https://oktelugu.com/

Rupee Value: డాలర్ తో రూపాయి విలువ పడిపోతే లాభమా? నష్టమా? తెలుగు వారికి ఏం ప్రయోజనం?

Rupee Value: అమెరికా డాలర్ తో పోలిస్తే ఇండియన్ రూపాయి పతనం కొనసాగుతోంది. ఏమాత్రం ఆగకుండా దిగజారుతోంది. బుధవారం కరెన్సీ మార్కెట్ లో భారత రూపాయి బలహీనంగానే ప్రారంభమైంది. మంగళవారం డాలర్ తో రూపాయి మారకం విలువ చరిత్రలోనే కనిష్ట స్థాయి రూ.77.73కి చేరుకుంది. బుధవారం ఇది రూ.77.54ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. రూపాయి పతనాన్ని అడ్డుకోవాలని నిపుణులు ఆర్బీఐని కోరుతున్నారు. రూపాయి విలువ పతనం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రూపాయి పతనం నిలువరించకపోతే […]

Written By:
  • NARESH
  • , Updated On : May 18, 2022 / 10:47 AM IST
    Follow us on

    Rupee Value: అమెరికా డాలర్ తో పోలిస్తే ఇండియన్ రూపాయి పతనం కొనసాగుతోంది. ఏమాత్రం ఆగకుండా దిగజారుతోంది. బుధవారం కరెన్సీ మార్కెట్ లో భారత రూపాయి బలహీనంగానే ప్రారంభమైంది. మంగళవారం డాలర్ తో రూపాయి మారకం విలువ చరిత్రలోనే కనిష్ట స్థాయి రూ.77.73కి చేరుకుంది. బుధవారం ఇది రూ.77.54ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. రూపాయి పతనాన్ని అడ్డుకోవాలని నిపుణులు ఆర్బీఐని కోరుతున్నారు. రూపాయి విలువ పతనం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రూపాయి పతనం నిలువరించకపోతే దీని కారణంగా ద్రవ్యోల్బణం ప్రజలను మరింత దెబ్బతీస్తుంది. ముఖ్యంగా దిగుమతులు మరీ ఖరీదుగా మారి దేశంలో ధరలు ఆకాశాన్ని అంటుతాయి. అయితే డాలర్ పెరుగుదలతో రూపాయి పతనంతో మరో లాభం కూడా ఉంది. ముఖ్యంగా ఐటీ రంగానికి బోలెడంత లాభం. అమెరికా, విదేశాల్లోని భారతీయ టెకీలకు డాలర్ పెరుగుదలతో కాసులు కురుస్తున్నాయి. భారతీయ రూపాయిలు ఎక్కువగా వస్తుంది. వారికి ఆర్థికంగా లాభం చేకూరుతుంది.

    Rupee Value

    -రూపాయి పతనం కొనసాగితే ఏం జరుగుతుంది?
    రూపాయి విలువ పడిపోతే దేశ ఎగుమతులకు సాయంగా ఉంటుంది. క్రూడ్ ఆయిల్ రేట్లు పెరగడంతో పెరిగిన దిగుమతులు-ఎగుమతుల మధ్య గ్యాప్ తగ్గడానికి రూపాయి విలువ పతనం సాయపడుతుందని ఆర్బీఐ భావిస్తోంది.

    Also Read: Amanchi Krishna Mohan: జనసేన వైపు ఆమంచి క్రిష్ణమోహన్ చూపు.. రకారకాల ఆఫర్లతో కట్టడి చేస్తున్న జగన్

    -ప్రపంచంలోనే ఇంధనాన్ని అత్యధికంగా వినియోగించే రెండో అతిపెద్ద దేశం భారత్. 80శాతం దిగుమతుల ద్వారానే సమకూరుతోంది. ముడిచమురును ప్రభుత్వ చమురు కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్ లో కొంటున్నాయి. రూపాయితో డాలర్ విలువ క్షీణిస్తే ముడిచమురు కొనుగోలు చేయడానికి చమురు కంపెనీలు ఎక్కువ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల దిగుమతులు ఖరీదైనవిగా మారి.. సాధారణ వినియోగదారులు పెట్రోల్, డీజిల్ కోసం అధిక ధర చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల పెట్రోల్, డీజిల్ ధర కూడా పెరుగుతుంది. ఈ క్రమంలోనే రవాణా భారమై నిత్యావసరాలు దేశంలో భగ్గుమంటాయి. సామాన్యులకు ధరాఘాతం తప్పదు.

    Rupee Value

    -విదేశాల్లో చదివే భారత విద్యార్థులకు డాలర్ విలువ పెరిగి.. రూపాయి పతనమైతే ఆర్థిక భారం తప్పదు. తల్లిదండ్రులు ఫీజు కోసం ఎక్కువ ధరకు డాలర్లకు కొని చెల్లించాలి. దీంతో విదేశాల్లో చదువు భారతీయ కుటుంబాలకు పెనుభారంగా మారుతుంది.

