార్,
-హుజూరాబాద్ టౌన్: బొమ్మ శ్రీరాం, జువ్వాడి నర్సింగరావు,
-ఇల్లంతకుంట: నాయిని రాజేందర్ రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
-కమలాపూర్: కొండా సురేఖ, దొమ్మాటి సాంబయ్య
-జమ్మికుంట: విజయరమణరావు, రాజ్ ఠాగూర్
-వీణవంక: ఆది శ్రీనివాస్, సింగీతం శ్రీనివాస్