Lok Sabha Elections Results 2024: కేంద్ర మంత్రివర్గంలో ఏపీకి చోటు ఉంటుందా? ఉంటే ఎన్ని మంత్రి పదవులు లభిస్తాయి?మూడు పార్టీల మధ్య ఎలా సర్దుబాటు చేస్తారు?ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. జూన్ 8న రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మేతగా మోడీ రికార్డ్ సాధించనున్నారు. అయితే గతం మాదిరిగా ఎన్డీఏ ఏకపక్ష విజయం దక్కించుకోలేదు. మిత్రపక్షాల సాయం అనివార్యంగా మారింది. ఎన్డీఏ లో రెండో అతిపెద్ద పార్టీగా టిడిపి అవతరించింది. బిజెపి సైతం మూడు ఎంపీ స్థానాలను, జనసేన మరో రెండు లోక్సభ స్థానాల్లో విజయం సాధించింది.దీంతో ఏపీకి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి మోడీపై ఏర్పడింది.
గత ఐదేళ్లుగా కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కలేదు. గత ఎన్నికలకు ముందు ఎన్ డి ఏ నుంచి టిడిపి బయటకు వచ్చింది. ఎన్నికల్లో మూడు పార్లమెంట్ స్థానాలతో సరిపెట్టుకుంది. అదే సమయంలో బిజెపి సైతం ఓడిపోయింది. వైసీపీకి 23 పార్లమెంట్ స్థానాలు వచ్చినా.. ఆ పార్టీ ఎన్డీఏలో చేరడానికి ఇబ్బందికర పరిస్థితులు ఉండేవి. పోనీ రాజ్యసభ సభ్యులకు మంత్రి పదవులు ఇవ్వడానికి కూడా బిజెపి నాయకత్వం ఆసక్తి చూపలేదు. దీంతో ఏపీ నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది.
అయితే ఈసారి ఏపీకి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించడం అనివార్యం. పైగా బిజెపితో పాటు టిడిపి, జనసేన ఎన్డీఏ కీలక భాగస్వామ్యులు గా మారాయి. బిజెపి సైతం రాష్ట్ర క్యాబినెట్లో భాగస్వామ్యం కానుంది. అందుకే ఈసారి కూటమికి ఐదు నుంచి ఏడు మంత్రి పదవులు ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. మరోవైపు చంద్రబాబు ఏపీకి లోక్సభ స్పీకర్ పదవి అడుగుతారని టాక్ నడుస్తోంది. వీలైనంతవరకు కేంద్రం నుంచి పదవులు, నిధులుతీసుకోవాలన్న ఆలోచనతో చంద్రబాబు ఉన్నారు. అటు కేంద్రంలో మోడీ సుస్థిర పాలన అందించాలంటే స్నేహితులు కీలకంగా మారారు. మరోవైపు అంతులేని విజయంతో ఆశావాహుల సంఖ్య కూడా అధికంగా ఉంది. అందుకే కేంద్రంతో వీలైనంతవరకు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకు సాగాలని చంద్రబాబు డిసైడ్ అయినట్టు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.