Pawan Kalyan: “సంద్రం ఒకడికి సలాం చేయదు. శిఖరం ఒకడికి తలవంచదు. నేనంతా కలిపితే పిడికెడు మట్టి కావచ్చు. కానీ తల ఎత్తి చూస్తే ఒక దేశపు జెండాకు ఉన్నంత పొగరు ఉంది.” ఇది ఆయనకు నచ్చిన మాట. ఆయనకు నచ్చే కవి రాసే మాట. అందుకే దానిని తూ.చా తప్పకుండా పాటిస్తూ ఉంటాడు. తన ప్రాంతం కోసం పది మెట్లు కిందికైనా దిగి వస్తాడు. పది మెట్లనైనా నిర్మిస్తాడు. సారధి అంటే ఒప్పుకోడు. పదవుల మీద ఆశ ఉందా అంటే చిరునవ్వు చిందిస్తాడు. కష్టాల్లో ఉంటే కంటనీరు పెడతాడు. ఆనందం వస్తే కల్మషం లేకుండా పగలబడి నవ్వుతాడు. ఇంతవరకు 27 సినిమాలు వచ్చినా ఎందులోనూ నటించినట్టు కనిపించదు. జీవించాడు కాబట్టే ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్. ఓ సత్య దేవ్, భీమ్లా నాయక్, గబ్బర్ సింగ్ రీమేక్ సినిమాల్లో నుంచి వచ్చినవి కావచ్చు.. అవి ఆయన నిజ పాత్రలు. ముందుగానే చెప్పినట్టు ఆయన తన వాళ్ల కోసం ఏదైనా చేయగలడు. ఆ చేసే సత్తా ఉంది కాబట్టే ఇవాళ బలంగా నిలబడగలిగాడు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు కంటనీరు పెడుతున్న రాజ్యంలో.. ఇతడు మాత్రం ఒక్కడే రొమ్ము చరిచి ధైర్యంగా నిలబడ్డాడు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే చెప్పుతో కొడతా అని “కుక్క కాటుకు చెప్పు దెబ్బ” అనే సామెతను ఒక మాటలో రుచి చూపించాడు.

అవమానాలు ఎదుర్కొన్నాడు
2014 కాలమది. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో విడిపోయింది. మార్పును ఎప్పుడైనా స్వీకరించాలి కనుక.. అతడు కూడా తన ప్రాంతానికి వెళ్ళాడు.. కానీ తన ప్రాంతాన్ని ఏలేందుకు తనకున్న బలం సరిపోదని భావించి.. చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేశాడు. కానీ అంతటితోనే ఆగిపోలేదు. మద్దతు తెలిపిన అంతమాత్రాన తన బాధ్యత తీరిపోలేదని రాజధాని రైతుల పక్షాన ఉన్నాడు. ఉద్దానంలో మూత్రపిండాల వ్యాధితో బాధపడే ప్రజల పక్షాన ఉన్నాడు. ఆక్వా రంగం సమస్యలు పరిష్కరించేందుకు అక్కడి ప్రజల పక్షాన ఉన్నాడు. ఏసీ కార్లలో తిరిగి, ఒక సినిమా తీస్తే కోట్లు వెనకేసుకునే సౌలభ్యం ఉన్నప్పటికీ.. తన ప్రాంతం కోసం ఎన్నో కష్టాలు పడ్డాడు. ఇదే సమయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. కులం అంటేనే అసహ్యించుకునే ఆయన… అనుకోని పరిస్థితుల్లో ” కాపు” కే కొమ్ము కాస్తాడు అనే అపవాదును మూట కట్టుకున్నాడు. అవసరం ఉండడంతో అప్పటిదాకా జై హో అని నినాదాలు చేసిన టిడిపి కార్యకర్తలు.. “సొంత అన్నని గెలిపించుకోలేకపోయాడు.

దీని అధికారంలోకి తెచ్చానని డప్పా లు కొడుతున్నాడు అంటూ” విమర్శలు చేశారు. కుటుంబంలో ఆడవాళ్ళను బయటకు లాగారు. మూడు పెళ్లిళ్లపై రాద్ధాంతం చేశారు. అయినప్పటికీ ఆయన అతడి మాట పెగలలేదు. సొంత సామాజిక వర్గం నాయకులతో చంద్రబాబు నాయుడు నానా మాటలు అనిపించాడు. అయినప్పటికీ అతడు మాట తూలలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్. ఆ దెబ్బ 2019లో ఎంత సాలిడ్ గా పడింది అంటే.. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు 23 దగ్గరే ఆగిపోయేంతగా.. కానీ ఇన్నాళ్లకు ఎవరైతే తిట్టారో, ఎవరైతే దూషించారో వారే ఇప్పుడు దారి తెలుసుకుని వచ్చారు. అడగకుండానే సంఘీభావం తెలిపారు. ఇప్పుడు కలిసి పోటీ చేద్దామని ఆఫర్ ఇస్తున్నారు. మరి ఇందుకు జనసేనాని ఒప్పుకున్నాడా? లేదా అనేది పక్కన పెడితే? ఏనుగు దారి వెంట వెళ్తుంటే.. కుక్కలు ఎన్నో మొరుగుతాయి.. కానీ ఆ కుక్కలకు ఏనుగు ఎప్పుడూ సమాధానం చెప్పదు. అలా చెప్పి తన స్థాయిని తగ్గించుకోదు. ఇక్కడ ఏనుగు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. కుక్కలు ఎవరో వివరించాల్సిన పనిలేదు. అదేదో సినిమాలో త్రివిక్రమ్ రాసినట్టు అద్భుతం జరిగినప్పుడు ఎవరూ పట్టించుకోరు. జరిగిన తర్వాత ఎవరూ గుర్తించరు. ఇప్పుడు ఆ అద్భుతం విశాఖ నగరంలో పుట్టింది. మీసం మెలేసిన ఆ పౌరుషం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బాగుకోసం ముందడుగు వేసింది. ఆయన మాటలోనే చెప్పాలంటే ఇక యుద్ధం మొదలైనట్టే.