https://oktelugu.com/

Ukraine Crisis: కాలినడకన ఉక్రెయిన్ నుంచి పారిపోయిన స్టార్ హీరో

Ukraine Crisis:  యుద్ధం మొదలయ్యాక అతడు సామాన్యుడా? సెలబ్రెటీనా? అన్న తేడా లేదు. ఆ బాంబులకు ఎవరైనా బలి కావాల్సిందే. అందుకే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇప్పుడు ఉక్రెయిన్ నుంచి ప్రజలు, ప్రముఖులు పారిపోతున్నారు. దొరికిన వాహనాలు.. దొరక్కపోతే కాలినడకన కూడా పారిపోతున్న దుస్థితి నెలకొంది. ఆఖరుకు ఉక్రెయిన్ కు వచ్చిన ఒక స్టార్ హీరో సైతం దారి లేక హైవేపై నడుకుంటూ వెళ్లాడు. ఈ మేరకు తన ఫొటోను స్టార్ హీరో షేర్ చేయడంతో వైరల్ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 2, 2022 / 03:22 PM IST
    Follow us on

    Ukraine Crisis:  యుద్ధం మొదలయ్యాక అతడు సామాన్యుడా? సెలబ్రెటీనా? అన్న తేడా లేదు. ఆ బాంబులకు ఎవరైనా బలి కావాల్సిందే. అందుకే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇప్పుడు ఉక్రెయిన్ నుంచి ప్రజలు, ప్రముఖులు పారిపోతున్నారు. దొరికిన వాహనాలు.. దొరక్కపోతే కాలినడకన కూడా పారిపోతున్న దుస్థితి నెలకొంది. ఆఖరుకు ఉక్రెయిన్ కు వచ్చిన ఒక స్టార్ హీరో సైతం దారి లేక హైవేపై నడుకుంటూ వెళ్లాడు. ఈ మేరకు తన ఫొటోను స్టార్ హీరో షేర్ చేయడంతో వైరల్ గా మారింది.

    penn

    ఉక్రెయిన్ లో రష్యా సాగిస్తోన్న దండయాత్రను డాక్యుమెంటరీగా తీసి ప్రపంచానికి పుతిన్ క్రూరత్వాన్ని చూపించాలని ఓ హాలీవుడ్ స్టార్ హీరో, దర్శకుడు ఉక్రెయిన్ కు ఇటీవల వెళ్లాడు. హాలీవుడ్ నటుడు, దర్శకుడు సీన్ పెన్ తాజాగా ఉక్రెయిన్ లోని కీవ్ వెళ్లాడు. గత గురువారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మీడియా సమావేశానికి కూడా హాజరయ్యాడు. సంక్షోభ పరిస్థితులపైకొన్ని వీడియోలు కూడా రికార్డు చేశారు.

    Also Read: భవిష్యత్ ప్రధాని యోగినే.. బాంబు పేల్చిన అమిత్ షా

    అయితే ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై రష్యా బాంబుల మోత మోగిస్తోంది. చిన్న పాటి క్షిపణులు ప్రయోగించింది. దీంతో చావు భయంతో ఉక్రెయిన్ విడిచి వేలాది మంది శరణార్థులులాగానే హాలీవుడ్ స్టార్ భుజానికి బ్యాగ్ వేసుకొని.. చేతిలో మరో ట్రాలీ బ్యాగ్ పట్టుకొని హైవేపై నడుకుంటూ వెళ్లాడు. ఆ ఫొటోను షేర్ చేసిన సీన్ పెన్ ‘మా కారును రోడ్డు పక్కన వదిలేసి నేను, నా ఇద్దరు కొలీగ్స్ మైళ్ల దూరం నడుకుంటూ పోలండ్ సరిహద్దుకు చేరుకున్నాం.. ఈ ఫొటోలో కనిపిస్తున్న అన్ని కార్లలో మహిళలు, చిన్నారులే ఉన్నారు. వారి వెంట ఏం లేవు.. ’ అంటూ పరిస్థితులను ఈ హీరో వివరించాడు.

    penn

    అమెరికాకు చెందిన హాలీవుడ్ హీరో ఉక్రెయిన్ నుంచి సురక్షితంగా బయటపడినట్లు ఆయన అధికార ప్రతినిధి ఆ తర్వాత తెలిపారు. ఈయన ‘మిస్టిక్ రివర్, మిల్క్’ అనే సినిమాల్లో నటించాడు. ఇందుకు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్నాడు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలను ఆదుకుంటాడు. 2010లో హైతీ భూకంపం, 2012లో పాకిస్తాన్ వరదల సమయంలోనూ బాధితులకు స్వయంగా వచ్చి సాయం చేశాడు. 2016లో మెక్సికో డ్రగ్ డీలర్ ను ఇంటర్వ్యూ చేసి సంచలనం సృష్టించాడు. ఉక్రెయిన్ యుద్ధాన్ని కవర్ చేయడానికి వెళ్లి ఇప్పుడు కాలినడకన పారిపోవాల్సిన పరిస్థితి ఎదుర్కొన్నాడు.

    Also Read:  పాకిస్తానీ విద్యార్థులను కాపాడిన భారతీయ జెండా

    Tags