Homeజాతీయ వార్తలుLink Mobile no to Driving Licence: వాహనదారులకు అలెర్ట్.. పాటించకుంటే మీ పని ఖతమే!

Link Mobile no to Driving Licence: వాహనదారులకు అలెర్ట్.. పాటించకుంటే మీ పని ఖతమే!

Link Mobile no to Driving Licence: భారతదేశంలోని వాహనదారులు, డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్లకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కీలక సూచన చేసింది. మీ వాహన రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ వివరాలలో మీ మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని కోరింది. ఇది వరకు ఈ పని కోసం ఆర్‌టీఓ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు ఆ అవసరం లేకుండా, పూర్తిగా ఆన్‌లైన్‌లోనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కొత్త సౌకర్యంతో ప్రజల సమయం ఆదా అవుతుంది, పని కూడా మరింత ఈజీ అవుతుంది.

మీ మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవడం చాలా ముఖ్యమని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దీని ప్రధాన ఉద్దేశ్యం, ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించిన మెసేజ్ లు, ట్రాఫిక్ చలాన్లు, వెహికల్ రెన్యువల్ నోటిఫికేషన్‌లు, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని నేరుగా, సకాలంలో అందించడమే. అప్‌డేట్ చేయబడిన మొబైల్ నంబర్ ద్వారా, డ్రైవర్లు, వాహన యజమానులు తమ వాహనానికి సంబంధించిన ఎలాంటి కీలక సమాచారాన్ని మిస్ అవ్వకుండా చూసుకోవచ్చు. ఉదాహరణకు, మీ వాహనానికి సంబంధించి కొత్త జరిమానా విధించినప్పుడు లేదా డాక్యుమెంట్ల గడువు ముగిసినప్పుడు వెంటనే మీ మొబైల్‌కు మెసేజ్ వస్తుంది. ఇది డిజిటల్ గవర్నెన్స్ దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న ఒక అడుగు.

Also Read: ఆధార్‌ కీలక అప్‌డేట్‌.. పిల్లలకు అది తప్పనిసరి!

ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకునే విధానం ఇదే
మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవడానికి ఆర్‌టీఓ ఆఫీస్‌ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఈ పనిని ఇంటి వద్ద నుంచే ఈజీగా ఆన్‌లైన్‌లో పూర్తి చేసుకోవచ్చు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం రెండు ప్రత్యేక పోర్టల్‌లను అందుబాటులోకి తెచ్చింది: వాహన్, సారథి

వాహన్ పోర్టల్ ద్వారా: మీ వాహన రిజిస్ట్రేషన్ వివరాల్లో మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయడానికి వాహన్ పోర్టల్ ఉపయోగపడుతుంది. దీని కోసం మీరు https://vahan.parivahan.gov.in/mobileupdate అనే లింక్‌ను ఆశ్రయించవచ్చు. ఈ పేజీలో మీ వాహనం రిజిస్ట్రేషన్ నంబర్, ఛాసిస్ నంబర్, ఇంజిన్ నంబర్ వంటి వివరాలు నమోదు చేసి మొబైల్ నంబర్‌ను మార్చుకోవచ్చు.

సారథి పోర్టల్ ద్వారా: మీ డ్రైవింగ్ లైసెన్స్ వివరాల్లో మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయడానికి సారథి పోర్టల్ ఉపయోగపడుతుంది. దీని కోసం https://sarathi.parivahan.gov.in అనే వెబ్‌సైట్‌కు వెళ్లాలి. ఇక్కడ మీ డ్రైవింగ్ లైసెన్స్ నంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలు సమర్పించి మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు.

ఈ పోర్టల్స్‌లో అవసరమైన వివరాలు సమర్పించి మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవడం ద్వారా, వాహనదారులు ఎంతో సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. అలాగే, పారదర్శకత పెరుగుతుంది, ప్రభుత్వ సేవలు మరింత పారదర్శకంగా ప్రజలకు అందుతాయి. డిజిటల్ సేవలను ప్రోత్సహించడంలో ఇది ఒక కీలకమైన చర్యగా చెప్పొచ్చు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular