https://oktelugu.com/

Dasari Narayana Rao: దాస‌రి దృష్టిలో ఎవరు గొప్ప హీరో!

Dasari Narayana Rao: సినీ రంగంలో హీరోల న‌డుమ కొంత జ‌ల‌సీ అనేది కామ‌న్ గానే ఉంటుంది. అయితే అది పైకి చూపించక‌పోయినా కూడా.. సంద‌ర్భాన్ని బ‌ట్టి అదే బ‌య‌ట ప‌డుతుంది. టాలీవుడ్ లో చిరంజీవి, మోహ‌న్ బాబుల న‌డుమ ఇప్పుడు ఎంత‌లా సైలెంట్ వార్ జ‌రుగుతుందో చూస్తూనే ఉన్నాం. అయితే ఈ ఇద్ద‌రి మ‌ధ్య ఎప్ప‌టి నుంచో పెద్ద వారే న‌డుస్తోంద‌ని, అది ఇప్పుడు బ‌య‌ట ప‌డింద‌ని చాలామంది సినీ విమ‌ర్శ‌కులు చెబుతున్నారు. కాగా ద‌ర్శ‌క‌ర‌త్న […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 2, 2022 / 03:29 PM IST
    Follow us on

    Dasari Narayana Rao: సినీ రంగంలో హీరోల న‌డుమ కొంత జ‌ల‌సీ అనేది కామ‌న్ గానే ఉంటుంది. అయితే అది పైకి చూపించక‌పోయినా కూడా.. సంద‌ర్భాన్ని బ‌ట్టి అదే బ‌య‌ట ప‌డుతుంది. టాలీవుడ్ లో చిరంజీవి, మోహ‌న్ బాబుల న‌డుమ ఇప్పుడు ఎంత‌లా సైలెంట్ వార్ జ‌రుగుతుందో చూస్తూనే ఉన్నాం. అయితే ఈ ఇద్ద‌రి మ‌ధ్య ఎప్ప‌టి నుంచో పెద్ద వారే న‌డుస్తోంద‌ని, అది ఇప్పుడు బ‌య‌ట ప‌డింద‌ని చాలామంది సినీ విమ‌ర్శ‌కులు చెబుతున్నారు.

    Dasari Narayana Rao

    కాగా ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయణ రావు ఈ ఇద్ద‌రిలో ఎవ‌రు గొప్ప‌వారు అనే ప్ర‌శ్న‌కు ఓ సారి స‌మాధానం చెప్పి.. టాలీవుడ్ లో ప్ర‌కంప‌న‌లు సృష్టించారంట‌. అప్ప‌ట్లో ఆయ‌న వ‌రుస ప్లాపుల‌తో స‌త‌మ‌తం అవుత‌న్న స‌మ‌యంలో.. సూరిగాడు మూవీతో  బంప‌ర్ హిట్ కొట్టారు. ఈ మూవీ సక్సెస్ మీటింగ్‌ను ప్రొడ్యూస‌ర్ రామానాయుడుతో క‌లిసి నిర్వ‌హించారు.

    Also Read:  ఎన్టీఆర్ నచ్చచెబుతుంటే లేచి వెళ్లిపోయిన స్టార్ హీరోయిన్

    ఈ సంద‌ర్భంగా కొంద‌రు రిపోర్ట‌ర్లు.. ఇండ‌స్ట్రీలో సీనియ‌ర్ ఎన్టీఆర్ త‌ర్వాత స్టార్ హీరో ఎవ‌రు అని ప‌దే ప‌దే దాస‌రిని అడిగారంట‌. చాలా సార్లు దాట‌వేసే ప్ర‌య‌త్నం చేసినా.. రిపోర్ట‌ర్లు విడిచిపెట్ట‌క‌పోవ‌డంతో.. త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను బ‌య‌ట పెట్టేశాడు దాస‌రి. వాస్త‌వానికి దాస‌రికి చిరంజీవికి మ‌ధ్య కొంత గ్యాప్ ఉంది. అప్ప‌టికే చిరు మెగాస్టార్ గా ఉన్నాడు. ఈ విష‌యం చెప్ప‌డం ఇష్టం లేకే దాస‌రి దాట‌వేసే ప్ర‌య‌త్నం చేశాడు.

    Chiranjeevi-Mohan Babu

    కానీ చివ‌ర‌కు స్పందించాల్సి వ‌చ్చింది. ఇండ‌స్ట్రీలో ఒకే ఒక్క స్టార్ హీరో ఉన్నార‌ని, ఆయ‌నే చిరంజీవి అంటూ చెప్పారు.  ఇక బాల‌కృష్ణ‌ను అంద‌మైన హీరోగా, నాగార్జున‌ను తెలివైన హీరోగా వ‌ర్ణించాడు దాస‌రి.

    Chiranjeevi Mohan Babu

    ఇలా చిరంజీవిని పొగుడుతూనే.. మోహ‌న్ బాబును వెనకేసుకొచ్చాడు. అయితే అప్ప‌ట్లో ఈ కామెంట్లు టాలీవుడ్ లో సంచ‌ల‌నం రేపాయంట‌. చాలా రోజులు వీటిపై చ‌ర్చోప చ‌ర్చ‌లు సాగాయ‌ని స‌మాచారం.

    Also Read:  ఒకే పార్టీలో ధనుష్‌ – ఐశ్వర్య.. కానీ పలకరింపు లేదు

    Tags