తెలంగాణ సర్కారుకు భూముల అమ్మకంతో దండిగా నిధులు

తెలంగాణలో ప్రభుత్వ భూముల అమ్మకంపై దుమారం రేగుతోంది. అందరు ప్రశ్నిస్తున్నారు. ధనిక రాష్ర్టం అని చెప్పుకునే సీఎం భూములను ఎందుకు అమ్ముతున్నారో అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా బీజేపీ నేత విజయశాంతి హరీశ్ రావు, కేటీఆర్పై విమర్శలు చేశారు. టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. తెలంగాణ భూముల అమ్మకంపై ఆర్థిక మంత్రి హరీశ్ రావు వాదన సరిగా లేదని దుయ్యబట్టారు. భూముల అమ్మకాన్ని దోపిడీగా అభివర్ణించారు. భూముల అమ్మకం […]

Written By: Srinivas, Updated On : June 15, 2021 11:16 am
Follow us on


తెలంగాణలో ప్రభుత్వ భూముల అమ్మకంపై దుమారం రేగుతోంది. అందరు ప్రశ్నిస్తున్నారు. ధనిక రాష్ర్టం అని చెప్పుకునే సీఎం భూములను ఎందుకు అమ్ముతున్నారో అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా బీజేపీ నేత విజయశాంతి హరీశ్ రావు, కేటీఆర్పై విమర్శలు చేశారు. టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. తెలంగాణ భూముల అమ్మకంపై ఆర్థిక మంత్రి హరీశ్ రావు వాదన సరిగా లేదని దుయ్యబట్టారు. భూముల అమ్మకాన్ని దోపిడీగా అభివర్ణించారు. భూముల అమ్మకం ద్వారా నిధులు సమకూర్చుకోవాలని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు.

కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ భూముల అమ్మకం ఏంటని ప్రశ్నించారు. పైసలున్న తెలంగాణలో భూములను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. రాష్ర్టాన్ని అప్పుల పాలు చేసిన టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు తెలంగాణను అధోగతి పాలు చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై ఉద్యమాలకు సమాయత్తం కాకతప్పదని సూచించారు. సెక్రటేరియట్ కే రాని సీఎంకు కొత్త భవనాలెందుకని పేర్కొన్నారు.

విజయశాంతి టీఆర్ఎస్ లోకి రాక ముందు తెలంగాణ పేరుతో ఒక పార్టీ ఏర్పాటు చేసుకున్నా దాన్ని నడపలేక టీఆర్ఎస్ లో చేరారు. అప్పుడు హరీశ్ రావే దగ్గరుండి విజయశాంతిని పార్టీలో చేరేందుకు సహకరించారు. తరువాత టీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ లోకి వెళ్లిన విజయశాంతి మళ్లీ బీజేపీలోకి మారారు. ఇప్పుడు విజయశాంతి వ్యాఖ్యలపై హరీశ్ రావు, కేసీఆర్ ఎలా స్పందిస్తారోనని ఎదురు చూస్తున్నారు.

తెలంగాణ భూముల అమ్మకంపై అన్ని వర్గాల్లో అసంతృప్తి చెలరేగుతోంది. ప్రభుత్వ భూములు అమ్మేంత అవసరం ఏమొచ్చిందని అందరిలో అనుమానాలు కలుగుతున్నాయి. ధనిక రాష్ర్టమని చెప్పుకుంటూ ఆస్తుల్ని అమ్మేస్తే భవిష్యత్తు అంధకారమవుతుందని విశ్లేషకుల అంచనా. ప్రభుత్వం భూముల అమ్మకంపై పునరాలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.