https://oktelugu.com/

విడాకులతో బిల్ గేట్స్ భార్యకు ఎంతొస్తుంది?

కృష్ణా రామా అంటూ ఈ వృద్ధాప్యం ఒకరినొకరు తోడుగా నీడగా ఉండాల్సిన వేళ ఈ అపరకుబేరుల జంట విడాకులు తీసుకోవడం.. ప్రపంచవ్యాప్తంగా అందరినీ షాక్ కు గురిచేసింది. బిల్ గేట్స్ వయసు ఇప్పుడు 65 ఏళ్లు కాగా.. మెలిందా వయసు 56 ఏళ్లు. ఈ వయసులో సాధారణంగా తోడుంటారు.కానీ వీరిద్దరూ విడాకులు తీసుకోవడం షాక్ కు గురిచేసింది. దాదాపు 27 ఏళ్ల వీరి వైవాహిక జీవితానికి తెరపడింది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు అయిన బిల్ గేట్స్ కు, ఆయన […]

Written By:
  • NARESH
  • , Updated On : May 4, 2021 / 02:21 PM IST
    Follow us on

    కృష్ణా రామా అంటూ ఈ వృద్ధాప్యం ఒకరినొకరు తోడుగా నీడగా ఉండాల్సిన వేళ ఈ అపరకుబేరుల జంట విడాకులు తీసుకోవడం.. ప్రపంచవ్యాప్తంగా అందరినీ షాక్ కు గురిచేసింది. బిల్ గేట్స్ వయసు ఇప్పుడు 65 ఏళ్లు కాగా.. మెలిందా వయసు 56 ఏళ్లు. ఈ వయసులో సాధారణంగా తోడుంటారు.కానీ వీరిద్దరూ విడాకులు తీసుకోవడం షాక్ కు గురిచేసింది. దాదాపు 27 ఏళ్ల వీరి వైవాహిక జీవితానికి తెరపడింది.

    మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు అయిన బిల్ గేట్స్ కు, ఆయన భార్య మెలిందాకు ముగ్గురు పిల్లలు. వీరి ఆధ్వర్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద సేవా సంస్థ గేట్స్ మిలిందా ఫౌండేషన్ నడుస్తోంది. ఇప్పటివరకు 53 బిలియన్ డాలర్లను వీరిద్దరూ ప్రపంచవ్యాప్తంగా పేదల కోసం ఖర్చు చేశారు.

    ప్రపంచంలోనే టాప్ 5 ధనవంతుల్లో బిల్ గేట్స్ ఒకరు. ఆయన మైక్రోసాఫ్ట్ సంస్థతో వచ్చిన సంపాదన 137 బిలియన్ డాలర్లు. ఇక వీరిద్దరి గేట్స్ ఫౌండేషన్ విలువ 50 బిలియన్ డాలర్లు. ఇక వీరి ఇంటి ఖరీదే 140 మిలియన్ డాలర్లు.

    అమెరికా చట్టాల ప్రకారం విడిపోయిన జంటకు ఆస్తిలో సమాన వాట దక్కుతుంది. ఆస్తులన్నీ సమానంగా పంచుకోవాల్సిందే. దీంతో బిల్ గేట్స్ స్థానం మరింత దిగజారుతుంది. ఆయన ప్రపంచ టాప్ ధనవంతుల జాబితానుంచి గల్లంతు అవుతాడు. ఇక ఆయన భార్య మెలిందా మాత్రం ప్రపంచ కుబేరుల మహిళల జాబితాలో టాప్ లోకి చేరుతుంది. అయితే ఇంత ఆస్తి వస్తున్న తమ ముగ్గురు పిల్లలకు ఆ ఆస్తిని పంచలేదు గేట్స్ దంపతులు. వారికి తలా 10 లక్షల మిలియన్ డాలర్లు మాత్రమే ఇవ్వడం విశేషం. వారి బాగోగులు ఎవరు చూస్తారన్నది చూడాలి.