Pushpa Movie: పుష్ప.. ఇది అన్ని సినిమాల్లా కాకుండా ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచిందనే చెప్పొచ్చు. ఎంత స్టైలిష్ గా ఉన్న హీరోను అయినా.. ఊర మాస్ యాంగిల్ లో.. ఒక కూలీ లాగా చూపించినా ఫ్యాన్స్ ఆక్సెప్ట్ చేస్తారని నిరూపించింది. అల్లు అర్జున్ స్థాయిని మరింత పెంచింది. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా ఎదిగే విధంగా సుకుమార్ ఈ సినిమాను రూపొందించాడు. ప్యాన్ ఇండియా మూవీగా వచ్చి అన్ని భాషల్లో రికార్డుల మోత మోగించింది.
ప్రతి సినిమాలో మనకు హీరో పాత్ర మాత్రమే గుర్తుంటుంది. కానీ పుష్ప మూవీ మాత్రం బాహుబలి లాగే.. అన్ని పాత్రలను గుర్తుండిపోయేలా చేసింది. కెమెరా పనితనం అయితే మరో లెవల్. అయితే ఇన్ని విధాలుగా సుకుమార్ ఈ సినిమాను రూపొందించినా.. ఇందులో కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. లాజిక్ గా లోచిస్తే అవి అర్థం అవుతాయి. మొదటగా హీరో ఎంట్రీ ఇచ్చే సీన్‌లో.. రాత్రి అవుతున్నట్టు మొదట కనిపించినా.. ఆ తర్వాత లైట్ ఫోకస్‌ను పెంచేసి హీరో ఫేస్‌ను బాగా చూపిస్తారు.
Also Read: బాలయ్య ‘అఖండ’ రికార్డ్స్ ఇప్పట్లో ఆగేలా లేవు !
ఇక లారీని బావిలో పడేసినప్పుడు అయితే చాలా పెద్ద శబ్ధం వస్తుంది కదా. మరి ఆ శబ్ధం వెనకాలే వస్తున్న పోలీసులకు వినపడదా. పైగా లారీ ఒకేసారి మునగదు కదా. అది కూడా కనిపించలేదా. అంటే ఇది కూడా ఇక్కడ మిస్టేకే. ఇక ఆ బావిని చూపించేందుకు మొదటిసారి వ్యాన్‌లో వచ్చిన కేశవకు ఆ కారు దిగడం కూడా రాదు. కానీ రెండో సీన్ లోనే ఆ కారును కేశవ నడుపుకుంటూ వస్తాడు. ఇది ఎలా సాధ్యం. ఇక ఆ కారును తీసుకుని పుష్ప తన అమ్మను ఎక్కించుకునే వచ్చినప్పుడు ఆ కారుకు నెంబర్ ప్లేట్ ఉంటుంది. కారు కొన్న వెంటనే ఎవరూ నెంబర్ ప్లేట్ ఇవ్వరు కదా. ఈ విషయాన్ని లెక్కల మాస్టర్ సుకుమార్ మర్చిపోయాడు.
ఇక పుష్ప మొదటిసారి గంధపు చెక్కలను కొట్టేందుకు బస్సులో కింద కూర్చుని వెళ్లినప్పుడు.. అక్కడ వాతావరణ ఎండగా ఉంటుంది. అయితే అతను బస్సు దిగినప్పుడు కూడా అలాగే ఎండ ఉంటుంది. కానీ అడవిలోకి అడుగు వేయగానే వర్షం పడుతుంది. అంత ఎండ కొట్టే సమయంలో వర్షం ఎలా పడింది. ఇదెలా సాధ్యం. ఇక మధ్యలో తన చిన్నప్పుడు అమ్మ తనను పట్టుకునేందుకు పరుగెత్తుకుంటూ వచ్చే సీన్ ఉంటుంది. అయితే ఆ సీన్‌లో మొదటి కెమెరా యాంగిల్‌లో వెనకాల స్కూటర్ ఉంటుంది. కానీ కెమెరా యాంగిల్ ఛేంజ్ అయ్యే కొద్దీ స్కూటర్ మాయం అవుతుంది.
ఇలా పుష్ప మూవీలో కూడా చాలా వరకు లాజికల్ మిస్టేక్స్ ఉన్నాయి. ఎంత లెక్కల మాస్టర్ అయినా కూడా కొన్ని సార్లు ఇలా దొరికిపోతారు. బాహుబలి లాంటి పెద్ద సినిమాలోనే చాలా వరకు ఇలాంటివి ఉన్నాయి. మరి పుష్పలో ఉండటం పెద్ద విషయమేమీ కాదు. అయితే సినిమా అంటేనే లాజిక్ కంటే కూడా మ్యాజిక్ అని తెలుసు. లాజిక్ ఆలోచిస్తే సినిమాను ఆస్వాదించలేం.
Also Read: సహజ నటితో సహజమైన ముచ్చట్లు !