Road Accident- Balakrishna House: హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని రోడ్డు నెంబర్ 45లో సినీనటుడు బాలకృష్ణ ఇంటి ముందు కారు ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో జనం గుమిగూడారు ఏం జరిగిందో కాసేపు ఎవరికి అర్థం కాలేదు. మంగళవారం బాలకృష్ణ ఇంటి ముందు ఓ యువతి కారు ప్రమాదానికి గురైంది. దీంతో ఆయన ఇంటి గేటును డీకొని ఆగిపోయింది. ట్రాఫిక్ జామ్ అయింది. అంబులెన్స్ కు దారి ఇచ్చే క్రమంలో కారు వేగంగా వెళ్లి డివైడర్ ను ఢీకొని బాలకృష్ణ ఇంటి వైపు వెళ్లింది. ఆయన గేటును ఢీకొట్టి బద్దలు కొట్టింది. దీంతో అందరు ఆశ్చర్యపోయారు.

Road Accident
ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. అసలే రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో జనం పెద్ద సంఖ్యలో పోగయ్యారు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎవరికి ఏం జరగకున్నా ప్రమాదం జరగడంతో ఏమైందోననే ఆందోళన అందరిలో నెలకొంది. కానీ ఎవరికి ఏం కాలేదని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నగరంలో ఇలాంటి ఘటనలు కామనే అయినా సాయంకాలం కావడంతో జనం ఎక్కువగా గుమిగూడారు.
Also Read: US Green Card: అమెరికాలోని ప్రవాస భారతీయులకు శుభవార్త… గ్రీన్ కార్డు జారీ వేగవంతం
జూబ్లీహిల్స్ చెక్ పోస్టుకు కొద్ది దూరంలోనే బాలకృష్ణ ఇల్లు ఉంటుంది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో ఏం జరిగినా క్షణాల్లో జనం పోగవడం తెలిసిందే. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. ట్రాఫిక్ సిగ్నల్ కూడా ఉండటంతో ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారు. అక్కడున్న వారిని పంపించేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు.

Road Accident
నగరంలో రోడ్లు ఎంత విశాలంగా ఉన్నా ట్రాఫిక్ సమస్య ఏర్పడుతూనే ఉంది. చిన్నపాటి ప్రమాదాలు చోటుచేసుకున్నా జనం పెద్ద సంఖ్యలో రావడంతో పోలీసులకు తలనొప్పిగా మారుతోంది. పైగా ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మంగళవారం జరిగిన సంఘటనలో ఎలాంటి నష్టం లేకపోయినా జనం భారీగా తరలిరావడంతో పోలీసులు వారిని పంపించేందుకు చెమటోడ్చాల్సి వచ్చింది.
Also Read:CM Jagan Meetings: జగన్ సభలకు ముఖం చాటేస్తున్న జనం.. గేట్లు దాటి పరుగెడుతున్నారెందుకు?
Recommended Videos