https://oktelugu.com/

గుడ్ ఫ్రైడే ఎలా జరుపుకోవాలో.. జగన్ సలహా!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా రక్కసి రాజ్యమేలుతుంది. కోవిద్-19 భయంతో అన్ని పండగలు జరుపుకోవడానికి వీలు లేకుండా అయిపోయింది. ఉగాది, శ్రీరామనవమి వంటి పండగలను కూడా ప్రజలు ఇళ్లలోనే ఉంటూ జరుపుకున్నారు. ఈ రోజు గుడ్ ఫ్రైడే. యేసుక్రీస్తును శిలువ వేసిన రోజు. క్రైస్తవులకు అతి ప్రాముఖ్యమైన పండుగ. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్రైస్తవులకు కీలక సూచనలు చేశారు. ట్విట్టర్ వేదికగా తన సందేశాన్ని వినిపించారు. ‘మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 10, 2020 12:26 pm
    Follow us on

    ప్రపంచ వ్యాప్తంగా కరోనా రక్కసి రాజ్యమేలుతుంది. కోవిద్-19 భయంతో అన్ని పండగలు జరుపుకోవడానికి వీలు లేకుండా అయిపోయింది. ఉగాది, శ్రీరామనవమి వంటి పండగలను కూడా ప్రజలు ఇళ్లలోనే ఉంటూ జరుపుకున్నారు. ఈ రోజు గుడ్ ఫ్రైడే. యేసుక్రీస్తును శిలువ వేసిన రోజు. క్రైస్తవులకు అతి ప్రాముఖ్యమైన పండుగ. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్రైస్తవులకు కీలక సూచనలు చేశారు. ట్విట్టర్ వేదికగా తన సందేశాన్ని వినిపించారు. ‘మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం… ఇవీ జీసస్‌ జీవితం మానవాళికి ఇచ్చిన సందేశాలు. గుడ్‌ ఫ్రైడే, ఈస్టర్‌ సండే వేడుకల్ని క్రైస్తవ సోదర సోదరీమణులంతా మీ ఇళ్ళలో, మీ కుటుంబంతో ఘనంగా జరుపుకోవాలి. కోవిడ్‌ నుంచి మానవాళిని రక్షించాలని రక్షకుడైన యేసుక్రీస్తుని మనమంతా ప్రార్థించాలి.’ అని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.