జగన్ కేసుల్లో భారీ ట్విస్ట్.. హైకోర్టు షాక్

ఏపీ సీఎం జగన్ కేసుల్లో భారీ ట్విస్ట్ వచ్చింది. ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న వారికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఏపీ సీఎం జగన్ పై దాఖలైన అక్రమాస్తుల కేసుల్లో నిందితులుగా ఉన్న వారికి తెలంగాణ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. సీబీఐ దాఖలు చేసిన వేర్వేరు చార్జిషీట్లలో నిందితులుగా ఉన్న వారిలో ఒకటి కంటే ఎక్కువ కేసుల్లో ఉన్న వారు చాలా మంది ఉన్నారు. దీంతో వీరంతా ఒక్కో కేసులో గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టులు ఇచ్చిన […]

Written By: NARESH, Updated On : July 3, 2021 11:10 am
Follow us on

ఏపీ సీఎం జగన్ కేసుల్లో భారీ ట్విస్ట్ వచ్చింది. ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న వారికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఏపీ సీఎం జగన్ పై దాఖలైన అక్రమాస్తుల కేసుల్లో నిందితులుగా ఉన్న వారికి తెలంగాణ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది.

సీబీఐ దాఖలు చేసిన వేర్వేరు చార్జిషీట్లలో నిందితులుగా ఉన్న వారిలో ఒకటి కంటే ఎక్కువ కేసుల్లో ఉన్న వారు చాలా మంది ఉన్నారు. దీంతో వీరంతా ఒక్కో కేసులో గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టులు ఇచ్చిన ఆదేశాల ఆధారంగా తమకు విముక్తి కల్పించాలని వేడుకుంటున్నారు. తాజాగా హైకోర్టు వారికి షాకిస్తూ అలా కుదరదని స్పష్టం చేసింది. వీరిపై సీబీఐ విచారణ చేపట్టాలని నిర్ణయించింది. విచారణలో వీరంతా ప్రతీ కేసులోనూ తమ నిర్ధోషిత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది.

ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ నమోదు చేసిన చార్జిషీట్లలో జగన్ తోపాటు దాదాపు 100 మందికి పైగా సహ నిందితులు ఉన్నారు. వీరంతా కొన్నాళ్లుగా సీబీఐ విచారణ నిలిపివేయాలని హైకోర్టును ఆశ్రయించారు. కొందరికి విముక్తి లభించింది. మిగిలిన నిందితులు కూడా తమకు విముక్తి కల్పించాలని హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. వారికి వర్తింప చేసిన తీర్పులనే తమకూ వర్తింపచేయాలని హైకోర్టును కోరుతున్నారు. దీన్ని హైకోర్టు తోసిపుచ్చింది.

జగన్ అక్రమాస్తుల కేసుల్లో ప్రధానంగా క్విడ్ ప్రోకో ఆరోపణలే ఉన్నాయంటూ నిందితులు విముక్తి కోరుతున్నారు. అయితే సీబీఐ అభ్యంతరాలు లేవనెత్తుతోంది. అన్ని కేసుల్లోనూ నిందితులకు విముక్తి దొరుకుతుందని హైకోర్టు దృష్టికి తెచ్చింది. కేసుల తీవ్రత ఆధారంగానే నిర్ణయాలు తీసుకోవాలని హైకోర్టును కోరింది. దీంతో నిందితులకు గంపగుత్తగా విముక్తి కల్పించడం కుదరదని హైకోర్టు తేల్చేసింది. వీరిపై సీబీఐ నమోదు చేసిన కేసుల ఆధారంగానే విడివిడిగా పిటీషన్లు విచారించి దోషులా కాదా? అన్నది తేలుస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఇప్పుడు జగన్ కేసుల్లో ఉన్న వారంతా విచారణను ఎదుర్కోవాల్సిందే.

ఇక జగన్ కేసుల్లో పిటీషన్లపై కేసుల వారీగా విచారించాలని హైకోర్టు సీబీఐకి కీలక ఆదేశాలు జారీ చేసింది. జగన్ కేసుల్లో సహ నిందితులు దాఖలు చేసిన పిటీషన్లపై విచారణ కోసం సీబీఐ కేసుల వారీగా నిందితుల జాబితా సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది. నిందితుల జాబితాను చార్జీషీట్లలో జాబితాను కేసుల వారీగా హైకోర్టుకు సమర్పించనుంది. కేసు తీవ్రత ఆధారంగా విచారణ జరిపి తీర్పులు ఇవ్వాల్సి ఉంటుంది. నిందితులపై దాఖలైన కేసులను గంపగుత్తగా కొట్టేయడానికి వీలుండదని తెలిపారు.

జగన్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఏపీ క్యాడర్ సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మికి కూడా హైకోర్టులో ఊరట లభించలేదు.శ్రీలక్ష్మీ పిటీషన్ ను సైతం హైకోర్టు తోసిపుచ్చింది.