Homeజాతీయ వార్తలుBudget: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్యం కోసం ఎంత కేటాయించ‌నున్నారంటే..?

Budget: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్యం కోసం ఎంత కేటాయించ‌నున్నారంటే..?

Budget: ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మొదటి వారంలో ఫైనాస్స్ బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశ పెడుతుంది. ఇందులో జరిపే కేటాయింపులే ఏడాది మొత్తం అమలు చేస్తారు. ఏయే రంగానికి ఎంత మేర ఖర్చు చేయనున్నారనే విషయాన్ని పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రతులను చదివి వినిపిస్తారు. వ్యవసాయం, ఆరోగ్యం, రక్షణ, విద్య, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక రంగం ఇలా అన్నింటకీ బడ్జెట్‌లో కేటాయింపులు చేస్తారు. గత రెండేళ్లుగా దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో వైద్యారోగ్య రంగాన్ని మెరుగు పరిచేందుకు కేంద్రం బడ్జెట్‌లో ఎంత మేర నిధులను కేటాయించనున్నదనే విషయంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

Budget
Budget

కేంద్ర బడ్జెట్- 2022ను ప్రకటించేందుకు ఇంకా 10 రోజుల సమయం మాత్రమే ఉంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 1 ఫిబ్రవరి 2022న చేయబోయే బడ్జెట్ ప్రసంగంపై ఆరోగ్య సంరక్షణ రంగం ఎన్నో ఆశలతో ఎదురుచూస్తోంది. కరోనా వలన ప్రజలు భయం భయంగా బతుకీడుస్తున్నారు. ఈ నేపధ్యంలో రానున్న బడ్జెట్ లో వైద్యారోగ్యం కోసం ప్రభుత్వం ఎంతమేర కేటాయింపులు జరపవచ్చనే దానిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఆరోగ్య సంరక్షణ కోసం బడ్జెట్‌లో అధిక కేటాయింపులు జరపాలని నిపుణులు కోరుతున్నారు.

Also Read: మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారా… అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

ఆరోగ్య సంరక్షణకు ఈసారి 10-12 శాతం నిధులు అధికంగా కేటాయించాలని నిపుణులు చెబుతున్నారు. హెల్త్ కేర్ కోసం రూ.18,000 కోట్ల అధిక కేటాయింపులను పొందే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. 2021 కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ఆరోగ్యంపై రూ.223,846 కోట్లు మొత్తం వ్యయంగా ప్రకటించారు. టీకాల కోసం కేటాయించిన నిధిని ఈ బడ్జెట్‌లోనూ కొనసాగే అవకాశం ఉంది. వ్యాక్సిన్‌ కొనుగోలు కోసం ప్రభుత్వం ఏకంగా రూ. 50వేల కోట్లు కేటాయించింది.

కరోనా కారణంగా వివిధ ఆరోగ్య సంరక్షక పథకాలకు మరికొంత బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సెషన్ జనవరి 31, 2022న ప్రారంభం కానుంది. నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2022న పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ -2022ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్ వరకు కొనసాగుతాయి. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం ప్రారంభమయ్యే బడ్జెట్ సెషన్స్ తొలి భాగం ఫిబ్రవరి 11న ముగుస్తుండగా, నెల రోజుల విరామం తర్వాత రెండో సెషన్ మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు కొనసాగనున్నాయి.

Also Read: ఆ అసంతృప్తే ఎన్టీఆర్ ను చరిత్రలో నిలిచేలా చేసింది…

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

1 COMMENT

  1. […] NTR: 1963లో తమిళ తెలుగు భాషల్లో విడుదలైన పౌరాణిక చిత్రం కర్ణ. రెండు ప్రాంతాల్లో కూడా అద్భుత విజయాన్ని సాధించింది. కర్ణ పాత్రలో నటించిన శివాజీ గణేశన్ కు చాలా మంచిపేరు వచ్చింది. శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్ నటించారు. ఇద్దరి పాత్రలకి ప్రాధాన్యత ఉన్నా శివాజీ గణేశన్ కి వచ్చినంత పేరు ఎన్టీఆర్ కి రాలేదు. ఇది ఎన్టీఆర్ కి బాగా అసంతృప్తి కలిగించింది. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular