Huzurabad Bypoll Results: తెలంగాణ రాష్ట్రమంతా హుజూరాబాద్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారా? అని ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. ఎవరు గెలుస్తారు? ఎంత మెజార్టీ వస్తుంది? ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ. మళ్లీ కారు దౌడ్ తీస్తుందా? లేక కమలం వికసిస్తుందా? ఇవే సంభాషణలు కొనసాగుతున్నాయి. అయితే పది రౌండ్లు పూర్తయ్యేసరికి 5,631 ఓట్ల మెజారిటీతో ఈటల రాజేందర్ లీడ్‌లో ఉండటంతో గెలుపు ఖాయంగా అందరూ భావిస్తున్నారు. అయితే ఇంకా 12 రౌండ్లు ఉన్నా ఆయనే గెలుస్తాడనడానికి కారణాలున్నాయి. అవేంటో తెలుసుకుందామా!

రౌండ్ రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఎంతోకొంత అధిక్యాన్ని కనబరుస్తూ వస్తున్నారు. తాజా సమాచారం ప్రచారం ఇప్పటి వరకు 10 రౌండ్లు పూర్తయ్యాయి. మొత్తంగా 22 రౌండ్లలో గెలుపెవరిదో తేలనుంది. అయితే 10 రౌండ్ వరకే ఈటల రాజేందర్ ఐదు వేలకుపైగా మెజారిటీతో ఉన్నారు. అయితే ఇకపై జరిగే అన్నీ రౌండ్లలో ఈటలకు కంచుకోటగా ఉన్న మండలాలే ఉండటం గమనార్హం. జమ్మికుంట, ఇల్లందకుంట, కమలాపూర్ మండలాల్లో మిగితా రౌండ్ల కౌంటింగ్ నిర్వహించనున్నారు.
Also Read: టీఆర్ఎస్ గెలిస్తేనే ఆ నేతకు రాజకీయ భవిష్యత్తు.. ఎవరాయన ? ఎందుకు ?
ఈటల రాజేందర్ సొంత మండలం కమలాపూర్ కావడం వల్ల ఆయనకు దాదాపు ఎక్కువ మెజార్టీ ఆ మండలంలో వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దాంతోపాటు జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లో ఈటల రాజేందర్‌కు వ్యక్తిగతంగా మంచిపరిచయాలుండటమూ ఆయన గెలుపునకు దోహదం చేసే అంశాలుగా చెబుతున్నారు. జమ్మికుంటలో ఎన్నికల సందర్భంగా తన క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని రోజూ అక్కడే మకాం వేయడం వల్ల జమ్మికుంటలోనూ ఈజీగా మెజార్టీ వస్తుందని భావిస్తున్నారు. ఇక ఇల్లందకుంట మండలంలోనూ సొంత ప్రభావం ఉండటం వల్ల ఈటల రాజేందర్ గెలుపు నల్లేరు మీద నడకేనని లెక్కలు వేస్తున్నారు. దుబ్బాక ఎన్నికలను అందరం చూసాం. చివరి రౌండ్ వరకూ గెలుపెవరిదో తేలని ఉత్కంఠను చూశారు. అలాగే హుజూరాబాద్‌లో ఇప్పటికైతే ఈటల లీడ్ కన్పిస్తోంది.. పైగా మిగితా రౌండ్లన్నీ జరగబోయేవి ఆయన వ్యక్తిగతంగా దగ్గరైన మండలాలు కాబట్టి ఆయనే గెలవబోతున్నారని విశ్లేషకులు జోష్యం చెబుతున్నారు.
Also Read: Gellu Srinivas Yadav: ఎంతటి అవమానం.. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు సొంతూరి వాసుల షాక్