
Huzurabad Bypoll: హుజూరాబాద్ ఎన్నికలు చివరి అంకాన్ని చేరుకున్నాయి. ప్రచార పర్వం కూడా ముగిసిపోయింది. ఎన్నికలకు 72 గంటల ముందు ప్రచారాన్ని నిలిపివేయాలనే ఎన్నికల ఆదేశాల మేరకు నిన్న రాత్రి వరకే ప్రచారం చేసుకునేందుకు అవకాశం కలిగింది. హుజూరాబాద్ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రధానంగా రెండు పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేశాయి. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ల నుంచి ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నా.. గెలుపోటములు మాత్రం రెండు పార్టీల మధ్యనే ఉండనున్నాయి. హుజూరాబాద్ విజయం రెండు పార్టీలకు చాలా ముఖ్యం. అందుకే ఆ పార్టీలు ప్రచారంలో ఎక్కడా తగ్గలేదు.
బీజేపీకి కలిసిరానున్న మెనిఫెస్టో.. ?
తన మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామ చేసి బీజేపీలో చేరారు. బీజేపీ ఆయను సాధరంగా ఆహ్వానించి అక్కున చేర్చుకుంది. హుజూరాబాద్‌లో ఈటల గెలిపించి, తమ పార్టీని గెలిపించుకునేందుకు ముఖ్య నాయకులందరూ చాలా కృషి చేశారు. ఈటల బీజేపీలోకి చేరిన దగ్గర నుంచి ఆ పార్టీ నాయకులు హుజూరాబాద్‌లో ప్రచారం మొదలు పెట్టారు. ప్రతీ గడప గడపకు వెళ్లి ప్రచారం చేశారు. అయితే ఈ ఉప ఎన్నికల కోసం బీజేపీ ప్రత్యేక మెనిఫెస్టోను తీసుకొచ్చింది. దానికి హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రమాణ పత్రం అనే నామకరణం చేసి ప్రజల్లోకి విడుదల చేసింది. దీనిపై ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారని, ఈ ప్రమాణ పత్రమే తమకు ఓట్లు తీసుకొస్తాయనే ధీమాతో ఉన్నారు బీజేపీ నాయకులు. ఈ మెనిఫెస్టో హుజూరాబాద్ నియోజకర్గ అభివృద్ధికి తాము తీసుకోబోయే చర్యలను వివరించింది.
మెనిఫెస్టోలో ఉన్నా అంశాలేంటి ?
బీజేపీకి అవకాశం ఇస్తే హుజూరాబాద్‌ను తాము ఎలా అభివృద్ధి చేస్తామనే అంశాలను అందులో స్పష్టంగా వివరించారు. రైల్వే స్టేషన్ల అభివృద్ధి, రైల్ ఓవర్ బ్రిడ్జిలు, అండర్ బ్రిడ్జిల నిర్మాణం, జమ్మికుంట లో ఉన్న రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అందులో పెర్కొన్నారు. అలాగే ప్రధాన మంత్రి ఉపాధి కల్పనా పథకం కింద నిరుద్యోగ యువతీ, యువకులకు నైపుణ్యాభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు. 60 ఏళ్లు పై బడిన రైతులందరికీ ప్రధాన మంత్రి కిసాన్ మన్ దన్ యోజన పథకం ద్వారా నెలకు రూ.3 వేల పింఛన్ ఇచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. దీంతో పాటు శ్యామ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ పథకం అమలు చేసేందుకు కృషి చేసి, జమ్మికుంట, హుజూరాబాద్ పట్టణాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకం క్రిషి సంచాయి యోజన కింద కాలువలు మరమ్మతులు చేయించడంతో పాటు ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద పక్కా రోడ్లు లేని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. వడ్డీ లేని రుణాలు, మహిళల అభివృద్ధికి సబ్సిడీ రుణాలు అందిస్తామని తెలిపారు. అన్ని గ్రామాలకు రక్షిత మంచి నీటిని అందిస్తామని, ప్రధాన మంత్రి కౌషల్ యోజన ద్వారా నిరుద్యోగులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని ఈ ప్రమాణ పత్రంలో పేర్కొన్నారు. ఈ హామీలే తమకు ఓట్లు తీసుకొస్తాయని బీజేపీ నాయకులు ధీమాగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో హుజూరాబాద్‌ను అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. మరి హుజూరాబాద్ ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తారో వేచి చూడాల్సి ఉంది.
Also Read: హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు?