Afghanistan Crisis: అమెరికా విమాన చక్రాల్లో మృతదేహాలు

తాలిబన్ల సొంతమైన అప్ఘనిస్తాన్ లో ఉంటే ప్రాణాలు పోతాయి సోమవారం కాబూల్ విమానాశ్రయం నుంచి అమెరికా విమానం చక్రాలు, రెక్కలు పట్టుకొని వేలాడుకుంటూ ఆకాశంలోకి ఎగిరిపోయి అక్కడి నుంచి పడిపోయి ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరో.. ఆ దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసారమై అందరి హృదయాలను కలిచివేశాయి. దేశాలను విడిచి వెళ్లేందుకు అప్ఘన్ ప్రజలు ప్రాణాలనే ఫణంగా పెట్టడం యావత్ ప్రపంచాన్ని కదిలించింది. విమానంలో సీటు దొరక్క రెక్కలు, చక్రాలు పట్టుకొని వేలాడుతూ జారిపడి పలువురు మృతిచెందిన సంగతి […]

Written By: NARESH, Updated On : August 18, 2021 4:46 pm
Follow us on

తాలిబన్ల సొంతమైన అప్ఘనిస్తాన్ లో ఉంటే ప్రాణాలు పోతాయి సోమవారం కాబూల్ విమానాశ్రయం నుంచి అమెరికా విమానం చక్రాలు, రెక్కలు పట్టుకొని వేలాడుకుంటూ ఆకాశంలోకి ఎగిరిపోయి అక్కడి నుంచి పడిపోయి ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరో.. ఆ దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసారమై అందరి హృదయాలను కలిచివేశాయి. దేశాలను విడిచి వెళ్లేందుకు అప్ఘన్ ప్రజలు ప్రాణాలనే ఫణంగా పెట్టడం యావత్ ప్రపంచాన్ని కదిలించింది.

విమానంలో సీటు దొరక్క రెక్కలు, చక్రాలు పట్టుకొని వేలాడుతూ జారిపడి పలువురు మృతిచెందిన సంగతి తెలిసిందే. తాజాగా కాబూల్ నుంచి వెళ్లిన ఓ అమెరికా విమానం ల్యాండింగ్గేర్ వద్ద చక్రల్లో మానవ అవశేషాలు లభించడం కలిచివేసింది. అప్ఘన్ ప్రజల ప్రాణాలు అమెరికా విమాన చక్రాల మధ్యలో నలిగిపోయిన దైన్యం కనిపించింది. పరిస్థితులు భీతావాహంగా కనిపిస్తున్నాయి.

కాబూల్ లోని అమెరికా విమానం చుట్టుముట్టి అందులో ఎక్కడానికి చాలా మంది ప్రయాణించారు. అయితే ఆ విమానంలో అమెరికా దౌత్య అధికారులు, సిబ్బంది ప్రయాణిస్తున్నారు. వారి ప్రాణాలకు ప్రమాదం అని.. భద్రతా పరిస్థితులు క్షణక్షణానికి క్షీణిస్తుండడంతో వీలైనంత త్వరగా విమానాన్ని టేకాఫ్ చేశారు అమెరికన్ పైలెట్లు. ఈ క్రమంలోనే ఎవరైనా విమానం టైర్ల కింద పడిపోయారా? లేక ల్యాండింగ్ గేర్ వీల్ వెల్ ను పట్టుకొని ప్రయాణిస్తుండగా ఆ చక్రాల్లో ఇరుక్కొని చనిపోయారా? అన్న దానిపై అమెరికన్ అధికారులు విచారణ జరుపుతున్నారు.

కాబుల్ ఎయిర్ పోర్టు నుంచి గత సోమవారం బయలు దేరిన యూఎస్ ఎయిర్ ఫోర్స్ సీ17 విమానం మంగళవారం ఖతార్ లోని అల్ ఉదైద్ ఎయిర్ బేస్ లో ల్యాండ్ అయ్యింది. అక్కడ విమానాన్ని పరిశీలిస్తుండగా ల్యాండింగ్ గేర్ వీల్ వెల్లో మానవ అవశేషాలను గుర్తించారు. అవి అప్ఘన్ వాసులవేనని తెలిసింది. విమాన చక్రాలను పట్టుకొని ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది.

తాజాగా అమెరికా విమానం పట్టుకొని ప్రయాణిస్తున్న కొందరు వీడియోలు తీసుకున్నారు. ఆ వీడియోలు తాజాగా సోషల్ మీడియాలోకి ఎక్కాయి. అవిప్పుడు వైరల్ అయ్యాయి. విమానం పట్టుకొని ఎంత ప్రమాదకరంగా అప్ఘన్ యువకులు ప్రయాణించారో తెలిసింది. వారే విమానం నుంచి పడి చనిపోయి ఉంటారని తెలుస్తోంది.