తెలంగాణలో మంగళవారం మంత్రివర్గ సమావేశం నిర్వహించారు ఎనిమిది గంటల పాటు సాగిన సమావేశంలో పలు విషయాలపై చర్చించారు. అన్ని గంటలపాటు ఏం చర్చించారనే దానిపై అందరికి ఆశ్చర్యం కలుగుతోంది. సాధారణంగా మంత్రివర్గ సమావేశానికి అజెండా ముందే తయారై ఉంటుంది. మొత్తం సీఎం కనుసనన్నల్లోనే నిర్ణయం జరుగుతుంది. అధికారికంగా మంత్రులకు ముందే సమాచారం చేరుతుంది.
కేబినెట్ సమావేశంలో ఎవరు కూడా వ్యతిరేకంగా మాట్లాడరు. అంతమాత్రాన ఎనిమిది గంటల పాటు ఏ అంశాలు చర్చించారంటే సమాధానం మాత్రం ఉండదు. కేబినెట్ సమావేశంలో రెండో రోజు ఉద్యోగాల భర్తీపై చర్చిస్తారని చెబుతున్నారు. కొద్ది రోజులుగా కేబినెట్ భేటీ జరుగుతున్నా ఉద్యోగాల కల్పనపై ఎలాంటి ప్రకటన లేదు. ఇప్పుడు హఠాత్తుగా ఉద్యోగాల గురించి కేబినెట్ మీటింగ్ అని చెబుతుంటే అందరికీ ఆశ్చర్యం వేస్తోంది.
యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఆమోదం తెలుపుతారా అనేది సందేహమే. తొలిరోజు ఎనిమిది గంటల పాటు సాగిన సమావేశంలో ఏం తేలకపోయినా కేబినెట్ భేటీలో ఉద్యోగాల భర్తీ పై చర్చ జరగలేదు. ఇతర అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో రెండో రోజు మొత్తం ఉద్యోగాల భర్తీపై చర్చ నిర్వహిస్తారని అంటున్నారు. ఉద్యోగాల గురించి తీసుకునే కేబినెట్ నిర్ణయంపై ప్రజల్లో విస్తృతమైన చర్చ జరగాల్సి ఉంటుంది.
ప్రత్యేకంగా భేటీ జరగాల్సి ఉంటుందని చెబుతున్నారు. వ్యూహం ప్రకారమే మరోసారి భేటీ నిర్వహిస్తారని అంటున్నారు. అన్ని శాఖల కార్యదర్శులు ఖాళీల వివరాలతో సమావేశానికి హాజరు కావాలని కేబినెట్ ఆదేశించింది. అవసరం అయినప్పుడు నిర్ణయం తీసుకుని కేబినెట్ సమావేశంకూడా పెట్టకుండా ఫైళ్లను మంత్రుల వద్దకు పంపించి సంతకాలు తీసుకున్న సందర్భాల నుంచి ఇప్పుడు రోజుల తరబడి కేబినెట్ లో పాలసీలపై చర్చించేంతగా ప్రజాస్వామ్యం తెలంగాణలో మారిందని సెటైర్లు పడుతున్నాయి.