ఇప్పటి నుంచే స్కూళ్లు, కాలేజీలకు సెలవులు

ఓ వైపు కరోనా కల్లోలం.. మరోవైపు ఈ టైంలో స్కూళ్లు, కాలేజీలు నడిస్తే విద్యార్థుల భవిష్యత్ కే ప్రమాదం అని తెలిసి తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు కేసీఆర్ సర్కార్ సెలవులు ప్రకటించింది. ఏప్రిల్ 27 నుంచి మే 31 వరకు సెలవులు ఇస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. వేసవి సెలవుల నిర్ణయంపై సీఎస్, విద్యాశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయం […]

Written By: NARESH, Updated On : April 25, 2021 2:43 pm
Follow us on

School in telangana

ఓ వైపు కరోనా కల్లోలం.. మరోవైపు ఈ టైంలో స్కూళ్లు, కాలేజీలు నడిస్తే విద్యార్థుల భవిష్యత్ కే ప్రమాదం అని తెలిసి తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు కేసీఆర్ సర్కార్ సెలవులు ప్రకటించింది.

ఏప్రిల్ 27 నుంచి మే 31 వరకు సెలవులు ఇస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. వేసవి సెలవుల నిర్ణయంపై సీఎస్, విద్యాశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారని సబితా తెలిపారు. ఏప్రిల్ 26ను ప్రస్తుత విద్యాసంవత్సరం చివరి పనిదినంగా పరిగణిస్తామని సబిత తెలిపారు.

కరోనా విస్తరించిన నేపథ్యంలో కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే పదోతరగతి పరీక్షలను విద్యాశాఖ రద్దు చేసింది. ఈ మేరకు 5,21,392 మంది విద్యార్థులను పాస్ చేసినట్లు గుర్తు చేశారు. 1-9వ తరగతులకు చెందిన 53.79 లక్షల మంది విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసినట్టు తెలిపారు.

ప్రస్తుతం కరోనాతో మళ్లీ స్కూళ్లు, కాలేజీలు తెరిచే అవకాశాలు లేకపోవడం.. మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో సెలవులు ప్రకటించారు. జూన్ 1న ప్రభుత్వం దీనిపై నిర్ణయిస్తుందని తెలిపారు.