Simbu Love Story: కోలీవుడ్ లో యూత్ మరియు మాస్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు శింబు..ఈయనకి మన టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది..మన్మధ మరియు వల్లభ వంటి సినిమాలతో ఈయన ఆంధ్ర యూత్ ని ఊపేసాడు..ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అప్పట్లో సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదనే చెప్పాలి..సినిమాల్లో ఇతగాడి నటనని మరియు డాన్స్ ని వంకపెట్టలేము..కానీ ఒరిజినల్ క్యారక్టర్ పరంగా శింబు పై తమిళనాడు లో ఎన్నో రూమర్స్ ఉన్నాయి..ఎప్పుడు వివాదాల్లోనే ఉంటాడు ఈయన..అంతే కాకుండా ఇతగాడికి హీరోయిన్స్ తో ఉన్న ఆఫ్ఫైర్ల లిస్ట్ తీస్తే చాంతాడు అంత ఉంటాది.

నయనతార, త్రిష , హన్సిక ఇలా ఒక్కరా ఇద్దరా..అలా ఇతను ఎంతోమంది టాప్ హీరోయిన్స్ తో ప్రేమాయణం నడిపాడు..కానీ ఒక్కరిని కూడా పెళ్లి చేసుకోలేదు..ఇది కోలీవుడ్ లో శింబు కి ఉన్న అతి పెద్ద బ్యాడ్ రిమార్కు గా చెప్పుకోవచ్చు..ఈమధ్య కాలం లో ఇతను కుదురుగానే ఉన్నాడు అని అందరూ అనుకున్నారు.
కానీ ఇప్పుడు లేటెస్ట్ గా ఇతను ప్రముఖ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తో ప్రేమాయణం నడుపుతున్నట్టు తెలుస్తుంది..ఇటీవలే కీర్తి సురేష్ పుట్టిన రోజు కి ఈ హీరో గ్రాండ్ బర్త్ డే పార్టీ ని ఏర్పాటు చేసాడట..తన సొంత ఖర్చులతో శింబు చేసిన ఈ బర్త్ డే పార్టీ ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది..అంత ఖర్చుపెట్టి పార్టీ చేస్తున్నాడంటే కచ్చితంగా ఈమెని కూడా బుట్టలో పడేసాడని కోలీవుడ్ మొత్తం కోడై కూస్తుంది..త్వరలోనే వీళ్లిద్దరు కలిసి ఒక సినిమా కూడా చేయబోతున్నారట..మరి కీర్తి సురేష్ తో నిజంగా ఈ హీరో ప్రేమాయణం నడుపుతుంటే కనీసం ఈమెని అయినా పెళ్లి చేసుకుంటాడా లేదా అనేది చూడాలి.

ఇక ఇతగాడి సినిమాల విషయానికి వస్తే నిన్న మొన్నటి వరుకు ఇతను చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి..కానీ మానాడు సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ట్రాక్ లోకి వచ్చాడు..ఇప్పుడు రీసెంట్ గా లైఫ్ ఆఫ్ ముత్తు సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మంచి ఊపు మీద ఉన్నాడు..భవిష్యత్తులో కూడా ఇదే ఊపుని కొనసాగిస్తాడో లేదో చూడాలి.