Amanchi Krishna Mohan: ఆమంచి క్రిష్ణమోహన్.. పరిచయం అక్కర్లేని పేరు. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో బలమైన నేత. ప్రధాన రాజకీయ పక్షాలకు దీటుగా నిలబడి ఎమ్మెల్యేగా పోటీచేసి ఇండిపెండెంట్ గా గెలిచారు. ప్రస్తుతం ఆయన వైసీపీలో కొనసాగుతున్నారు. మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఆయన జనసేనలో చేరడానికి డిసైడ్ అయ్యారు. అయితే వైసీపీ మాత్రం ఆమంచిని వదులుకునేందుకు ఇష్టపడడం లేదు. ఎలాగైనా ఆయనకు ఎక్కడో ఒక దగ్గర సీటు సర్దుబాటు చేసేందుకు అధినేత జగన్ ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయనకు అదో సమస్యగా మారిపోయింది. ఆమంచి క్రిష్ణమోహన్ లాంటి వ్యక్తులు చేజారిపోతే రాష్ట్ర వ్యాప్తంగా వేరే సంకేతాలు వెళతాయని జగన్ భయపడుతున్నారు. గత ఎన్నికల్లో చీరాల నుంచి ఆయన పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి కరణం బలరాం చేతిలో ఓడిపోయారు. తర్వాత కరణం బలరాం వైసీపీలో చేరారు. గట్టి హామీ ఇచ్చి పార్టీలో ఆయన్ను చేర్చుకున్నారు. అద్దంకి లేదా పర్చూరులో ఏదో ఒకటి కేటాయిస్తామని చెప్పారు. అయితే బలరాం మాత్రం తనకు చీరాలే ఇవ్వాలని పట్టుబట్టారు. ఆ హామీతో పార్టీలో చేరారు.

Amanchi Krishna Mohan
అయితే ఆమంచి కృష్ణమోహన్ కు ఎలా న్యాయం చేస్తారనేది సంక్లిష్టంగా మారింది.బఆమంచి 2014లో ఇండిపెండెంట్‌గా గెలిచి తర్వాత టీడీపీలో చేరారు. గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఇప్పుడు వైసీపీ నాయకత్వం ఆయనను చీరాల నుంచి సాగనంపేందుకు ప్లాన్ చేసింది. ఇప్పటి వరకూ చీరాలలో కరణంకే ప్రాధాన్యం లభిస్తోంది. అన్ని అధికారాలు ఆయనకే కట్టబెట్టారు. దీంతో స్థానిక ఎన్నికల్లో కూడా సొంత వర్గాన్ని నిలబెట్టుకున్నారు. వైసీపీలో ఉంటే తనకు ఎమ్మెల్యే అవ్వడం కుదిరే పనికాదని ఆమంచి డిసైడ్ అయిపోయారు. అన్నివిధాలా జనసేన సేఫ్ జోన్ గా భావిస్తున్నారు. టీడీపీతో పొత్తు ఉంటుందని భావిస్తుండడంతో చీరాల నుంచి రెండు పార్టీల తరుపున బరిలో దిగి కరణం ను ఓడించాలని క్రుతనిశ్చయంతో ఉన్నారు.
Also Read: Road Accident – Balakrishna House: బాలయ్య ఇంటి గేటును ఆ లేడి ఎందుకు బద్దలు కొట్టింది?
ఆమంచి జనసేన వైపు చూస్తున్నారని తెలిసిన వెంటనే వైసీపీ హైకమాండ్ రంగంలోకి దిగింది. ఆయనకు పర్చూరు సీటు ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. సీఎం జగన్ మాట్లాడదామని పిలిచారు. నిజానికి వారం రోజుల కిందట.. మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కుమారుడ్ని పర్చూరు ఇంచార్జ్‌గా ప్రకటించారు. ఇప్పుడు మళ్లీ ఆమంచికి ఇస్తామని… ఆయన పక్క చూపులు చూడవద్దని సమాచారం పంపినట్లుగా తెలుస్తోంది. అయితే తనకు పర్చూరు వద్దని చీరాలే కావాలని ఆమంచి పట్టుబడుతున్నారు.

Amanchi Krishna Mohan, jagan
చీరాల నుంచి ఇండిపెండెంట్‌గా కూడా గెలిచానని గుర్తు చేస్తున్నారు. ఆమంచిని వదులుకోకూడదని జగన్ అనుకుంటున్నారు. కరణంను పార్టీలో తీసుకుని ఇబ్బంది పడుతున్నామని వైసీపీ నేతలు భావిస్తున్నా.. ఇప్పుడేమైనా కదిలిస్తే మొదటికే మోసం వస్తుందని వెనక్కి తగ్గుతున్నారు. అదే సమయంలో ఆమంచిని వదులుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా వేరే సంకేతాలు వెళతాయని భావిస్తున్నారు. ఒక వేళ కానీ.. ఆమంచి జనసేనలో చేరితే రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ నుంచి ఇతర పార్టీల్లోకి చేరికలు పెరుగుతాయని అనుమానిస్తున్నారు. అందుకే ప్రకాశం జిల్లా నేతలకు ఆమంచిని పార్టీలో ఉండేలా చేయాలని అధినేత ఆదేశాలిచ్చారు.
Also Read:YCP- Rajya Sabha Members: ఇందులో పార్టీ జెండా మోసినవారేరీ?.. రాజ్యసభ ఎంపికపై భగ్గుమంటున్న వైసీపీ శ్రేణులు
Recommended Videos