హుజురాబాద్ ఉప ఎన్నిక వేళ.. రాజీనామాల గోల

ప్రజాప్రతినిధులకు హుజురాబాద్ ఉప ఎన్నిక నేతలకు తలనొప్పిగా మారింది. రాష్ర్టంలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు రాజీనామాలు చేయాల్సిందిగా ఒత్తిడి వస్తోంది. దీంతో వారు ఏం చెప్పలేక పోతున్నారు. హుజురాబాద్ లో ఈటల రాజీనామాతో అభివృద్ధి పనుల కోసం కేసీఆర్ ప్రకటిస్తున్న వరాలు మా ప్రాంతాలకు కూడా కావాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. దీంతో మంత్రులు కూడా తమ పదవులు వదులుకోవాలని ఓటర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధుల్లో భయం నెలకొంది. హుజురాబాద్ ను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని కేసీఆర్ […]

Written By: Srinivas, Updated On : August 2, 2021 7:45 pm
Follow us on

ప్రజాప్రతినిధులకు హుజురాబాద్ ఉప ఎన్నిక నేతలకు తలనొప్పిగా మారింది. రాష్ర్టంలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు రాజీనామాలు చేయాల్సిందిగా ఒత్తిడి వస్తోంది. దీంతో వారు ఏం చెప్పలేక పోతున్నారు. హుజురాబాద్ లో ఈటల రాజీనామాతో అభివృద్ధి పనుల కోసం కేసీఆర్ ప్రకటిస్తున్న వరాలు మా ప్రాంతాలకు కూడా కావాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. దీంతో మంత్రులు కూడా తమ పదవులు వదులుకోవాలని ఓటర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధుల్లో భయం నెలకొంది.

హుజురాబాద్ ను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని కేసీఆర్ ప్రకటించిన దళితబంధు పథకం ప్రారంభించడంతో అన్ని ప్రాంతాల నేతల్లో ఆందోళన నెలకొంది. తమ ప్రాంతం కూడా అభివృద్ధి సాధించాలనే తాపత్రయంతో ఈ మేరకు డిమాండ్లు వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో టీఆర్ఎస్ వర్గాల్లో కూడా ఆందోళన కలుగుతోంది. దళితబంధు పథకం ప్రతిబంధకంగా మారనుందని విశ్లేషకులు చెబుతున్నారు. దళితబంధు కోసం వెయ్యి కోట్లు కేటాయిస్తామని చెప్పడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. తమ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ప్రజలు మనకు కూడా ఎన్నికలు రావాలని ఆకాంక్షిస్తున్నారు.

ఇప్పటికే హుజురాబాద్ లో పథకాలు పక్కా వేగవంతం కావడంతో అందరు హుజురాబాద్ నే ఆదర్శంగా తీసుకుంటున్నారు. గతంలో హుజూర్ నగర్, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో సైతం ఇలాంటి హామీలే గుప్పించి ఓట్లు దండుకున్నారని మరోపక్క ఆరోపణలు వస్తున్నప్పటికి ఇక్కడ పనులు చూశాక అందరిలో మాకు కూడా ఇదే రీతిన జరగాలని అభిలషిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గాల్లో పలువురు సామాజిక మాధ్యమాల ద్వారా రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

నల్లగొండ జిల్లాలో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి రాజీనామా చేయాలని కోరుతూ కాంగ్రెస్ ఎస్సీ సెల్ విభాగం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ రాజీనామా కోరుతూ దళిత జేఏసీ నాయకులు ఆందోళన చేశారు. సేవాలాల్ బంజార సంఘం విద్యార్థి విభాగం నిరసనకు దిగింది. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు రాజీనామా చేయాలని కోరుతున్నారు. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రాజీనామా చేయాలని దళితసింహగర్జన పేరుతో దళిత, బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు.

మంత్రి జగదీశ్ రెడ్డి, హుజుర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ రాజీనామా చేయాలని కామెంట్లు వస్తున్నాయి. వరంగల్ జిల్లాలో కూడా జనగామ ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వీరేకాకుండా రాష్ర్టంలోని అందరు ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి అభివృద్ధికి సహకరించాలని ఆకాంక్షిస్తున్నారు.