బుల్లితెరపై ప్రసారమౌతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకు ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ లో భాగంగా గుడికి అని చెప్పి కార్తీక్ సౌందర్య హాస్పిటల్ కి వెళ్తారు. దీప కూడా హిమ బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడానికి ల్యాబ్ కి వెళ్తుంది. దారి పొడవునా సౌందర్య కార్తీక్ తన దగ్గర ఏదో దాస్తున్నారు తనని మోసం చేస్తున్నారని బాధపడుతుంది. ఇక హాస్పిటల్ కి వెళ్ళిన దీప హిమ బ్లడ్ శాంపిల్ అడుగుతుంది.రిపోర్ట్స్ తీసుకురావడానికి స్టాఫ్ లోపలికి వెళ్లడంతో గతంలో అదే ల్యాబ్ నుంచి పల్లవి అనే అనే అమ్మాయి ద్వారా మోనిత శాంపిల్స్ తీసుకొని కృత్రిమ గర్భం ధరించినదన్న మాటలు గుర్తుకు వస్తాయి. మరోవైపు హాస్పిటల్ లో మోనిత నొప్పులు అధికమవడంతో తన పరిస్థితి చాలా సీరియస్ గా ఉంటుంది.ఈక్రమంలోనే మత్తు ఇంజక్షన్ వేసుకోవడానికి నిరాకరిస్తూ కార్తీక్ రావాలి భారతి చనిపోయే ముందు తనకు ఒక నిజం చెప్పాలి అంటూ మొండి పట్టు చేస్తుంది.
ఇక హాస్పిటల్లో రిపోర్ట్స్ కోసం వెళ్లిన అమ్మాయి రాగానే మీ పేరు పల్లవినా అని దీప అడుగుతుంది. అవును అని చెప్పగా నీకసలు బుద్ధుందా.. సిగ్గు లేదు నీకు ఇలాంటి పనులు చేయడానికి? అని తిట్టడంతో అసలేం జరిగింది మేడం అంటూ పల్లవి అంటుంది. మా ఆయన శాంపిల్స్ ఇక్కడికి ఇస్తే నువ్వు డబ్బు చేసుకోవడం కోసం డాక్టర్ మోనితకి మా ఆయన శాంపిల్స్ ఇస్తావా. నీ పై కేసు వేస్తా అంటూ పల్లవి పై అరుస్తుంది.దీంతో ఆమె చూడండి మేడం మా ల్యాబ్ సిటీలో ఎంతో పేరున్న ల్యాబ్ ఇక్కడ అలాంటివి ఏమి జరగవు. కోట్ల రూపాయలు ఇచ్చినా మేము ఇవ్వము కావాలంటే మీరు ఏమైనా చేసుకోండి సమాధానం చెబుతామని చెప్పడంతో ఒక్కసారిగా దీప షాక్ అవుతుంది.
ఇక హాస్పిటల్ లోమోనిత ఉలుకూ పలుకూ లేకుండా పడిపోతుంది. కార్తీక్, సౌందర్య అక్కడికి వెళ్లడంతో భారతి తనను లేపుతూ ఎవరొచ్చారో చూడు. మోనిత అంటూ ఉండగా ఇదొక కొత్త డ్రామా అని కార్తీక్ అనడంతో లేదు కార్తీక్ చాలా సీరియస్ గా ఉందని భారతి చెబుతుంది. దాంతో మోనిత కళ్ళు తెరిచి వచ్చావా కార్తీక్ నీకు ఒక నిజం చెప్పాలి.నాకు తెలుసు నేను చచ్చి పోతాను అని నేను చచ్చిపోయేలోగా నీకు ఒక నిజం చెప్పాలి అది మన బిడ్డ భవిష్యత్తుకు పునాది అంటూ చెబుతుంది. నేను కృత్రిమ గర్భం ద్వారా తల్లిని కాలేదు. సహజంగానే నేను తల్లిని అయ్యాను అని చెప్పడంతో కార్తీక్ షాక్ అవుతాడు.స్టాప్ ఇట్ మోనిత చూసావా మళ్లీ కొత్త నాటకం మొదలు పెడుతుంది అని అనడంతో చనిపోయేముందు నేను అబద్ధం చెప్పలేదు నా మీద ఒట్టు నీ మీద అనగా కోర్టులో కూడా ఇలాంటి ఓట్లు వేశారు కదా అని కార్తీక్ తనని అవమానిస్తాడు. అలాగే కార్తీక్ డాక్టర్ భారతి పై ఆగ్రహం వ్యక్తం చేశాడు ఈ కుట్రలో నీకు భాగం ఉందా అంటూ ఆమెను తిడతాడు.
మరి ఇన్ని రోజులు కృత్రిమ గర్భం అని ఎందుకు అబద్దం చెప్పావు అని చెప్పడంతో నిజం తెలిస్తే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదో అప్పుడు లోకం నన్ను ఒక పతితగా ముద్ర వేస్తుంది. మన బిడ్డకు ఎన్నో అవమానాలు జరుగుతాయి అందుకోసమే ఈ విషయం దాచిపెట్టాను అసలు విషయాన్ని బయటపెట్టడంతో ఒక్కసారిగా షాక్ అవుతారు. అయినా కార్తీక్ ఇవేమి పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే భారతి తను చనిపోతుంది కార్తీక్ అని చెప్పడంతో రోజు ఎంతో మంది చనిపోతారు అలాంటి వారిలో తాను ఒకటి నాకేంటి సంబంధం అంటూ అక్కడినుంచి వెళ్తాడు.ఈ క్రమంలోనే మోనిత నమ్ము కార్తీక్ ప్లీజ్ తను మన బిడ్డ మన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అంటూ అరుస్తూ స్పృహ కోల్పోతుంది.మరి తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగనుంది కార్తీక్ తనని అంగీకరిస్తాడా ..లేదా..అనేది తెలియాల్సి ఉంది.