https://oktelugu.com/

తెలంగాణకు బోలెడు క్యాష్: అమ్ముకో.. సొమ్ము చేసుకో!

కరోనా లాక్ డౌన్ తో దేశాలకు దేశాల ఆర్థిక వ్యవస్థలే కుప్పకూలాయి. భారత్ జీడీపీ మైనస్ 28లోకి జారిపోయింది. ఇక సంపన్న తెలంగాణ కూడా ఆర్థికమందగమనంతో అగచాట్లు పడుతోంది. అందుకే సీఎం కేసీఆర్ ఇప్పుడు నిజాం కాలం నుంచి తెలంగాణకు ఉన్న భారీ, విలువైన భూములను అమ్మేందుకు నడుం బిగించారు. ఈ ఆర్థిక కష్టకాలంలో భూములు అమ్మి సొమ్ము చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. పథకాలు, ప్రాజెక్టులు, వ్యయాల భారం తెలంగాణపై భారీగా పడింది. పీఆర్సీ కూడా పెంచడంతో […]

Written By:
  • NARESH
  • , Updated On : June 15, 2021 / 08:43 AM IST
    Follow us on

    కరోనా లాక్ డౌన్ తో దేశాలకు దేశాల ఆర్థిక వ్యవస్థలే కుప్పకూలాయి. భారత్ జీడీపీ మైనస్ 28లోకి జారిపోయింది. ఇక సంపన్న తెలంగాణ కూడా ఆర్థికమందగమనంతో అగచాట్లు పడుతోంది. అందుకే సీఎం కేసీఆర్ ఇప్పుడు నిజాం కాలం నుంచి తెలంగాణకు ఉన్న భారీ, విలువైన భూములను అమ్మేందుకు నడుం బిగించారు. ఈ ఆర్థిక కష్టకాలంలో భూములు అమ్మి సొమ్ము చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు.

    పథకాలు, ప్రాజెక్టులు, వ్యయాల భారం తెలంగాణపై భారీగా పడింది. పీఆర్సీ కూడా పెంచడంతో ఆ జీతాల భారం కూడా కానకష్టంగా మారింది. దీంతో తెలంగాణలోని విలువైన భూములను అమ్మి సొమ్ము చేసుకోవాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది.

    ముందుగా రియల్ భూమ్ అధికంగా ఉన్న హైదరాబాద్ పై దృష్టిసారించింది. ఇక్కడ రియల్ భూమ్ కారణంగా ఎకరం కోట్లలోకి చేరిపోయింది. ఒక్కో ఫ్లాట్ కే కోటి పెట్టినా దొరకడం లేదు. అన్ని చోట్లా ప్రభుత్వానికి విలువైన భూములున్నాయి.

    అయితే ఈ ప్రభుత్వ భూముల అమ్మకానికి కోర్టుతోపాటు చాలా చిక్కులు ఉంటాయి. ఎవరు కోర్టుకెళ్లినా ఆగిపోతుంది. ఆ భూముల హక్కుదారుల ఫిర్యాదులు, ఇతర సమస్యలు అంతా గందరగోళ వ్యవహారం. అందుకే కొనుగోలు దారులు ముందుకొస్తారా? లేదా? అన్నది తెలంగాణ సర్కార్ కు కలవర పెడుతోంది.

    అందుకే ముందుగా తెలంగాణలోనే విలువైన కోకాపేట భూములను సర్కార్ అమ్మకానికి పెట్టింది. 65 ఎకరాలను అమ్మడానికి ఈ-ఆక్షన్ వేలానికి షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే నెల 13న రిజిస్ట్రేషన్ కు చివరి తేది. డబ్బులు కట్టి చెల్లించి వీటిని కొనుగోలు చేసుకోవచ్చు.

    ఈ బిడ్ సక్సెస్ అయితే.. ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగితే ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఉన్న విలువైన భూములను అమ్మేందుకు కేసీఆర్ సర్కార్ రెడీ అవుతోంది. దీనిద్వారా దాదాపు 35వేల కోట్ల విలువైన సొమ్ము వస్తుందని సర్కార్ అంచనావేస్తోంది. దాంతో ఈ అప్పులు, ఆర్థిక కష్టాలు తొలుగుతాయని భావిస్తోంది.

    ఈ ఇప్పటికే ఈ భూముల అమ్మకాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు ఖండించాయి. కోర్టుకు వెళుతామని హెచ్చరించాయి. దీంతో ఈ అమ్మకాలు మందడుగు పడుతాయా? లేదా అన్నది చూడాలి.