https://oktelugu.com/

Ayodhya Temple: అయోధ్య ఆలయానికి భారీ విరాళం.. చెక్కు ఇచ్చి ట్విస్ట్‌ పెట్టిన భక్తుడు…!

భారతీయ హిందువల 500 ఏళ్ల గల ఈ ఏడాది జనవరిలో సాకారమైంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయింది. రామ్‌ల్లాల కొలువుదీరాడు. ఈ ఆలయాన్ని పూర్తిగా భక్తులు ఇచ్చిన విరాళాలతోనే నిర్మించారు. ఇంకా భారీగా విరాళాలు ఉన్నాయి. ఇక రామ్‌లల్లాకు ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా కానుకలు వచ్చాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 24, 2024 12:35 pm
    Ayodhya Temple

    Ayodhya Temple

    Follow us on

    Ayodhya Temple: అయోధ్యలో రామ మందిర నిర్మాణం.. భారతీయ హిందువల కళా.. ఏళ్లుగా ఇది అనేక ఆటంకాలు ఎదుర్కొంది. మోదీ 2.0 పాలనలో దీనికి పరిష్కాం లభించింది. సుప్రీం కోర్టు రామ మందిర నిర్మాణానికి అనమతి ఇచ్చింది. దీంతో మోదీ అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శ్రీకారంచుట్టారు. రామజన్మభూమి ట్రస్టు ఆధ్వర్యంలో రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేశారు. ఈ ఏడాది జనవరి 22న ప్రధాని నరేంద్రమోదీ రామాలయానికి ప్రాణప్రతిష్ట చేశారు. అంగరంగవైభవంగా వేడుక నిర్వహించారు. ఇదిలా ఉంటే ఆలయ నిర్మాణం కోసం పెద్ద ఎత్తున విరాళాలు అందాయి. ఆలయ నిర్మాణం కోసం ఇప్పటి వరకూ రూ.1,836 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా ట్రస్టు పేరిట రూ.2,600 కోట్లు బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నాయి. ఆఆయ నిర్మాణం పూర్తిగా భక్తుల విరాళాలలోనే పూర్తి చేశారు. అయోధ్యకు సుమారు 11 కోట్ల మంది విరాళాలు ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికీ ఆలయానికి కానుకలు, విరాళాలు వస్తున్నాయి. రాముడి దర్శనానికి వస్తున్న భక్తులు స్వామివారికి కానులు ఇస్తున్నారు. ఆలయ నిర్మాణం ఇంకా పూర్తి కాకపోవడంతో భక్తులు విరాళాలు కూడా ఇస్తున్నారు. తాజాగా అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు ఓ భక్తుడు రూ.2,100 కోట్ల చెక్కును పంపించాడు. అయితే భారీ చెక్కుపై సదరు భక్తుడు తన పేరు, మొబైల్‌ నంబరు, చిరునామా రాసి ఇక్కడే పెద్ద మెలిక కూడా పెట్టారు. ప్రధానమంత్రి సహాయనిధి పేరు మీద రాసిన ఆ చెక్కును ట్రస్టుకు పోస్టు ద్వారా పంపినట్టు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌ ధ్రువీకరించారు. రెండు రోజుల కిందటే ఈ చెక్కు తమ కార్యాలయానికి వచ్చినట్లు ఆయన తెలిపారు. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోడానికి ప్రధాని కార్యాలయానికి పంపాల్సిందిగా ట్రస్ట్‌ అధికారులకు సూచించామని చెప్పారు.

    ఆదాయ వ్యవయాల వెల్లడి..
    ఇదిలా ఉండగా 2023–24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ, వ్యయాల వివరాలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ గురువారం(ఆగస్టు 22న) వెల్లడించింది. గతేడాది ఆలయ నిర్మాణం కోసం రూ.776 కోట్లు ఖర్చుచేసినట్టు తెలిపింది. ఇందులో రూ.540 కోట్లు ఆలయం కోసం, రూ.136 కోట్లు ఇతరాలకు ఖర్చయ్యిందని వివరించింది. శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్‌ ౖచైర్మన్‌ మహంత్‌ నృత్య గోపాల్‌ దాస్‌ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఇప్పటి వరకూ మొత్తం ఆలయ నిర్మాణం కోసం రూ.1,850 కోట్లు ఖర్చయ్యిందని వివరించారు. ఈ ఆర్దిక సంవత్సరంలో రూ.850 కోట్లు ఖర్చవుతుందని పేర్కొన్నారు.

    వడ్డీ రూపంలో రూ.204 కోట్లు..
    గత ఆర్ధిక సంవత్సరంలో ట్రస్ట్‌కు రూ.363.34 కోట్లు రాగా.. ఇందులో రూ.204 కోట్లు బ్యాంకుల్లో వడ్డీ రూపంలో రూ.58 కోట్లు నగదు, చెక్కుల రూపంలో వచ్చిందని అన్నారు. హుండీ ద్వారా రూ.24.50 కోట్లు, ఆన్‌లైన్‌ విరాళాల ద్వారా రూ.71 కోట్లు వచ్చింది. ఎన్‌ఆర్‌ఐల నుంచి రూ.10.43 కోట్ల విరాళాలుగా వచ్చినట్టు చెప్పారు. ఆలయ పేరిట బ్యాంకు ఖాతాలో రూ.2,600 కోట్లు ఎఫ్‌డీల రూపంలో ఉన్నట్లు చంపత్‌రాయ్‌ వెల్లడించారు. సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌కు 900 కిలోల వెండి, 20 కిలోల బంగారం పంపినట్టు వివరించారు. ఇక, రామమందిరం మొదటి అంతస్తులో శ్రీరామ దర్బార్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.