https://oktelugu.com/

Indian Rupee: ఆ దేశాల కరెన్సీ విలువ మన రూపాయికన్నా తక్కువ.. ఆదేశాలేంటో తెలుసా?

ప్రపంలో అత్యంత బలమైన కరెన్సీగా అమెరికన్‌ డాలర్‌ను భావిస్తారు. ఆ డాలర్‌తో పోలిస్తే మన కరెన్సీ రూ.83గా ఉంది. డాలర్‌తో పోలిస్తే మన కరెన్సీ విలువ పెరుగూతనే ఉంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 15, 2024 / 01:06 PM IST

    Indian Rupee

    Follow us on

    Indian Rupee: ప్రపంచలో ప్రతీ దేశానికి కరెన్సీ ఉంటుంది. దీని విలువ ఇతర దేశాల కంటే తక్కువ లేదా ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలో అత్యంత ఎక్కువ విలువ ఉన్నది కువైట్‌ కరెన్సీ దినార్‌. ఇది ఒక దినార్‌.. భారత్‌లో రూ271గా ఉంది. ఇక అమెరికా డాలర్‌లో మన రూపాయి 83గా ఉంది. కరెన్సీ విలువ ఆదేశ ఆర్థిక స్థిరత్వాన్ని, అభివృద్ధిని, వ్యాపార లావాదేవీలను సూచిస్తుంది. అమెరికా డాలర్, చైనా యన్‌ కరెన్సీలు కూడా భిన్నంగా ఉంటాయి. ప్రపచంంలో చాలా దేశాల కరెన్సీ కన్నా మన రూపాయి విలువ తక్కువగా ఉంది. కానీ కొన్ని దేశాల్లో భారత రూనాయికి చాలా రెట్లు ఎక్కువ విలువ ఉంది.

    వియత్నాం..
    వియత్నాం కరెన్సీ డాంగ్‌ అంటారు. ఆ దేశంలో భారత రూపాయి విలువ రూ.303.62గా ఉంది. అంటే మం ఒక రూపాయి ఇస్తే విత్నామీస్‌ డాంగ్‌ 303.62 ఇస్తారన్నమాట. ఆ దేశంలో భారత రూపాయి విలువే చాలా ఎక్కువ.

    లావోస్‌..
    లావెస్‌ కరెన్సీని కిప్‌ అంటారు. ఈ దేశంలో కూడా మన రూపాయి విలువే ఎక్కువ. ఆ దేశంలో ఒక రూపాయి విలువ 265.47 కిప్‌లకు సమానం. భారత రూపాయి విలువ ఎక్కువగా ఉన్న రెండు దేశం లావోస్‌.

    ఇండోనేషియా..
    ఇక ప్రపంచంలో టూరిస్ట దేశం ఇండోనేషియా. ఇక్కడ కూడా మన రూపాయి విలువ ఎక్కువే. ఇండోనేషియా కరెన్సీని రూపియా అంటారు. ఇక్కడ మన రూపాయికి 193.92 ఇండోనేషియా రూపియాకి సమానం.

    పరాగ్వే..
    పరాగ్వే కరెన్సీని గురానీ అంటారు. ఈ దేశంలో కూడా మన రూపాయి విలువ ఎక్కువే. ఇక్కడ మనం ఒక రూపాకి.. 90.31 పరాగ్వే గురానీలకు సమానం.

    కంబోడియా
    కంబోడియా కరెన్సీని రియాల్‌ అంటారు. ఇక్కడ కూడా మన రూపాయి విలువ ఎక్కువే. ఈ దేశంలో ఒక రూపాయి ఇస్తే.. 49.21 రియాల్‌ ఇస్తారు.

    ఈదేశాల్లో మన రూపాయి విలువ బలంగా ఉంది. వీటిలో కంబోడియా, వియత్నాం, ఇండోనేషియా మంచి పర్యాటక దేశాలు మన రూ.లక్షతో వెల్లినా అక్కడ ఎంజాయ్‌ చేయవచ్చు.