మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లో ప్రజా గాయకుడు గద్దర్ ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడు. సినిమాలో హీరో పాత్ర తాలూకు ప్లాష్ బ్యాక్ ను ఎలివేట్ చేస్తూ ఒక పాట పాడాల్సి ఉంది. అయితే ఆ పాటను గద్దర్ చేత పాడుస్తున్నారు. సినిమాలో గద్దర్ రోల్ ఒక స్కూల్ మాస్టర్ రోల్ అట. గిరిజన పిల్లలకు పాఠాలు చెప్పి వారిని ప్రయోజకులను చేస్తాడని.. ఈ క్రమంలో చిరు పాత్రకు అనుచరుడిగా గద్దర్ పాత్ర ఉంటుందని తెలుస్తోంది.

ఈ నెల సెకండ్ వీక్ లో జరగనున్న షెడ్యూల్ లో గద్దర్ పార్ట్ కి సంబంధించిన సీన్స్ ను షూట్ చేయబోతున్నారు. ఈ షూట్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించేలా దర్శకుడు ప్లాన్ చేసుకున్నాడు. మొత్తానికి గద్దర్ సన్నివేశాలు చాలా బాగుంటాయని.. పైగా గద్దర్ పాత్ర ఎమోషనల్ గా ఎండ్ అవుతుందని తెలుస్తోంది.
ఇక ఇప్పటికే ఈ సినిమాలో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ఓ కీలక పాత్రలో నటించడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే సల్మాన్ ఖాన్ మెగాస్టార్ అనుచరుడి పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు. వచ్చే షెడ్యూల్ లో సల్మాన్ పాత్ర తాలూకు సీన్స్ ను షూట్ చేయనున్నారు. మరి అప్పటికైనా సల్మాన్ పాత్ర పై క్లారిటీ వస్తోందేమో చూడాలి.
ఏది ఏమైనా సల్మాన్ ఖాన్ నటిస్తే.. ఈ సినిమా పై బాలీవుడ్ లో కూడా మంచి బజ్ క్రియేట్ అవుతుంది. ఇక ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి సోదరిగా అనసూయ నటించబోతుంది. అలాగే తమ్ముడు పాత్రలో సత్యదేవ్ కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ ‘గాడ్ ఫాదర్’ చిత్రం చిత్రీకరణ హైదరాబాద్ లో ఓ ప్రవేట్ ప్లేస్ లో శరవేగంగా జరుగుతోంది.