    -విదేశాల్లోని భారతీయులకు లాభం

    భారతీయులు ఎక్కువగా గల్ఫ్, యూరప్, అమెరికాలో పనిచేస్తున్నారు. డాలర్లలో సంపాదించి తమ సంపాదనను భారత్ కు పంపిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా చెల్లింపులు చేస్తున్న దేశం భారత్. 2021 సంవత్సరంలో అమెరికా నుంచి భారత్ కు ఏకంగా 87 బిలియన్ డాలర్ల సంపద వచ్చింది. అమెరికాలోని భారతీయులు సంపాదించి ఇండియాకు ఈ భారీ మొత్తం పంపారు.భారత్ కు 20శాతం చెల్లింపులు అమెరికా నుంచే వస్తున్నాయి. ఈ చెల్లింపులు తమ దేశాలకు డాలర్ల రూపంలో పంపినప్పుడు విదేశీ మారకద్రవ్య నిల్వలు పెరగడమే కాకుండా.. ఈ బ్బు నుంచి ప్రభుత్వం తన సంక్షేమ పథకాలను అమలు చేయడానికి డబ్బును పొందుతుంది. దేశంలోని డాలర్లను తమ కరెన్సీకి మార్చుకోవడం ద్వారా ఎక్కువ రాబడిని పొందుతారు.

    Also Read: Road Accident – Balakrishna House: బాలయ్య ఇంటి గేటును ఆ లేడి ఎందుకు బద్దలు కొట్టింది?

    -ఐటీ పరిశ్రమలకు కాసుల పంట

    డాలర్ బలపడి రూపాయి విలువ పతనంతో దేశ ఐటీ కంపెనీలకు కాసులు కురుస్తాయి. ఐటీ సేవల పరిశ్రమకు దీని వల్ల పెద్ద ప్రయోజనమే దక్కుతుంది. భారత్ లోని టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్.సీ.ఎల్ వంటి భారత్ లోని అతిపెద్ద ఐటీ కంపెనీలు విదేశాలలో ఐటీ సేవలను అందించడం ద్వారా అత్యధిక ఆదాయాన్ని పొందుతున్నాయి. ఈ కంపెనీలకు డాలర్లలో చెల్లిస్తారు. ఈ దేశీయ ఐటీ కంపెనీలు తమ దేశ ఆదాయాన్ని డాలర్లలో తీసుకువచ్చినప్పుడు రూపాయి బలహీనత.. డాలర్ బలం వల్ల భారీగా డబ్బు ఆర్జిస్తారు. కాబట్టి డాలర్ బలం కారణంగా విదేశాల్లోని భారతీయ ఐటీ నిపుణులకు ఆర్థికంగా చాలా లాభం కలుగుతుంది.

    Rupee Value

    మైక్రోసాఫ్ట్ తాజాగా వలసలు నివారించడానికి ఉద్యోగుల జీతాలు డబుల్ చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ ఈ పనిచేయడంతో ఇక చేసేదేం లేక నిపుణులు తరలిపోకుండా మిగిలిన కంపెనీలు కూడా పెంచాల్సిన పరిస్థితి.. ఐటీ ఇండస్ట్రీ లో సింహభాగం మనదే కాబట్టి ఇది మన తెలుగు వారికి బోలెడంత లాభం కలుగుతుంది. అమెరికాలో భారీగా ఉన్న తెలుగు టెకీల పంట పండుతుంది. అమెరికాలో డాలర్స్ ఎక్కువ సంపాదించుకొని భారతదేశంలో ఆస్తులు ఎక్కువ కొనుక్కోవచ్చు. రూపాయి విలువ పతనం ఇక్కడి వారికి దెబ్బకానీ.. అమెరికాలోని తెలుగు వారికి, భారతీయులకు మాత్రం ఖచ్చితంగా లాభం చేకూర్చుతుంది.

    -ఎగుమతులకు ప్రయోజనం

    డాలర్ పెరుగుదలతో ఎగుమతిదారులకు పెద్ద ప్రయోజనం కలుగుతుంది. మన నుంచి విదేశాలకు వెళ్లే ఫార్మా, ఆటో రంగానికి చెందిన ఎగుమతులకు డాలర్లలో చెల్లింపులు చేస్తారు. అది భారత్ లో రూపాయిల్లో మారే సరికి ఎక్కువ ధనం వస్తుంది.

    Rupee Value

    -విదేశీ పర్యాటకులు

    ఖరీదైన డాలర్ల కారణంగా విదేశాలకు వెళ్లడం ఖరీదైనది అయినప్పటికీ భారత్ కు రావాలనుకునే విదేశీ పర్యాటకులకు ఊరట లభించింది. రూపాయి బలహీనత కారణంగా వారికి మరిన్ని సేవలు అందుతాయి. రూపాయి బలహీనత కారణంగా టూర్ ప్యాకేజీలు చౌకగా మారి దేశంలో పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుంది.

    మొత్తంగా డాలర్ విలువ పెరుగుదల.. రూపాయి విలువ పతనంతో లాభాలు, నష్టాలు కూడా ఉన్నాయి. కొందరికి మోదం.. కొందరికి ఖేదం అన్నట్టుగా పరిస్థితులున్నాయి.

    Also Read:US Green Card: అమెరికాలోని ప్రవాస భారతీయులకు శుభవార్త… గ్రీన్ కార్డు జారీ వేగవంతం
    Recommended Videos


    Tags