Manchu Vishnu- Nani: సినిమా ఇండస్ట్రీ లో పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఫ్యామిలీ నుండి వచ్చినవాళ్లు కూడా సక్సెస్ కాలేకపోతున్న హీరోలు ఉన్న ఈరోజుల్లో, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీ కి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని క్రేజ్ ని ఏర్పాటు చేసుకున్న హీరో న్యాచురల్ స్టార్ నాని..అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని మొదలుపెట్టిన నాని, ఆ తర్వాత అష్టాచమ్మా అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరో గా పరిచయం అయ్యాడు.

తొలి సినిమాతోనే ఎవరు ఈ కుర్రాడు ఇంత చలాకీగా ఉన్నాడు..యాక్టింగ్ కూడా అద్భుతంగా ఉంది..భవిష్యత్తు ఉంది ఈ కుర్రాడికి అని అందరూ అనుకున్నారు..అందరూ అనుకున్నట్టుగానే నాని అంచనాలను మించి హీరో గా సక్సెస్ అయ్యాడు..నేడు నాని సినిమా వస్తుంది అంటే ఫామిలీ ఆడియన్స్ మరియు యూత్ థియేటర్స్ కి క్యూ కట్టేస్తారు..అయితే బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ కి వచినవాళ్ళకి కెరీర్ ప్రారంభం లో అవమానాలు ఎదురు అవ్వడం సర్వసాధారణం..మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్ వంటి వారు కూడా కెరీర్ ప్రారంభం లో ఎన్నో అవమానాలను ఎదురుకున్నారు.
అలా ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తల్లో నాని కూడా అలాంటి అవమానాలే ఎదురుకున్నాడట..ఇక అసలు విషయానికి వస్తే ఒకప్పుడు నాని సినిమా విడుదల అవుతున్న సమయం లో ఇండస్ట్రీ లో ఒక్క స్టార్ హీరో కొడుకు సినిమా విడుదల అవుతుందట..రెండు సినిమాలు ఒకే రోజు విడుదల అవుతుండడం తో థియేటర్స్ సమస్య వచ్చింది.

అప్పుడు నేరుగా ఆ స్టార్ హీరో కొడుకు రంగం లోకి దిగి డిస్ట్రిబ్యూటర్స్ తో మాట్లాడాడట..’నా సినిమా ముందు ఆ పొట్టోడి సినిమా ఎంత..నా సినిమాతో వాడి సినిమా పోటీ ఏంటి..మా నాన్న ఎవరో తెలుసు కదా..జాగ్రత్త’ అంటూ బెదిరింపులు చేసి నాని సినిమాకి థియేటర్స్ దక్కనివ్వకుండా తన సినిమాని ఏసుకున్నాడు అట..కానీ చివరికి ఏమైందంటే నాని సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది..కానీ ఆ స్టార్ హీరో కొడుకు సినిమా మాత్రం వారం రోజులు కూడా థియేటర్స్ లో నిలబడలేకపోయింది..ఇంతకీ ఆ స్టార్ హీరో కొడుకు ఎవరో ఈపాటికే మీ అందరికి అర్థం అయిపోయి ఉండాలి..! అతను మరెవరో కాదు..మన మంచు విష్ణు..ఈ పేరు చెప్పగానే ఇతగాడు ఇటీవల కాలం లో ఇచ్చిన బిల్డప్స్ , చేసిన చిలిపి చేష్టలన్నీ మన కళ్ళముందు కదలాడుతూ ఉంటాయి..ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో అప్పటి నుండి నాని విష్ణు తో మాట్లాడడం మానేసాడట..ఇప్పటికి వీళ్లిద్దరి మధ్య మాటలు లేవని ఇండస్ట్రీ అందరూ అంటూ ఉంటారు.