https://oktelugu.com/

Chandrababu In Jail : చంద్రబాబు జైల్లో ఎలా ఉంటాడు? ‘ఏఐ’ చేసిన మాయ

కొందరు ఔత్సాహికులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మాయ చేశారు. చంద్రబాబు జైల్లో ఎలా ఉన్నాడో ఏఐలో చేసి చూపించారు.

Written By: , Updated On : October 25, 2023 / 02:49 PM IST
Chandrababu

Chandrababu

Follow us on

Chandrababu In Jail : ఒకటికాదు రెండు కాదు.. దాదాపు 45 రోజులకు పైగా మన 45 ఇండస్ట్రీ బాబు గారు జైల్లో ఉంటున్నారు. రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నారు..45 ఏళ్లుగా రాజకీయం చేసిన ఈ పెద్ద మనిషికి ఏకంగా జైల్లోనే ఫ్యాన్లు, ఏసీలకు కోర్టు సైతం మానవతాదృక్పథంతో పర్మిషన్ వచ్చేసింది. పైగా ఇంటి భోజనం కూడా అందుతోంది. సాధారణ ఖైదీలు అనుభవించే నరకం బాబుకు లేదనే చెప్పాలి.. అందుకే జైల్లో ఉన్నా ఆ బిందాస్ జీవితమే బాబు దక్కించుకున్నాడు.

అయితే చంద్రబాబు లోటు ఏంటయ్యా అంటే అది రాజకీయాల్లో లేకపోవడమే. జైల్లో ఉంటే రాజకీయం చేయలేరు కదా.. అందుకే ఒంటరిగా ఉన్నారు. చంద్రబాబు జైల్లో ఎలా ఉంటాడో చూడాలన్న ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. కానీ జైలు అంటేనే సవాలక్ష కండీషన్లు, నిబంధనలు ఉంటాయి. ములాఖత్ లలో తప్పితే మామూలుగా చంద్రబాబును చూడరాదు. చంద్రబాబు జైలుకు వెళితే చూడాలని.. ఆయన జైల్లో ఎలా గడుపుతాడో వీక్షించాలని చాలా మంది ప్రత్యర్థులకు ఉంటుంది.

అందుకే కొందరు ఔత్సాహికులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మాయ చేశారు. చంద్రబాబు జైల్లో ఎలా ఉన్నాడో ఏఐలో చేసి చూపించారు. ఒక చిన్న ఫ్యాన్ పక్కనపెట్టుకొని ‘ఒక్కడై రావడం.. ఒక్కడై పోవడం అన్న సాడ్ సాంగ్’ను యాడ్ చేసి చంద్రబాబు జైలు గదిలో ఉన్న ఈ వీడియోను షేర్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.