https://oktelugu.com/

కరోనాను జయించాక నాగబాబులో ఏంటీ మార్పు?

చావు ముఖం వరకు వెళ్లి వచ్చాక కొందరికి జ్ఞానోదయం అవుతుంటుంది. ఇటీవల కరోనా సోకిన తర్వాత నిర్మాత, నటుడు బండ్ల గణేష్ చాలా మారాడు. పలు సేవా కార్యక్రమాలు చేశాడు. ఈ క్రమంలోనే కరోనా సోకి చికిత్స పొందాక మెగా బ్రదర్ నాగబాబులో కూడా చాలా స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. మునుపటిలా ఆయనలోని ఫైర్ బ్రాండ్ కనుమరుగై ఇప్పుడు శాంత పురుషుడు కనిపిస్తున్నాడన్న టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది. Also Read: మిహీకాతో ప్రేమాయణంపై రానా ఏమన్నాడంటే? కరోనాకు […]

Written By: , Updated On : October 8, 2020 / 11:42 AM IST
Follow us on

చావు ముఖం వరకు వెళ్లి వచ్చాక కొందరికి జ్ఞానోదయం అవుతుంటుంది. ఇటీవల కరోనా సోకిన తర్వాత నిర్మాత, నటుడు బండ్ల గణేష్ చాలా మారాడు. పలు సేవా కార్యక్రమాలు చేశాడు. ఈ క్రమంలోనే కరోనా సోకి చికిత్స పొందాక మెగా బ్రదర్ నాగబాబులో కూడా చాలా స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. మునుపటిలా ఆయనలోని ఫైర్ బ్రాండ్ కనుమరుగై ఇప్పుడు శాంత పురుషుడు కనిపిస్తున్నాడన్న టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది.

Also Read: మిహీకాతో ప్రేమాయణంపై రానా ఏమన్నాడంటే?

కరోనాకు ముందు వరకు నాగబాబు చిరంజీవి, పవన్ కళ్యాణ్ సహా జనసేనను ఏమన్నా అంటే ఒంటికాలిపై లేచి చెడామడా తిట్టేసేవాడు. ఇటీవల కాలంలో గాంధీ కంటే గాడ్సేను పొగడడం.. రాంగోపాల్ వర్మ, యండమూరి వీరేంద్రనాథ్ వంటి వారిపై దుమ్మెత్తి పోశాడు.

అయితే ఇప్పుడు కరోనా నుంచి కోలుకున్నాక విడుదల చేసిన తొలి వీడియోలో నాగబాబు ఆశ్చర్యపరిచాడు. తన శత్రువులైన రాంగోపాల్ వర్మ, యండమూరి వీరేంద్రనాథ్ లను నాగబాబు పొగడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. షాక్ కు గురిచేసింది. నాగబాబులో ఏంటీ మార్పు అని అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది.

గతంలో ఒకసారి నాగబాబు వర్మ, యండమూరిలను ‘అక్కూ పక్షి’ వంటి పదాలతో బహిరంగంగా విమర్శించారు.ఓ బహిరంగ సభలో నటుడు రామ్ చరణ్ ని యండమూరి వీరేంద్రనాథ్ తక్కువ చేసి మాట్లాడినప్పుడు నాగబాబు రెచ్చిపోయారు. ఆ తర్వాత చిరంజీవిపై విమర్శలు చేసిన ఆర్‌జివి, యండమూరి ఇద్దరికీ చెంప చెల్లుమనేలా కౌంటర్లు ఇచ్చాడు నాగబాబు.

తాజా యూట్యూబ్ వీడియోలో నాగబాబు వర్మ, యండమూరిని పొగడడం విశేషంగా మారింది. ఇది మీడియా దృష్టిని ఆకర్షించింది.. రామ్ గోపాల్ వర్మలోని అత్యంత ప్రాచుర్యం పొందిన లక్షణం గురించి నాగబాబు వివరించడం విశేషంగా మారింది. వర్మ ఎన్ని కష్టాలు పడ్డాడు.. ఎలా ఎదిగాడో ఒక వ్యక్తి త్వ వికాస నిపుణుడిగా నాగబాబు పంచుకోవడం విశేషం. ఈ వీడియోలో రామ్ గోపాల్ వర్మను ఒక తెలివైన డబ్బు సంపాదించే గొప్ప వ్యక్తిగా నాగబాబు ఉదాహరణగా చెప్పుకొచ్చాడు.

Also Read: రాజమౌళి ఔట్.. మహేష్ నెక్ట్స్ మూవీ ‘త్రివిక్రమ్’తోనే?

ఈ వీడియో చూశాక కరోనా జయించాక నాగబాబులో స్పష్టమైన మార్పు వచ్చిందని అర్థమవుతోంది. నాగాబాబు తన సహజశైలిని వదిలేశాడని తెలుస్తోంది. శత్రువులను కూడా మెచ్చుకొని ఫిదా చేశాడు. ఇది చాలా అరుదు. దీంతో ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రజలు సాధారణంగా తమకు నచ్చిన వాటిపై ఏదైనా చెబితే ఇంటస్ట్రింగ్ గా వింటారు. ఇప్పుడు నాగబాబు కూడా విడుదల చేసిన వీడియో వైరల్ అయ్యింది.